జుట్టు జిడ్డుగా మారకుండా ఫాలో అవ్వాల్సిన న్యాచురల్ టిప్స్..!

తలస్నానం చేసిన రెండుర్రోజులకే జుట్టు ఆయిలీగా మారుతూ ఉంటుంది. దీంతో మళ్లీ హెడ్ బాత్ చేసే తీరిక లేక, బిజీ షెడ్యూల్ లో డీలా పడిపోతుంటారు. అయితే ఇలా ఆయిలీగా మారకుండా.. కొన్ని న్యాచురల్ రెమిడీస్ ఉన్నాయి. మరి వాటిని ఫాలో అవుతారు కదూ..

ఆయిలీ జుట్టు సమస్యతో బాధపడుతుంటే.. ముఖం కూడా జిడ్డుగా మారుతూ ఉంటుంది. కాబట్టి.. ఈ సమస్య ఉన్నవాళ్లు వెంటనే జాగ్రత్తపడాలి. న్యాచురల్ రెమిడీస్ ని ఫాలో అవడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు. 



హెయిర్ వాష్
జుట్టు శుభ్రం చేసుకునేటప్పుడు జుట్టుని రుద్దినట్టు చేయకూడదు. దీనివల్ల అదనపు ఆయిల్ బయటకు వస్తుంది. కాబట్టి జుట్టుని మాత్రమే.. శుభ్రపరుచుకోండి. మరీ ఎక్కువగా స్కాల్ప్ ని రుద్దకూడదు.



గోరువెచ్చని నీళ్లు
హాట్ వాటర్ జుట్టుకి ఉపయోగించకూడదు. జుట్టు చిట్లిపోయేలా చేసి.. డల్ గా మారుస్తుంది. చల్లని నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లు ఉపయోగించాలి. జుట్టు ఆయిలీగా మారకుండా.. ఇదో సింపుల్ పద్ధతి.


కండిషనర్
జిడ్డుగా మారిన జుట్టుని న్యాచురల్ గా మార్చేది కండిషనర్ మాత్రమే. కాబట్టి.. కేవలం జుట్టుకి మాత్రమే.. కండిషనర్ అప్లై చేయాలి. స్కాల్ప్ కి కండిషనర్ అప్లై చేయకూడదు.



వెనిగర్
స్కాల్ప్ లో పీహెచ్ బ్యాలెన్స్ చేయడంలో వెనిగర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ ను ఒక కప్పు నీటిలో కలపాలి. దీన్ని షాంపూ చేసుకున్న తర్వాత స్కాల్ప్ కి పట్టించాలి. 10 నిమిషాల తర్వాత.. నీటితో శుభ్రపరుచుకోవాలి.


గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. ఉపయోగించిన టీ బ్యాగ్ ని ఒక కప్పు నీటిలో కలిపి 10 నిమిషాలు సన్నని మంటపై మరిగించాలి. చల్లారిన తర్వాత.. షాంపూ చేసుకున్న జుట్టుని శుభ్రం చేసుకోవాలి. తర్వాత సున్నితంగా జుట్టుని 5 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రపరుచుకోవాలి.



అలోవెరా
అలోవెరా నుంచి జెల్ తీసి.. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో కలపాలి. కాటన్ బాల్ సహాయంతో తడి స్కాల్ప్ కి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత.. షాంపూతో శుభ్రం చేసుకుని ఆరనివ్వాలి. ఇలా నెలకు మూడుసార్లు చేయాలి.



టీ ట్రీ ఆయిల్
2టేబుల్ స్పూన్ల టీ ట్రీ ఆయిల్ ని ఒక కప్పు నీటిలో కలపాలి. దాన్ని స్ప్రే బాటిలో వేసుకోవాలి. బాగా షేక్ చేసిన తర్వాత.. జుట్టు జిడ్డుగా మారిందని భావించినప్పుడు.. స్కాల్ప్ పై స్ప్రే చేసుకోవాలి.




Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్