ఎండకు కమిలిన చర్మంను తెల్లగా మార్చే ఎఫెక్టివ్ ఫేస్ మాస్క్ లు
సహజంగా వాతావరణంలో మార్పులతో పాటు చర్మంలో మార్పులు వస్తుంటాయి. చలికి చర్మం పగుళ్ళు ఏర్పడుతుంది. అదే ఎండకాలంలో చర్మం టానింగ్ కు గురి అవుతుంది. డార్క్ గా మారుతుంది? ఇటువంటి టానింగ్ స్కిన్ ను నివారించుకోవడానికి ఒక ఎఫెక్టివ్ హో రెమెడీ ఉంది. ఇది అరగంటలో స్కిన్ టాన్ ను నివారిస్తుంది.
అయితే, డీటానింగ్ కోసం ఈ క్రింది సూచించిన నేచురల్ డీటానింగ్ మాస్క్ లు ఉపయోగించడం వల్ల చర్మం మీద డార్క్ ప్యాచ్ లు తొలగిపోతాయి. టానింగ్ నివారించబడుతుంది. స్కిన్ టానింగ్ కు సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసుకోవాలి. చర్మంలో మెలనిన్ అనే పింగ్మెంట్ చర్మ రంగులో మార్పు తీసుకొస్తుంది.ఎప్పుడైతే సూర్య రశ్మి నుండి వెలువడే యూవీకిరణాలు, మెలనిన్ ఓవర్ గా స్రవించడం వల్ల స్కిన్ డార్క్ గా మారుతుంది.
అందువల్ల,ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు కంపల్సరీ ఎస్ ఎఫ్ పి మార్క్ గల సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవాలి. అలాగే తలను కవర్ చేయడానికి బ్రిమ్డ్ హా్ట్ ధరించాలి . అలాగే ముఖానికి కాటన్ స్కార్ఫ్ ను ధరించాలి. అలాగే 12 నుండి 3 గంటల మద్య ఎండలో తిరగకపోవడం మంచిది.అలాగే స్కిన్ ను హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి రోజుకు కనీసం 6 నుండి 8 గ్లాసులు నీళ్ళు తాగాలి.
అలాగే పెదాలు కూడా సన్ ఎక్స్ ఫోజర్ కు గురి అవ్వడం వల్ల పెదాలు బ్లాక్ గా మారుతాయి. కాబట్టి, ఎస్ ఎఫ్ పి ఉన్న లిప్ బామ్ ను ఉపయోగించాలి. మరి ఎండకు డ్యామేజ్ అయిన స్కిన్ ను తిరిగి యథాస్థితికి తీసుకు రావడానికి 8 హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి డార్క్ గా మారి చర్మం మీద టానింగ్ నివారిస్తుంది. !
ఇంట్లో స్వయంగా తాయరుచేసుకునే డీ టానింగ్ మాస్క్ లు రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలను అందిస్తాయి. మరి ఆ ఎఫెక్టివ్ హోం మేడ్ డీటానింగ్ మాస్క్ లు ఏంటో తెలుసుకుందాం...
1. టమోటో:
టమోటోలు లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నేచురల్ సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది. ఇది పర్ఫెక్ట్ హోం రెమెడీ. ఇది స్కిన్ టాన్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
కావల్సినవి:
టమోటో: 1
తేనె: 1టేబుల్ స్పూన్
ఉపయోగించే పద్దతి:
టమోటోను కట్ చేసి, గుజ్జు తియ్యాలి. తర్వాత గుజ్జులో తేనె మిక్స్ చేయాలి. స్మూత్ గా మిక్స్ చేసిన తర్వాత ముకానికి మాస్క్ వేసుకోవాలి. దీన్ని ముఖం మరియు మెడకు పూర్తిగా అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లని నీరుతో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని వారంలో రెండు సార్లు వేసకుంటే సన్ టాన్ పూర్తిగా తొలగిపోతుంది.
