బ్లాక్ హెడ్స్ ని సులువుగా తొలగించే.. టెస్టెడ్ హోం రెమిడీస్

బ్లాక్ హెడ్స్ ముఖంలో అందం మొత్తం హరించేస్తాయి. బ్లాక్ హెడ్స్ నివారించుకోవడం కోసం మార్కెట్లో అందుబాటులో ఉండే అన్ని రకాల క్రీములను ట్రై చేసి ఉంటారు. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రస్తుతానికి కనబడకుండా పోయినా, తిరిగి వస్తుంటాయి. బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి మరిన్ని ఖరీదైన ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకుంటుంటారు.

వైట్ హెడ్స్ కంటే తక్కువగా కనిపించినా, బ్లాక్ హెడ్స్ మాత్రం చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి. ముఖంలో దుమ్ము ధూళి చేరడం వల్ల, సరైన శుభ్రత పాటించకపోవడం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏర్పడతాయి.

చర్మ రంద్రాల్లోకిన దుమ్ము, ధూళి చేరినప్పుడు, దీన్ని శుభ్రం చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి, చర్మ రంద్రాల్లోపల ఉన్న డస్ట్ ను తొలగించడంతో బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ముఖంలో బ్లాక్ హెడ్స్ ఉన్నప్పుడు, వాటిని గిల్లడం, లేదా ఫ్లక్ చేయడం లాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల టైమ్ వేస్ట్, చర్మ రంద్రాల మద్య ఎక్కువ గ్యాప్ ఏర్పడుతుంది. ఇలా తెరచుకున్న చర్మ రంద్రాల్లో తిరిగి డస్ట్ చేరడం వల్ల బ్లాక్ హెడ్స్ తిరిగి ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది.

కాబట్టి, బ్లాక్ హెడ్స్ ను నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి . ఇవి రెడీమేడ్ గా..చౌకగా మనకు అందుబాటులో ఉన్నాయి

1. దాల్చిన చెక్క:
బ్లాక్ హెడ్స్ తొలగించడంలో తేనె, దాల్చిన చెక్క ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. దాల్చిన చెక్క పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకుని అందులో తేనె మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. రాత్రి నిద్రించే ముందు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


2. ఓట్ మీల్:
ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ లో, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. మూడు బాగా మిక్స్ చేస్తూ పేస్ట్ చేసి, తర్వాత ముఖంలో బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం మేడ్ బ్లాక్ హెడ్ రిసిపితో చర్మానికి పోషకాలు కూడా అందుతాయి.



3. గ్రీన్ టీ:
గ్రీన్ టీ మనకు అందుబాటులో ఉండే వస్తువు.బ్లాక్ హెడ్స్ తొలగించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రీన్ టీ ఆకులను మెత్తగా పొడి చేసి తర్వాత , అందులో కొద్దిగా నీరు మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి స్క్రబ్ చేయాలి.



4. సాల్ట్ వాటర్:
ఎప్సమ్ సాల్ట్ ను అరకప్పు నీటిలో వేసి కరిగించాలి. తర్వాత ఈ నీటిలో శెనగపిండి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి బాగా డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


5. జోజోబా ఆయిల్ :
జోజోబా ఆయిల్లో క్లీనింగ్ లక్షణాలు ఎక్కువ. ఇది చర్మ రంద్రాలను ఎఫెక్టివ్ గా శుభ్రం చేస్తుంది. ముఖానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసినట్లే జోజోబా ఆయిల్ ను ముఖానికి అప్లై చేయాలి. రాత్రి నిద్రించే ముందు అప్లై చేయడం వల్లఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉదయం శుభ్రం చేసుకుంటే చర్మ రంద్రాలను శుభ్రం చేయడంతో పాటు, చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.



6. స్ట్రాబెర్రీ:
చర్మంను శుభ్రం చేయడంలో స్ట్రాబెర్రీ గ్రేట్ రెమెడీ. చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. స్ట్రాబెర్రీ జ్యూస్ ను ముఖానికి అప్లై చేసి డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రిఫ్రెషింగ్ లుక్ పొందుతారు.


7. చార్కోల్ :
పురాతన కాలం నుండి చార్కోల్ ను క్లెన్సర్ గా ఉపయోగిస్తున్నారు. చార్కోల్ ఫేస్ స్కబ్ ను పౌడర్ గా చేసి, రెగ్యులర్ ఫేస్ వాష్ గా ఉపయోగించడం వల్ల ముఖంను శుభ్రం చేస్తుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో నేచురల్ పద్దతి . సులభంగా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.


8. పసుపు:
పసుపులో గ్రేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ ఫ్రెండ్లీ సాండిల్ వుడ్ పౌడర్ లో కొద్దిగా పసుపు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీనికి కొద్దిగా పాలు జోడించి పేస్ట్ లా తయారైన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి . ఈ ప్యాక్ వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోవడంతో పాటు, చర్మంలో గ్లో వస్తుంది.


9. టమోటోలు:
టమోట రసం బ్లాక్ హెడ్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. టమోటో రసానికి కొద్దిగా శెనగపిండిని మిక్స్ చేసి పేస్ట్ లా చేసి, తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



10. ముల్తానీ మట్టి:
ముల్తానీ మట్టిలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి , పేస్ట్ లా తయారైయ్యాక ముఖానికి, బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్