అన్నం గంజిలో దాగున్న అమేజింగ్ బ్యూటి సీక్రెట్స్..!!
ఒకప్పుడు.. మన అమ్మవాళ్లు ఇంట్లో అన్నం వండిన తర్వాత.. ఆ నీటిని అలానే పక్కనపెట్టేవాళ్లు. దాన్ని అన్నం గంజి అని పిలిచే వాళ్లు. ఇప్పుడు రైస్ వాటర్ అని పిలుస్తారు. ఇది బంకగా ఉంటుంది. టేస్ట్ కూడా ఎవరికీ నచ్చదు. కానీ.. ఈ అన్నం గంజిని.. రకరకాలుగా చర్మ సంరక్షణకు ఉపయోగించుకునేవాళ్లు.
కానీ రోజులు గడిచిన తర్వాత.. మనం అన్నం వండిన నీటిని పడేస్తున్నాం. లేదా రైస్ కుక్కర్, ప్రెజర్ కుక్కర్ వంటి వంటసామాన్లు వచ్చిన తర్వాత.. చాలామంది వీటిల్లో అన్నం చేయడం వల్ల గంజి ఇమిరిపోతుంది. వాటిని వంపడం లేదు.
కానీ అన్నం వంపిన నీటిలో బ్యూటి బెన్ఫిట్స్ అమోఘంగా ఉంటాయి. ఈ గంజిలో అల్లాంటన్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలను నివారిస్తాయి. అలాగే ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల..రంధ్రాలను క్లెన్స్ చేసి.. చర్మాన్ని బిగుతుగా మార్చి, కాంప్లెక్షన్ ని పెంచుతుంది.
టోనర్
అన్నం గంజి.. చర్మ రంధ్రాలను క్లోజ్ చేసి.. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. తాజాగా తీసిన అన్నం గంజిలో కాటన్ ముంచి.. ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత.. టైట్ అనిపించినప్పుడు.. దాన్ని పీల్ ఆఫ్ చేసి.. చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి.
క్లెన్సర్
అన్నం గంజి.. చర్మంపై పేరుకున్న దుమ్మును ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. తాజాగా వంపిన అన్నం గంజిలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్, అరకప్పు నీళ్లు కలపాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు.. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
యాక్నె
అన్నం గంజిలో ఆస్ట్రిజెంట్ గుణాలు ఉంటాయి. అవి.. చర్మంపై పేరుకున్న దుమ్ముని తొలగిస్తాయి. సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. వాపు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ అన్నంగంజిలో కొన్ని చుక్కల నిమ్మరసం, 5 చుక్కల టీట్రీ ఆయిల్ కలపాలి. దీన్ని కాటన్ బాల్ తో చర్మంపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని రోజుకి ఒకసారి చేయాలి.
యాంటీ ఏజింగ్
అన్నం గంజి ఏజింగ్ ప్రాసెస్ ని నెమ్మదిగా మారుస్తుంది. 1టేబుల్ స్పూన్ అన్నం గంజిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం, 1టేబుల్ స్పూన్ శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.. 30 నిమిషాల తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి.
పిగ్మెంటేషన్
తాజా అన్నం గంజి తీసి రూం టెంపరేచర్ లో 24 నుంచి 48 గంటలు అలానే వదిలేయాలి. అది మరింత మందంగా తయారవుతుంది. అందులో 1కప్పు నీళ్లు కలపాలి. 5నిమిషాలు వేడి చేసి.. చల్లారనివ్వాలి. కాటన్ బాల్ ముంచి..చర్మానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే.. పిగ్మెంటేషన్ తగ్గుతుంది.
ఎక్స్ ఫోలియేటింగ్
డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి.. చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ బరకగా ఉన్న బియ్యం పిండి, టేబుల్ స్పూన్ పెరుగు, కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలపాలి. అన్నం గంజి ఉపయోగించి పేస్ట్ చేసుకుని ముఖానికి పట్టించి.. 30 నిమిషాల తర్వాత స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.
ట్యాన్ తొలగించడానికి
అన్నంగంజిలో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ట్యాన్ తొలగించి.. చర్మకాంతిని పెంచుతాయి. 1టేబుల్ స్పూన్ బంగాళదుంప రసం, 1టేబుల్ స్పూన్ అన్నం గంజి తీసుకుని ముఖానికి మసాజ్ చేయాలి. 15నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి.
ఎగ్జిమా
రైస్ వాటర్ లో శుభ్రంగా ఉన్న క్లాత్ ని ముంచి.. ఎగ్జిమా ఉన్న చర్మంపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత.. చల్లటినీటితో శుభ్రం చేయాలి.
హెయిర్ షైనింగ్
చర్మానికి మాత్రమే కాదు.. జుట్టుకి అన్నం గంజి అద్భుత పరిష్కారం. రైస్ వాటర్ లో ఒక కప్పు నీటిని కలిపి.. కొన్ని చుక్కల లావెండర్, రోజ్ మెరీ ఆయిల్స్ మిక్స్ చేయాలి. షాంపూ చేసుకున్న తర్వాత.. ఈ మిశ్రమంతో శుభ్రం చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్లీ నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. మీ జుట్టు షైనీగా మారుతుంది.
స్మూత్ స్కిన్అన్నం గంజిని ఫ్రిడ్జ్ లో ఒక గంట పెట్టాలి. ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ కలపాలి. కాటన్ ప్యాడ్ ఉపయోగించి..చర్మాన్నికి అప్లై చేయాలి. 15నిమిషాల తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి.
Comments
Post a Comment