నిమ్మరసంలో దాగున్న స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ బెనిఫిట్స్

నిమ్మరసంను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాం. నిమ్మరసంలో అనేక మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు వివిధ రకాలుగా దీన్ని ఉపయోగిస్తారు.

నిమ్మరసంతో చర్మ, అనారోగ్య సమస్యలు నివారించే గుణాలు మాత్రమే కాదు, ఇది గ్రేట్ క్లీనింగ్ ఏజెంట్ కూడా. వంటల్లోకి మంచి ఫ్లేవర్ ను అందించడమే కాదు, కిచెన్ లో వివిధ వస్తువులను శుభ్రపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
నిమ్మరసంలో వివిధ రకాల విటమిన్స్, మినిరల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి చర్మ, జుట్టు సమస్యలను పరిష్కరిస్తాయి. అంతేకాదు ఇది గ్రేట్ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్. నిమ్మరసంను చర్మానికి, జుట్టుకి, శరీర సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. 
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి లు చర్మ, జుట్టు సమస్యలను నివారించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కొద్దిగా నిమ్మరసంను ఉపయోగిస్తే చాలు మొటిమలు, మచ్చలు, డార్క్ స్పాట్స్ మాత్రమే కాాదు..చుండ్రు సమస్యలు నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. 

చుండ్రు:
నిమ్మరసంను తలకు అప్లై చేసి మసాజ్ చేసి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రును తొలగిస్తుంది. ఇందులో ఉండే అసిడిక్ గుణం వల్ల తలలో పిహెచ్ లెవల్స్ ను రీస్టోర్ చేస్తుంది. ఇంకా తలలో దురద తగ్గిస్తుంది.

ముఖానికి:
ముఖం శుభ్రం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే అసిడిక్ నేచర్ వల్ల ఇది ముఖంలో మురికిని తొలగిస్తుంది. ఇది పర్ఫెక్ట్ నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది.


స్కిన్ లైటనింగ్:
నిమ్మరసం బెస్ట్ నేచురల్ క్లీనింగ్ ఏజెంట్ . అందుకే ఇందులో ఫర్ఫెక్ట్ బెనిఫిట్స్ దాగున్నాయి. ఇది ఇన్ స్టాంట్ గా స్కిన్ టోన్ లైట్ చేస్తుంది. కొద్దిగా నిమ్మరసంను ముఖానికి అప్లై చేసి కొన్ని నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.



ఐబ్యాగ్స్ ట్రీట్ చేయడానికి:
కంటి క్రింద నల్లని వలయాలు, ఐబ్యాగ్స్ తో ముఖం చూడటానికి అందంగా కనబడదు. కాబట్టి, ఈ డార్క్ సర్కిల్స్ ను ఏ ఒక్కరూ ఇష్టపడరు.
ఆయిల్ స్కాల్ఫ్:
ఆయిల్ స్కాల్ఫ్ ను నివారించడంలో గ్రేట్ హోం రెమెడీ. నిమ్మరసంలో ఉండే అసిడిక్ నేచర్ వల్ల తలలో సెబమ్ ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయడంలో నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది.

జుట్టును ఎక్సఫ్లోయేట్ చేస్తుంది:
ముఖంలో డెడ్ స్కిన్ సెల్స్ ను ఎలా తొలగిస్తుందో ,అదే విధంగా తలలో కూడా డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

లైటర్ హెయిర్:
జుట్టుకు కెమికల్స్ తో తయారుచేసిన ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం కంటే నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే నిమ్మరసంను ఉపయోగించడం వల్ల మంచిది. జుట్టుకు నిమ్మరసం ఉపయోగించడం వల్ల అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.


ట్యాన్ స్కిన్ :
స్కిన్ ట్యానింగ్ నివారించడంలో నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది.ఇంకా స్కిన్ టోన్ ను లైట్ చేస్తుంది. ఇది చర్మంలో రెడ్ నెస్ తగ్గిస్తుంది. నిమ్మరసం ఉపయోగించడంలో గ్రేట్ బ్యూటీ రెమెడీ.
హెయిర్ గ్రోత్ :
నిమ్మరసంలో బ్యూటీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి చాలా మందికి తెలుసుండకపోవచ్చు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి హెయిర్ గ్రోత్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసంను తలకు అప్లై చేసి చూడండి, అద్భుత ఫలితాను పొందతారు.
డార్క్ స్పాట్స్:
నిమ్మరసంకు కొద్దిగా పసుపు చేర్చి ముఖానికి అప్లై చేస్తే చాలు, ఇది డార్క్ స్పాట్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నిమ్మరసం, పసుపులు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే స్కిన్ అండ్ హెయిర్ కు ఫర్ఫెక్ట్ హోం రెమెడీగా దీన్ని ఉపయోగిస్తున్నారు.



Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్