క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి 7 బెస్ట్ వెజిటేబుల్స్ ..!
క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి 7 బెస్ట్ వెజిటేబుల్స్ ..!
క్లియర్ గా, మెరుస్తూ ఉండే స్కిన్ స్ట్రక్చర్ ను కలిగి ఉండాలన్నిది ప్రతి ఒక్కరి డ్రీమ్. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఫర్ఫెక్ట్ స్కిన్ కలిగి ఉంటారు . అలా ఉండటం వారి అద్రుష్టమనుకోండి..., ఇక మిగిలిన వారి సంగతేంటి? అటువంటి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి కొన్నివెజిటేబుల్స్ ఉన్నాయి.
టీనేజ్ లో ఉన్నవారు ఎప్పుడు చర్మ సమస్యలను ఎదుర్కుంటుంటారు. ముఖ్యంగా టీనేజ్ లో మొటిమలు, మచ్చలు ఇబ్బంది కలిగిస్తాయి. టేనేజర్స్ లోనే కాదు, పెద్దవారిలో కూడా ఈ సమస్యలుంటాయి . పెద్దల్లో వయస్సు పైబడేకొద్ది స్కిన్ సమస్యలు ఎక్కువ అవుతాయి. అడల్ట్స్ లో స్కిన్ సమస్యలతో పాటు, చర్మ రంద్రాలు పెద్దగా అవ్వడం, చర్మం వదలవ్వడం వంటి సమస్యలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి.
చర్మరంగును కాంతివంతంగామార్చే ఫ్రూట్స్&వెజిటేబుల్స్
అయితే, ఈ సమస్యలన్నింటికి మన వంటగదిలోనో, మన ఇంట్లో ఉండే రిఫ్రిజరేటర్లోనే పరిస్కార మార్గాలున్నాయి.
చర్మ సమస్యలను నివారించుకోవడానికి వెజిటేబుల్స్ ఉపయోగించడం సురక్షితమేనా..? ఖచ్చితంగా అవునే చెబుతున్నారు నిపుణులు, వెజిటేబుల్స్ బ్యూటిలో భాగంగా ఉపయోగించడం వల్ల ఇవి చర్మానికి ఎలాంటి ఇరిటేషన్ కలిగించవు.
చంకల్లో డార్క్ ప్యాచ్ ను తొలగించే ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ మాస్క్
మరో ముఖ్యమైన విషయమేమింటే, మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే చౌకైనవి. ఇతర బ్యూటీ క్రీములు, బ్యూటీ ట్రీట్మెంట్స్ కంటే ఎఫెక్టివ్ గా ఫలితాలను అందిస్తాయి. చర్మ సమస్యలు ఎలాంటివైనా నివారించుకోవడానికి వెజిటేబుల్స్ గ్రేట్ గా సహాయపడుతాయంటున్నారు సౌందర్య నిపుణులు. వీటిని చర్మ సంరక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు . వీటిని ఉపయోగించడం వల్ల ఫలితాలు ఆలస్యమైనా..ఎఫెక్టివ్ మార్పులను మీరు గమనిస్తారు. కాబట్టి, కాస్త ఓపిగ్గా వెజిటేబుల్స్ ను స్కిన్ కేర్ లో ఉపయోగిస్తే మీరు కోరుకునే క్లియర్, అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందుతారు.
టమోటో :
టమోటోల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులో అసిడిక్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ టోన్ ను తెల్లగా మార్చుతుంది. టాన్ నివారిస్తుంది. డార్క్ స్పాట్స్ ను నిధానంగా తొలగిస్తుంది.
నిమ్మరసం:
నిమ్మరసం ఒక స్ట్రాంగ్ బ్లీచింగ్ ఏజెంట్. ఫ్రెష్ గా ఉండే నిమ్మకాయను కట్ చేసి, నిమ్మరసంను నేరుగా ముఖానికి అప్లై చేయాలి. కొద్దిగా తేనె మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల ఎక్స్ఫ్లోయేటింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.
కీరదోసకాయ:
కీరదోసకాయలో బ్లీచింగ్ ఏజెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి సెన్సిటివ్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. ఇది చర్మాన్ని కూల్ చేస్తుంది. ప్లస్ కీరదోసకాయ నేచురల్ టోనర్ గా పనిచేస్తుంది. చర్మ రంద్రాలను ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకే వెజిటేబుల్స్ ను రెగ్యులర్ స్కిన్ కేర్ లో ఉపయోగించడం మంచిది.
బంగాళదుంప:
బంగాళదుంపలో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, దీన్ని ముఖానికి ఉపయోగించినప్పుడు డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది. క్లియర్ స్కిన్ పొందడానికి ఇది ఫర్ఫెక్ట్ వెజిటేబుల్ .
బీట్ రూట్ :
బీట్ రూట్ ను ముఖానికి రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల, ఇది నేచురల్ పింక్ ఫ్లష్ స్కిన్ అందిస్తుంది. క్లియర్ స్కిన్ అందివ్వడంలో ఈ వెజిటేబుల్ గ్రేట్ గా సహాయపడుతుంది.
క్యారెట్ :
క్యారెట్ లో సెన్సిటివ్ స్కిన్ లో బ్లాక్ హెడ్స్ మరియు మొటిమలను నివారిస్తుంది. . ఇందులో ఉండే విటమిన్ ఎ స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. క్లియర్ స్కిన్ పొందడానికి ఈ హెల్తీ వెజిటేబుల్ ను తప్పనిసరిగా ఉపయోగించాలి.
వెల్లుల్లి:
వెల్లుల్లి ఘాటైన వాసన కలిగి ఉంటుంది. కానీ ఇందులోని బ్యూటీ లక్షణాలు డార్క్ స్పాట్స్ తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. సూర్య రశ్మి నుండి వెలువడే యువి కిరణాల నుండి మరియు ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి రక్షణ కల్పించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. . క్లియర్ స్కిన్ పొందడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.
Comments
Post a Comment