5 నిముషాల్లో మొటిమలను క్లియర్ చేసే 7 సింపుల్ టిప్స్



5 నిముషాల్లో మొటిమలను క్లియర్ చేసే 7 సింపుల్ టిప్స్
యవ్వనంలో ఉన్నవారి నుండి మద్యవయస్కుల వరకూ బాధించే సమస్య మొటిమలు. మొటిమలు ఎప్పుడు వస్తాయో...ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ ఒక సారి వస్తే మాత్రం వాటిని తొలగించకోవడం కష్టం. మొటిమలు అంత త్వరగా పోవు. ఒక వేళ వీటిని తొలగించుకోవడానికి ఏదైన కఠినంగా ప్రయత్నించినా వెంటనే వాటి తాలుకు మొండి మచ్చలు ఎర్పడటం ఖాయం. ఈ మచ్చలు స్కిన్ లోపలి నుండి ఏర్పడుతాయి. కాబట్టి, ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే మొటిమలను నివారించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ప్రయత్నించండి. ఇవి చర్మానికి సురక్షితమైనవి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు !

అసలు మొటిమలు ఏర్పడటానికి కారణాలు ఏంటి? చర్మ రంద్రాల్లో సెబాసియస్ గ్రంథులు ఎక్కువగా ఆయిల్ ను ఉత్పత్తి చేయడం వల్ల ఆ ప్రదేశంలో డస్ట్, బ్యాక్టీరియా చేరి, మొటిమలకు  దారితీసుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ మొటిమలల్లో పస్(చీము) కూడా చేరుతుంది .

బ్యాక్టీరియా ఉన్న ప్రదేశంలో చేతితో టచ్ చేసి, ముఖంలో ఇతర ప్రదేశంలో టచ్ చేయడం వల్ల అక్కడ కూడా మొటిమలు ఏర్పడుతాయి. ఇంకా స్ట్రెస్, హార్మోనుల ప్రభావం, నిద్రలేమి, పోషకాహార లోపం, డీహైడ్రేషన్ లు కూడా మొటిమలకు కారణమవుతాయి .
మొటిమలను నివారించుకోవడంలో హెర్బల్ రెమెడీస్ కొంత వరకూ సహాయపడుతాయి. బ్యూటీ , ఆరోగ్యం మీద తప్పని సరిగా ప్రభావం చూపుతుంది. కాబట్టి, అంతర్గతంగా మొదట క్లీన్ గా ఉంచుకోవాలి. చర్మం అందంగా...ఆరోగ్యంగా కనబడాలంటే మొదట శరీరం ఆరోగ్యంగా, హైడ్రేషన్ తో ఉండాలి. మొటిమలున్నప్పుడు వాటిని ప్లక్ చేయడం లేదా స్వయంగా మందులు ఉపయోగించడం, కఠినమైన టోనర్స్ ఉపయోగించడం, వాటిని గిల్లడం చేయడం వల్ల మొటిమలు ఎక్కువ అవుతాయి .
అలా జరగకుండా ఉండాలంటే, వంటగదిలో కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా మొటిమలను నివారిస్తాయి. మరి అలాంటి హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం....

టూత్ పేస్ట్:
టూత్ పేస్ట్ నోట్లో క్రిములను నాశనం చేయడం మాత్రమే కాదు, స్కిన్ మీద ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుం

ఎలా పనిచేస్తుంది : కొద్దిగా టూత్ పేస్ట్ ను చేత్తో కొద్దిగా తీసుకుని మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేస్తే ఎఫెక్టివ్ ఫలితాలను పొందవవచ్చు. ఉదయానికల్లా మొటిమలు ఎండిపోతాయి!

వెల్లుల్లి:
వెల్లుల్లిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. కాబట్టి మొటిమలను నివారించడంలో వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మంలోని డార్క్ స్పాట్స్ ను లైట్ గా మార్చుతుంది.

ఎలా పనిచేస్తుంది: వెల్లుల్లిని స్లైస్ గా కట్ చేసి మొటిమలను మీద రుద్దాలి. 5 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. లేదా వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి మొటిమల మీద మర్ధన చేయాలి. ఈ చిట్కాను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే, మొటిమల ఇరిటేషన్ ఉండదు. 5 నిముషాల్లో మొటిమలు క్లియర్ అవుతాయి.


ఓట్స్
ఓట్స్ లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని మలినాలను తొలగిస్తాయి. చర్మ రంద్రాలు ముడుచుకునేలా చేస్తాయి. దాంతో మొటిమలు తగ్గుతాయి

ఎలా పనిచేస్తుంది :

ఓట్స్ ను మెత్తగా పొడిచేసి, అందులో పాలు మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, డ్రై అయ్యే వరకూ ఉండి, తర్వాత స్క్రబ్ చేయాలి. కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ మర్దన చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ నేచురల్ టిప్ వల్ల 5 నిముషాల్లో మొటిమలు క్లియర్ అవుతాయి . వారంలో రెండు సార్లు ఈ చిట్కాను ఫాలో అయితే చాలు ఇక ముందు కూడా ఎప్పుడూ మొటిమల సమస్య ఉండదు!

నిమ్మరసం:
నేచురల్ యాసిడ్ మరియు ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంలోని జిడ్డును వెంటనే తొలగిస్తుంది.
ఎలా పనిచేస్తుంది: ఒక బౌల్లో నిమ్మరసం పిండుకుని అందులో కాటన్ బాల్ డిప్ చేసి మొటిమల మీద బాగా మర్ధన చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే 5 నిముషాల్లో మొటిమలు క్లియర్ అవుతాయి.

గుడ్డు

గుడ్డులో ప్రోటీన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి . ఇది స్కిన్ టాక్సిన్స్ ను క్లియర్ చేస్తాయి, చర్మ రంద్రాలను ముడుచుపోయేలా చేస్తాయి. చర్మంలో స్పాట్స్ ను తొలగిస్తాయి.

ఎలా పనిచేస్తుంది: ఒక బౌల్లో, ఎగ్ వైట్ తీసుకుని ముఖం మొత్తం అప్లై చేసుకోవాలి. 15నిముషాల తర్వాత ముఖంలో చర్మం స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచిది. మొటిమలను నివారించుకోవడానికి ఈ హోం రెమెడీని ఎప్పుడైనా ఫాలో అవ్వొచ్చు .

కీదరోదస కాయ:

కీరదోస కాయలో నేచురల్ కూలింగ్ లక్షణాలున్నాయి, మరియు ఇందులో యాస్ట్రిజెంట్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇది మొటమల్లో ఏర్పడ రెడ్ పస్ ను కూడా తొలగిస్తుంది. మొటిమలు డ్రైగా మారేందుకు సహాయపడుతుంది!

ఎలా పనిచేస్తుంది :
కీరదోసకాయలో నీళ్ళు చేర్చకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. దీన్ని పూర్తిగా డ్రై అయ్యే వరకూ అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. 15 నిముసాల్లో మొటిమలను తగ్గించుకోవడాని ఈ హెర్బల్ రెమెడీ కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.


టీ ట్రీ ఆయిల్ :
టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. రాత్రికి రాత్రి మొటిమలు డ్రై అయ్యేలా చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది: పచ్చి టీట్రీ ఆయిల్లో కాటన్ ను డిప్ చేసి, మొటిమలున్న ప్రదేశంలో మర్దన చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేయాలి. ఈ నేచురల్ టిప్ మొదటి సారి అప్లై చేసినప్పుడే మొటిమలను క్లియర్ చేస్తుంది.





Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్