బేకింగ్ సోడాలో దాగున్న బోలెడన్ని బ్యూటీ సీక్రెట్స్..!!
బేకింగ్ సోడాలో దాగున్న బోలెడన్ని బ్యూటీ సీక్రెట్స్..!!
కొంతమంది ముఖంపై తీసుకున్న శ్రద్ధ జుట్టుపై తీసుకోరు. మరికొందరు జుట్టుపై తీసుకున్నంత శ్రద్ధ ముఖచర్మంపై తీసుకోరు. అలాగే కొంతమంది చేతులు, కాళ్ల గురించి ఏమాత్రం పట్టించుకోరు. కానీ.. శరీరమంతా అందాన్ని సొంతం చేసుకోవాలంటే.. సరైన హోం రెమిడీస్ ఫాలో అవ్వాలి.
కేవలం ఒకే ఒక పదార్థం.. జుట్టు, చర్మం, పంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. బేకింగ్ సోడా ఖచ్చితంగా జుట్టు, చర్మ అందాన్ని రెట్టింపు చేస్తుందని.. మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే.. ఇందులో బ్యూటి బెన్ఫిట్స్ అమోఘమైనవి.
బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం కలిగించే సత్తా ఉంటుంది. అలాగే చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళిని తొలగించడంలో చాలా సహాయపడుతుంది. బేకింగ్ సోడాను అమేజింగ్ హోం రెమిడీగా ఉపయోగించి.. అద్భుతమైన చర్మాన్ని, జుట్టుని ఎలా పొందాలో ఇప్పుడే తెలుసుకుని ప్రయత్నించండి.
జుట్టుకి బేకింగ్ సోడా
మీ జుట్టుని హెల్తీగా, క్లీన్ గా ఉంచుకోవాలంటే.. ఈ రెమిడీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను చిన్న కప్పులో తీసుకోవాలి. అందులో రెగ్యులర్ గా ఉపయోగించే షాంపూను 2టేబుల్ స్పూన్లు కలపాలి. బాగా మిక్స్ చేసి.. స్కాల్ప్ కి, జుట్టుకి పట్టించాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లు, షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. అంతే మీ జుట్టు చాలా ఫ్రెష్ గా, హెల్తీగా కనిపిస్తుంది. వారానికి ఒకసారి ఈ టిప్ ఫాలో అవ్వాలి.
ఎక్స్ ఫోలియేషన్ కి
ముఖంపై డెడ్ స్కిన్ ని తొలగించాలంటే.. బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడా, 1 టీస్పూన్ నీళ్లు కలిపి.. పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకోవాలి. 2 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ రెమిడీని వారానికి ఒకసారి ప్రయత్నించాలి
సాఫ్ట్ హ్యాండ్స్
బేకింగ్ సోడాతో షైనీ నెయిల్స్, సాఫ్ట్ హ్యాండ్స్ పొందవచ్చు. అప్పుడప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా, నీళ్లు కలిపిన మిశ్రమాన్ని చేతులు, గోళ్లకు అప్లై చేయాలి. 5 నిమిషాల తర్వాత తడిగుడ్డతో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ రెమిడీ ప్రయత్నించాలి.
మోచేతులు, మోకాళ్లు
బేకింగ్ సోడాతో డ్రైగా, రఫ్ గా మారిన మోచేతులు, మోకాళ్లను నివారించవచ్చు. 1టీస్పూన్ బేకింగ్ సోడాని మాయిశ్చరైజర్ లో మిక్స్ చేసి.. అప్లై చేస్తే.. చాలాసేపటి వరకు.. మోకాళ్లు, మోచేతులు.. సాఫ్ట్ గా మారతాయి.
సెంట్
శరీర దుర్వాసన పోగొట్టడానికి బేకింగ్ సోడా అద్భుతమైన పరిష్కారం. అరకప్పు బేకింగ్ సోడాను ఒక టబ్ గోరువెచ్చని నీటిలో కలపాలి. బాగా కలిపి.. శరీరాన్ని 10 నిమిషాలు అందులో నానబెట్టాలి. అంతే.. డార్క్ స్కిన్ బ్రైట్ గా మారడమే కాకుండా.. దుర్వాసన పోతుంది.
తెల్లటి పళ్లకు
బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, నీళ్లు 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు తీసుకోవాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. బ్రష్ ఉపయోగించి.. పళ్లు తోముకోవాలి. క్రిములన్నీ తొలగిపోతాయి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించాలి.
అలసిన పాదాలకు
బేకింగ్ సోడా 3 టేబుల్ స్పూన్లు, నీళ్లు ఒక గ్లాసు తీసుకోవాలి. రెండింటినీ మిక్స్ చేసి.. పాదాలను 10 నిమిషాలు అందులో పెట్టాలి. తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలు శుభ్రం చేసుకోవాలి. కొన్ని నిమిషాల్లోనే తాజాగా, ఒత్తిడి తగ్గిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.
మొటిమలకు
మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగించడంలో బేకింగ్ సోడా అద్భుతమైన పరిష్కారం. రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా, 1 టీస్పూన్ నిమ్మరసం, 2 కాటన్ బాల్స్ తీసుకోవాలి. బేకింగ్ సోడా, నిమ్మరసం కలపాలి. అందులో కాటన్ బాల్ ని నానబెట్టాలి. కాటన్ బాల్ తో.. ఈ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేయాలి. రాత్రంతా అలానే ఉంచుకుని.. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
Comments
Post a Comment