వీపు మీద మొటిమలను నివారించే లెమన్ షుగర్ బాడీ స్ర్కబ్

చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. మొటిమలనగానే ముఖంలో బాధించే మొటిమలనుకుంటాము. వీటిని తొలగించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ముఖంలో వచ్చే మొటిమలను తొలగించుకోవడానికి చాలా హోం రెమెడీస్, ట్రీట్మెంట్స్ చాలానే ఉన్నాయి. ముఖంలో కాకుండా బాడీ మీద, బ్యాక్ లో వచ్చే మొటిమలు కూడా చాలా బాధిస్తుంటాయి. బ్యాక్ పోర్షన్ లో వచ్చే మొటిమలను నివారించడానికి కొన్నిఇంట్లో తయారుచేసుకునే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి .

ముఖ చర్మంలో మాత్రమే కాదు, బ్యాక్ పోర్షన్ లో కూడా ఎక్కువగా సెబమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రదేశంలో ముఖంలో కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్సెస్ గా సెబమ్ ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు , చర్మ రంద్రాలు పెద్దగా తెరచుకోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటారు.
బ్యాక్ ఏన్స్ ను స్నానం చేసేప్పుడు, తొలగించుకోవడానికి కూడా సాధ్యం కాదు. వాస్తవానికి, బ్యాక్ ఏన్స్ నివారించుకోవడానికి ఇంట్లో ఉండే హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతుంది.
మొటిమలను నివారించుకోవడానికి కెమికల్స్ తో తయారుచేసిన క్రీమ్స్ , స్ర్కబ్బింగ్స్ ఉపయోగించకూడదు. కాబట్టి, ఇంట్లో స్వయంగా తయారుచేసుకొనే స్క్రబ్ తో బ్యాక్ ఏన్స్ ను తొలగించుకోవచ్చు . ఈ స్ర్కబ్బింగ్స్ ను రెగ్యులర్ గా ఉపయోగించాలి. 
కావల్సినవి:
నిమ్మకాయలు : 2

పంచదార పొడి: అరకప్పు
తయారుచేయు పద్దతి, అప్లైచేసే విధానం:
నిమ్మకాయలను రెండు గా కట్ చేసి, అందులో విత్తనాలు తొలగించి, నిమ్మరసంను ఒక గిన్నెలోకి పిండుకోవాలి. ఇప్పుడు అందులో పంచదార పొడి వేసి మిక్స్ చేయాలి.

దీన్ని ప్రీ షవర్ స్ర్కబ్ తర్వాత ఉపయోగించుకోవడం మంచిది. ఈ స్ర్కబ్బింగ్ ను వీపు మీద అప్లై చేసి సున్నితంగా మర్ధ చేయాలి. స్నానం చేసుకోవడానికి ముందు దీన్ని అప్లై చేసి మర్ధన చేయాలి. వీపు మీద మొటిమలను నివారించుకోవడానికి ఇది ఎఫెక్టివ్ స్ర్కబ్ .

షుగర్ మిక్స్ చేయడం వల్ల డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. స్కిన్ కు ఎలాంటి హాని జరగదు, ఇక నిమ్మరసం చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ ను తగ్గిస్తుంది.
ఈ బాడీ స్ర్కబ్ లో మరే ఇతర ఆయిల్స్ ను కలపకూడదు, ఎందుకంటే ఆయిల్స్ చర్మ రంద్రాలను మూసుకునేలా చేసి, జిడ్డు మరింత పెరిగేలా చేస్తుంది.
చాలా వరకూ, లెమనేడ్ బాడీ స్ర్కబ్ వీపుమీద మొటిమలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.కాబట్టి, ఈ బాడీ స్ర్కబ్ లో ఆయిల్ చేర్చకపోవడమే మంచిది

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్