2. నిమ్మరసం + రోజ్ వాటర్:
టానింగ్ నుండి త్వరగా ఉపశమనం పొందడానికి ఈ రెండింటి కాంబినేషన్ చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాన్ తొలగిస్తుంది. ఇక రోజ్ వాటర్ లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంను స్మూత్ గా రిలాక్స్ చేస్తుంది.
కావల్సినవి
రోజ్ వాటర్ : 1టీస్పూన్
నిమ్మరసం: 1 టీస్పూన్
తయారుచేయు పద్దతి:
పై రెండు పదార్థలు ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేసి . ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
3. అరటి మరియు పెరుగు:
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో పవర్ ఫుల్ యాంటీయాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల టానింగ్ ను నివారించడం మాత్రమే కాదు, చర్మానికి పోషనను అందిస్తుంది, అలాగే రేడింట్ గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది. ఈ సూపర్ ఎఫెక్టివ్ హోం మేడ్ మాస్క్ టాన్ నివారించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో చర్మం రంగులో మార్పు వస్తుంది.
కావల్సినవి:
అరటిపండు : 1
పెరుగు : 1 టీస్పూన్
తేనె: 1 టీస్పూన్
తయారుచేయు పద్దతి
అరటి పండును మెత్తగా గుజ్జులా చేసి, అందులోతేనె, పెరుగు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రం నేచురల్ డీటానింగ్ గా పనిచేస్తుంది. డీన్ని ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. అర గంట తర్వాత చర్మం స్ట్రెచ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అప్పడు చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
4. బొప్పాయి:
బొప్పాయిలో నేచురల్ ఎంజైమ్స్ ఉన్నాయి. ఇది చర్మంలోని మలినాలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మూసుకున్న రంద్రాలను తెరచుకుని శుభ్రపరుస్తుంది. దాంతో చర్మం తెల్లగా మారుతుంది.
తయారుచేయు పద్ధతి: ఈ నేచురల్ రెమెడీ ట్యాన్ తగ్గిస్తుంది. కొద్దిగా బొప్పాయిని మెత్తగా గుజ్జులా చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 16నిముషాలు తర్వాత క్లీన్ చేసుకోవాలి.
5. బంగాళదుంప జ్యూస్:
బంగాళదుంప జ్యూస్ టెస్డెడ్ హోం రెమెడీస్ లో ఇది ఒకటి. ఇది టానింగ్ నివారిస్తుంది. బంగాలదుంప జ్యూస్ లో ఉండే విటమిన్ ఎ , కెరోటిన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ టానింగ్ నివారిస్తుంది. ఇన్ స్టాంట్ గా చర్మానికి రంగు అందిస్తుంది.
తయారుచేయు పద్దతి:
పొటాటోను స్లైస్ గా కట్ చేసిముఖం మొత్తం అప్లై చేసి మర్దన చేయాలి. ఇలా పదినిముషాలు మర్దన చేస్తుంటే ముఖంలో తెల్లగా అనిపిస్తుంది. స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
6. పాలు మాస్క్
పాలలో లాక్టిక్ యాసిడ్, చర్మానికి పోషణను అందిస్తుంది. టాన్ ను తొలగిస్తుంది.అలాగే చర్మంలోని మలినాలను తొలగించడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. చర్మాన్ని సపెల్ గా మరియు స్మూత్ గా మార్చుతుంది.
తయారుచేయు పద్దతి:
ఈ హోం మేడ్ మాస్క్ టానింగ్ ను నివారిస్తుంది. కాటన్ ను పాలలో డిప్ చేసి, ముఖానికి అప్లై చేసి ఫేషియల్ స్కిన్ ను 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
7. సాండిల్ వు్ డమాస్క్ :
ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మానికి కూలింగ్ ఎఫెక్టివ్ ను అదివ్వడం మాత్రమే కాదు, టానింగ్ నివారిస్తుంది.
పదార్థాలు:
సాండిల్ వుడ్ పౌడర్ : 1టేబుల్ స్పూన్
రోజ్ వాట్ 1 టేబుల్ స్పూన్
తయారుచేయు పద్దతి: సాండిల్ ఉడ్ పౌడర్ లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, స్మూత్ గా పేస్ట్ చేసి, దీన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
Comments
Post a Comment