స్కిన్ వైటనింగ్ కోసం కొన్ని తక్షణ మార్పు అందించే రెమెడీస్

అందంగా...ఆకర్షనీయంగా కనబడాలనుకోవడం ప్రతి ఒక్క అమ్యాయి డ్రీమ్. స్కిన్ కంప్లెక్షన్ పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. స్కిన్ కంప్లెక్షన్ పెంచుకోవడానికి ఎన్నో మార్కెట్లో ఏన్నో ఫెయిర్ నెస్ క్రీములు అందుబాటులో ఉన్నాయి. స్కిన్ కంప్లెక్షన్ పెంచుకోవడంలో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు .


మీరు కూడా హెల్తీ, ఫెయిన్ అండ్ గ్లో స్కిన్ పొందాలంటే ఓపికగా వర్క్ హార్డ్ చేయాల్సి ఉంటుంది. నేచురల్ గా స్కిన్ కలర్ మార్చుకోవడం కొద్దిగా కష్టమే అయినా...స్కిన్ టాన్, స్కిన్ పిగ్మెంటేషన్ వంటి స్కిన్ సమస్యలను నివారించుకోగలిగితే ఆటోమాటిక్ గా స్కిన్ కంప్లెక్షన్ పెరుగుతుంది. సాధ్యమైనంత వరకూ ఎండలో ఎక్కువ తిరగకుండా, స్ట్రెస్ తగ్గించుకోవాలి. అలాగే చర్మ మీద నిర్లక్ష్యం చేయకూడదు. చర్మ సంరక్షణలో కొన్ని ఎఫెక్టివ్ చిట్కాలను అనుసరిస్తే తప్పకుండా మీరు కోరుకున్న హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కాంప్లెక్షన్ ను పొందుతారు.

స్కిన్ వైటనింగ్ కోసం కొన్ని తక్షణ మార్పు అందించే రెమెడీస్ మీకోసం...




1. నిమ్మరసం :
స్కిన్ వైట్ గా మార్చడంలో నిమ్మరసం నేచురల్ రెమెడీ. ఇది చర్మంలోని డార్క్ స్పాట్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్రెష్ గా ఉండే నిమ్మరసంను ముఖానికి అప్లై చేసి మర్దన చేయాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా పాటించే సమయంలో ఎండలో ఎక్కువగా తిరగకూడదు. ప్రతి ఒక్క స్కిన్ ప్రొడక్ట్స్ లో నిమ్మరసం తప్పనిసరిగా ఉంటుంది.

2. పాలు:
ఒక స్పూన్ పాలు, తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకోవాలి. స్మూత్ గా పేస్ట్ తయారుచేసుకుని ముఖానికి అప్లై చేయాలి, తర్వాత సున్నితంగా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసి, 15నిముషాలు అలాగే వదిలేయాలి. ఆయిల్ స్కిన్ ఉన్నవారు లోఫ్యాట్ మిల్క్ ను ఉపయోగించాలి. డ్రై స్కిన్ ఉన్న వారు ఫుల్ క్రీమ్ ఉన్న పాలను ఉపయోగించాలి.


3. పసుపు:
చర్మ సౌందర్యం మెరుగుపరచుకోవడంలో పురాతన కాలం నుండి ఈ హోం రెమెడీని ఉపయోగిస్తున్నారు. ఒక టీస్పూన్ పసుపులో 3 టీస్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి, ఎండకు బహిర్గతమయ్యే చర్మానికి అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.


4. ఎగ్ ప్యాక్:
ఒక గుడ్డును బీట్ చేసి అందులోని మిశ్రమం బాగా గిలకొట్టి పెట్టుకోవాలి. తర్వాత ముఖంను శుభ్రం కడిగి, తడిలేకుండా పొడి టవల్ తో తుడిచి డ్రైగా మారిన తర్వాత ఎగ్ ప్యాక్ వేసుకోవాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం, లావెండర్ ఆయిల్ ను మిక్స్ చేసుకుంటే మరింత ఎఫెక్టివ్ ఫలితం ఉంటుంది.

5. టమోటో:
టమోటోలో లైకోపిన్ అనేఎంజైమ్ ఉంటుంది. ఇది టాన్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. స్కిన్ లైట్ చేయడంలో ఫర్ఫెక్ట్ చాయిస్ . ఇది స్కిన్ టోన్ ను లైట్ గా మార్చుతుంది. ట్యాన్ తగ్గిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. బ్లెండర్ లో రెండు టమోటోలను వేసి, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ , కొద్దిగా శెనగపిండి వేసి బ్లెండ్ చేసి స్మూత్ గా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను ప్రతి రోజూ స్నానికి ముందు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

6. హాట్ ఆయిల్ బాడీ మసాజ్:
వీకెండ్స్ హాట్ ఆయిల్ తో బాడీ మసాజ్ చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఫెయిర్ స్కిన్ పొందుతారు. బాదం, కోకనట్ లేదా ఆలివ్ ఆయిల్ ను ఎంపిక చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వేప, తులసి లీవ్స్ వేసి ఉడికించాలి.. దీన్ని బాడీ మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత స్నానం చేస్తే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, దాంతో ట్యాన్ తగ్గుతుంది.

7. పెరుగు ప్యాక్:
ఒక టీస్పూన్ పెరుగుకు ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే టాన్ తొలగిపోతుంది.


8. ప్రూట్ ప్యాక్:
ఫ్యూట్ ప్యాక్ చర్మానికి గ్రేట్ పనిచేస్తుంది. చర్మంలో కొత్తగా గ్లోతీసుకొస్తుంది. అవొకాడో, బొప్పాయి, మరియు కీరదోసకాయల ముక్కలను మొత్తగా పేస్ట్ చేసి అందులో రెండు చెంచాల క్రీమ్ ను మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమం బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రీమ్ కు బదులు ముల్తాని మట్టికూడా మిక్స్ చేస్తుంటారు.
9. రోజ్ వాటర్:
రోజ్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇరిటేడె స్కిన్ ను ఇది స్మూత్ గా మార్చుతుంది. సెన్సిటివ్ అండ్ ఆయిల్ స్కిన్ కు ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ అండ్ స్క్రబ్స్ కు రోజ్ వాటర్ మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. రోజ్ వాటర్ తో రోజూ ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంను క్లియర్ గా మార్చుతుంది మరియు చర్మంలో మలినాలను తగ్గిస్తుంది. రోజ్ వాటర్ ఉపయోగించేటప్పుడు సోప్ ను ఉపయోగించకండి .

10. జీలకర్ర:
వేడి నీటిలో కొద్దిగా జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఈ నీటితో ముఖాన్ని, రోజులో అప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటుంటే స్కిన్ లో క్లియర్ కంప్లెక్షన్ ను పొందుతారు .

11. కొబ్బరి బోండాంలోని నీరు:
టండర్ కోకనట్ వాటర్ హెల్తీ అండ్ బ్రైట్ స్కిన్ అందిస్తుంది. దీన్ని రోజుకు రెండు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మంలో స్కార్స్, మచ్చలను నివారిస్తుంది. కొబ్బరి నీళ్ళను అప్లై చేసిన తర్వాత 15నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

12. బొప్పాయి:
బొప్పాయి ఫ్రూట్ లో పెప్పైన్ అనే ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ ఎక్సఫ్లోయేట్ చేస్తుంది,. స్కిన్ సెల్స్ కొత్తవి ఏర్పడేలా చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువ. ఫేస్ మాస్క్ కోసం గ్రీన్ బొప్పాయిని ఎంపిక చేసుకోవడం మంచిది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్