చుండ్రు నివారణకు ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే హోం రెమెడీస్..!

జుట్టు సమస్యల్లో విసుగుపుట్టించేంది చుండ్రు. ఈ సమస్యను త్వరగా నివారించుకోకపోతే, సమస్య మరింత తీవ్రమవుతుంది. చుండ్రు నివారణకోసం ఉపయోగించే యాంటీ డ్యాండ్రఫ్ షాంపులు మనం ఊహించినంత ఫలితాలనివ్వవు. తాత్కలికంగా ఉపశమనం కలిగించినా, ఒకటి, రెండు రోజులకు తిరిగి అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి, చుండ్రును నేచురల్ గా తొలగించుకోవడాని కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. చుండ్రును పర్మనెంట్ గా తొలగిస్తాయి !

తలలో చుండ్రు ఏర్పడటానికి ముఖ్య కారణం: తల డ్రైగా ఉండటం, జుట్టు ఎక్కువగా పొడిబారడం వల్ల తలలో దురద ఎక్కువగా ఉంటుంది. దురద వల్ల తలను గోకినప్పుడు, తలలో నుండి పొట్టు వంటిది భుజాల మీద, దుస్తుల మీద రాలడం గమనిస్తుంటారు. కాబట్టి, ఎక్సఫ్లోయేషన్ చాలా వసరం. ఎక్స్ ఫ్లోయేషన్ అంటే చాలా మంది అది స్కిన్ సంబంధించినది, ఇది స్కిన్ వరకే పరిమితం అనుకుంటారు ? ముఖంలో డెడ్ స్కిన్ సెల్స్ పెరిగినప్పుడు, ముఖం డల్ గా కనబడుతుందని భావిస్తారు.

అదే విధంగా తలలో కూడా అటువంటి డెడ్ స్కిన్ ఉండటం వల్ల, తలలో చుండ్రు ఏర్పడుతుంది. చుండ్రుతో పాటు దురద పెరుగుతుంది.ఈ సమస్యను వెంటనే నివారించుకోకపోతే, జుట్టు రాలే సమస్యలు అధికమౌతాయి. దాంతో జుట్టు పల్చగా మారి, బట్టతలకు కారణమవుతుంది. చుండ్రును నివారించుకోవడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి, వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చుండ్రు సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందుతారు.


షుగర్ అండ్ లెమన్ :
షుగర్ పౌడర్ ను కొద్దిగా నిమ్మరసంలో మిక్స్ చేసి పేస్ట్ లా చేసి చుండ్రును ప్రదేశంలో లేదా తలలో అప్లై చేసి మర్దన చేసి, కొద్ది సేపు అలాగే వదిలేయాలి. ఇలా స్క్రబ్ చేయాలడం వల్ల తలలో ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది దాంతో చుండ్రు కంట్రోల్ అవుతుంది

ఉప్పు మరియు షాంపు
షాంపు మీద కొద్దిగా ఉప్పును చిలకరించి, దీన్ని తలలో అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో స్కిన్ కు ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చుండ్రును త్వరగా తగ్గించుకోవడానికి ఇది ఒక సులభమైన రెమెడీ.

టీట్రీ ఆయిల్ మరియు షాంపు :
రెగ్యులర్ షాంపుకు కొద్దిగా టీట్రీ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల ఇది యాంటీ డ్యాండ్రఫ్ షాంపులాగా పనిచేస్తుంది. మార్కెట్లో కెమికల్ బేస్డ్ యాంటీడ్యాండ్రఫ్ షాంపుల కంటే ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే ఇటువంటి షాంపుతో జుట్టుకు హాని కలగదు, ప్లస్ చుండ్రును ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు .

బేకింగ్ సోడ మరియు వాటర్ :
బేకింగ్ సోడాలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, తలలో చర్మం మీద అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేసి తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇది తలలో మలినాలను మరియు జిడ్డును , చుండ్రును తొలగిస్తుంది.

నిమ్మరసం మరియు ఆలివ్ ఆయిల్ :
నిమ్మరసం తలలో ఎక్సెస్ ఆయిల్ ను తొలగిస్తుంది. అలాగే ఆలివ్ ఆయిల్ జుట్టులోని నేచురల్ ఆయిల్ తొలగిపోకుండా కంట్రోల్ చేస్తుంది. చుండ్రు నివారణకు ఇది బెస్ట్ హోం రెమెడీ. ఈ రెండింటి మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, 15 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు వాటర్ :
ఒక కప్పు వాటర్ లో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇది తలలో మురికిని తొలగిస్తుంది. తలలో పిహెచ్ లెవల్స్ ను రీస్టోర్ చేస్తుంది. చుండ్రు నివారిస్తుంది

బేకింగ్ సోడ మరియు నిమ్మరసం :
బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లా తయారైన తర్వాత దీన్ని తలలో అప్లై చేసి మర్దన చేసి తలస్నానం చేయాి. ఇది యాంటీ డ్యాండ్రఫ్ రెమెడీగా పనిచేస్తుంది. చుండ్రు నివారించడంతో పాటు, జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. 

వైట్ వెనిగర్ మరియు వాటర్ :
వాటర్ లో వైట్ వెనిగర్ మిక్స్ చేసి స్ప్రే బాటిల్లో నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు తలకు స్క్వీజ్ చేసి, 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి

అలోవెర జెల్ మరియు ఉప్పు :
వాష్ స్ర్కబ్ ప్రకారం, అలోవెర జెల్లో కొద్దిగా ఉప్పు చిలకరించి తలకు అప్లై చేసి మర్దన చేయాలి. 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు నివారించబడుతుంది. జుట్టుకు పోషణ మరియు షైనింగ్ అందిస్తుంది.

టీట్రీ ఆయిల్ మరియు వాటర్ :
టీట్రీ ఆయిల్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. టీ ట్రీ ఆయిల్లో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. తిరిగి చుండ్రు ఏర్పడకుండా సహాయపడుతుంది.

నిమ్మరసం మరియు ఉప్పు :
చుండ్రును నివారించుకోవడానికి ఉపయోగించే ఈ హోం రెమెడీ తలలో ఎక్సెసివ్ సెబెమ్ ను నివారిస్తుంది. ఉప్పు తలలో పొట్టు వంటి పదార్థాన్ని తొలగిస్తుంది. చుండ్రు నివారించడంలో ఉప్పు గ్రేట్ హోం రెమెడీ.


దాల్చిన చెక్క మరియు ఆలివ్ ఆయిల్ :

దాల్చి చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది తలలో ఇన్ఫెక్షన్స్ , మరియు వేగంగా చుండ్రు నివారిస్తుంది. అలాగే ఇక ముందు చుండ్రు రాకుండా నివారిస్తుంది. కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్