సర్ ప్రైజ్ : డార్క్ స్కిన్ వైట్ గా మార్చే బీట్ రూట్ శెనగపిండి ఫేస్ మాస్క్

ఫెయిర్ స్కిన్ పొందాలనుకునే వారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.మార్కెట్లో వచ్చే ప్రతి క్రీమ్ టెస్ట్ చేసుంటారు, ఇంట్లో వివిధ రకాలుగా ఫేస్ ప్యాక్ లు, చిట్కాలను, హోం రెమెడీస్ ను ఉపయోగించి ఉంటారు. కానీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రస్తుతానికి కొద్దిగా మార్పు కనిపించినా ఒకటి రెండ్రోజుల తర్వాత తిరిగి స్కిన్ యాథావిధంగాతయారవుతుంది. అయితే మీరు వీటన్నింటితో విసిగిపోయి, ఒక కొత్త చర్మం, క్లియర్ గా , హెల్తీగా మరియు బ్రైట్ గా ఉండే స్కిన్ టోన్ ను కోరుకుంటున్నట్లైతే మీకు ఇక అద్భుతమైన హోం రెమెడీ ఉంది. అదే బేసన్ బీట్ రూట్ ఫేస్ మాస్క్ , ఇది చాలా గ్రేట్ గా పనిచేస్తుంది.

బీట్ రూట్ లో విటమిన్స్, మినిరల్స్ మరియు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. దాంతో చర్మం శుభ్రం పడుతుంది. చర్మం క్లియర్ గా కనబడుతుంది.

ఈ ఫేస్ మాస్క్ కు ఇతర పదార్థాలు కూడా చేర్చుకోవచ్చు. నిమ్మరసం,శెనగపిండి, తేనె మరియు టమోటో జ్యూస్ వంటివి చేర్చుకోవడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపడుతుంది.

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్స్ వల్ల బీట్ రూట్ ఫేస్ మాస్క్ లో కలపడం వల్ల ఇది ఇన్ స్టాంట్ గా ఫేయిర్ నెస్ స్కిన్ అందిస్తుంది. ఇది చర్మంలోని మచ్చలును మాయం చేస్తుంది. స్కిన్ టోన్ క్లియర్ చేస్తుంది.


టమోటోలో బీటాకెరోటిన్ మరియు లికోపిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది, సెబమ్ ప్రొడక్షన్ ను కంట్రోల్ చేస్తుంది. స్కిన్ లోపలి వరకూ వెళ్ళి, చర్మానికి తగిన పోషణను అందిస్తుంది .చర్మం రేడియంట్ గా మారుతుంది.

బీట్ రూట్ అండ్ బేసన్ మాస్క్. స్కిన్ లైట్ గా మార్చుతుంది. శెనగపిండిలో ఉండే క్లెన్సింగ్ లక్షణాలు చర్మంలో దాగున్న మురికిని తొలగిస్తుంది. చర్మ రంద్రాలు మూసుకునేలా చేస్తుంది. చర్మం బ్రైట్ గా మార్చుతుంది. ఈ గ్రేట్ హోం మేడ్ ఫేస్ మాస్క్ ను ఎలా తయారుచేసుకోవాలి. ఏవిధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం..


కావల్సినవి:

బీట్ రూట్ జ్యూస్ : ఒక టీస్పూన్ 
శెనగపిండి: ఒక టేబుల్ స్పూన్ 
టమోటో జ్యూస్ ఒక టీస్పూన్ 
తేనె: ఒక టీస్పూన్ 
నిమ్మరసం: అరటీస్పూన్

తయారీ:

ఒక బౌల్ తీసుకుని అందులో టమోటో, బీట్ రూట్ రసం, శెనగపిండి వేయాలి. ఉండలు లేకుండా స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోనే తేనె మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. అన్ని కలగలుపుకోవాలి. తర్వాత దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ముఖం తేమ లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ ప్యాక్ ను రోజూ అప్లై చేసి బెస్ట్ రిజల్ట్ పొందుతారు .

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్