డార్క్ స్పాట్స్ కు చెక్ పెట్టే టర్మరిక్ మిల్క్ ఫేస్ ప్యాక్..

చాలా కొద్ది మందికి మాత్రమే ఫర్ఫెక్ట్ ఫేవ్ లెస్ స్కిన్ కలిగి ఉంటారు. చాలా వరకు ఎక్కువ మంది ముఖంలో ఏదో మచ్చలు, స్పాట్స్, మొటిమలుంటాయి. ఈ మచ్చలు వివిధ రకాల కారణంగా ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా టీనేజ్ లో వచ్చే మొటిమలు కారణంగా ముఖంలో స్పాట్స్ ఏర్పడుతాయి, పెద్దవారిలో కూడా కొన్ని రకాల మచ్చలు ఏర్పడుతాయి. లేదా స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణమవుతాయి. ముఖంలో డార్క్ స్పాట్స్ నివారించుకోవడానికి వివిధ రకాల ఫేస్ ప్యాక్ లున్నాయి. డార్క్ స్పాట్స్ తొలగించుకోవడానికి పసుపు, పాలు, కొబ్బరి నూనె పదార్థాలతో ఫేస్ ప్యాక్ ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. 

ఇండియన్ వంటకాల్లో పసుపు గ్రేట్ మసాలా దినుసు, వంటల్లో దీన్ని వాడటం వల్ల ఆ వంటకు మంచి కలర్ తోపాటు, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అంతే కాదు, ఇది ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే అందరూ పుసుపు కేవలం వంటలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ, పసుపులోఉండే యాంటీఇన్ఫ్లమేటీరీ, యాంటీ సెప్టిక్ లక్షణాల వల్ల చర్మ సంరక్షణలో వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.


పసుపును స్కిన్ బ్రైటనింగ్ మాస్క్ గా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వదువు, వరుడుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా భారదేశంలో బాగా పాపులర్ అయినది. అందువల్లే ఇది చర్మంను బ్రైట్ గా..వైట్ గా మార్చడంలో బాగంగా ఉపయోగిస్తున్నారు. అంతే కాదు డార్క్ స్పాట్స్ ను నివారించడంలో కూడా ఇది గ్రేట్ రెమెడీ. డార్క స్పాట్స్ సమస్యతో మీరూ బాధపడుతుంటే ఈ ఫేస్ ప్యాక్ రిసిపిని మీరు కూడా ట్రై చేయండి...

డార్క్ స్పాట్స్ నివారించుకోవడానికి ఇంట్లోనే తయారుచేసుకునే టర్మరిక్ ఫేస్ ప్యాక్.


కావల్సినవి:
పసుపు
కొబ్బరి నూనె
పాలు
తయారుచేయు విధానం, ప్యాక్ ను వేసుకునే పద్దతి:
ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టీస్పూన్ల పసుపు తీసుకోవాలి. ముఖం మొత్తానికి అప్లై చేయడానికి ఆ మాత్రం అవసరమవుతుంది. తర్వాత అందులోనే కొద్దిగా కొబ్బరి నూనె, పాలు కొద్దిగా మిక్స్ చేసి చిక్కగా పేస్ట్ లా చేసుకోవాలి. పసుపు సాప్ట్ గా పేస్ట్ లా తయారవ్వడానికి పాలు సహాయపడుతాయి.


ఈ ఫేస్ ప్యాక్ పేస్ట్ మరీ పల్చగా లేకుండా చిక్కగా తయారుచేసుకోవాలి. తర్వాత ముఖం క్లీన్ గా కడిగి, తేమను పూర్తిగా తుడిచి తర్వాత ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయాలి. మినిమమ్ అరగంట అలాగే ఉండనిచ్చి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడానికి ముందు పాత డ్రెస్, లేదా కలర్ డ్రెస్ వేసుకోవడం వల్ల దుస్తులుకు అంటే పసుపు మరకలతో ఇబ్బంది ఉండదు.

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటీరీ లక్షణాలుండటం వల్ల ఇది మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. అలాగే స్కిన్ టోన్ ను బ్రైట్ చేస్తుంది. అలాగే ముఖంలో డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది. స్కిన్ పిగ్మేంటేషన్ సమస్య ఉండదు . కొబ్బరి నూనెలోని గుణాలు స్కిన్ స్ట్రక్చర్ ను మరీ టైట్ గా మార్చకుండా చేస్తుంది. పాలు చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. స్కిన్ బ్రైట్ గా మార్చుతుంది. ఈ టర్మరిక్ ఫేస్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల చర్మంను నేచురల్ గా బ్రైట్ గా మార్చుతుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్