దంతాలను తెల్లగా మిళమిళ మెరిపించే 7 హెర్బల్ రెమెడీస్
సాధారణంగా దంతాలు తెల్లగా మరియు మెరుస్తుండేలా ఉంచుకోవడం చాలా మందికి ఇష్టం. అలా మిరిమిట్లు గొలిపే ఓ అందమైన నవ్వు కొన్ని మిలియన్ల గుండెను కరించేస్తాయి. కానీ, తెల్లగా ఉండే మెరిసేటి దంతాల కోసం నోటి ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. అందుకు ప్రతి రోజూ రెండు మూడు సార్లు బ్రెష్ చేయడం వల్ల మరియు కొన్ని డెంటల్ టిప్స్ ఫాలో అవ్వడం చాలా వసరం.
ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఎంతో అందంగా ఉంటుంది. అయితే పలువరుస అందంగా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్లగా మిళమిళలాడుతూ ఆరోగ్యం ఉంటాయి. అయితే మరొకొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి.
మీ దంతాలు పసుపపచ్చగా ఉన్నాయా? తెల్లగా మిళమిళ మెరిసే తెలుపు పళ్ళ కోసం రకరకాల పేస్టులు వాడినా ఫలితం కనిపించడం లేదా? మీ దంతాల మీద ఏర్పడ్డ పసుపు పచ్చ రంగు పోవటానికి ఏమైనా మంత్రముందా అని ఆలోచిస్తున్నారా?
మంత్రాలైతే లేవు కానీ మనకు అందుబాటులో ఉండే కొన్ని హోం రెమెడీస్, చిట్కాల ద్వారా దంతాలను తెల్లగా మార్చుకోవచ్చే. ఉదాహరణకు బేకింగ్ సోడ, చార్కోల్, ఉప్ప వంటివి గ్రేట్ గా సహాయపడుతాయి.
దంతాల మీద పసుపు పచ్చరంగు (గార)పేరుకుపోవటానికి జన్యుప్రభావం, ఆరోగ్య శుభ్రత పాటించకపోవడం, ఆహారపు అలవాట్లు, వయసు, యాంటీబయోటిక్స్ ఉపయోగించడం, కెఫిన్ ఎక్కువ తీసుకోవడం ఇలా పలు కారణాలుంటాయని చెప్పవచ్చు. ఇక దంతాల మీద ఉండే పసుపు పచ్చటి రంగుని పోగొట్టాలంటే ఇవి వాడి చూడండి...ఈ నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడర్ ఎఫెక్ట్స్ ఉండవు. సురక్షితమైనవి.
ఆరెంజ్ పీల్
ఆరెంజ్ తొక్కలో క్యాల్షియం, విటమిన్ సి లు అధికంగా ఉన్నాయి. ఇవి దంతాల మీద ఎల్లో మరకలను నివారిస్తాయి. అలాగే సూక్ష్మ క్రిములను నివారిస్తాయి
ఎలా పనిచేస్తుంది
ఆరెంజ్ తొక్కను ఎండలో ఎండబెట్టాలి. తర్వాత దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ తో బ్రష్ చేసుకోవాలి. ఈ హోం రెమెడీని దంతాలు తెల్లగా మారే వరకూ ఉపయోగిస్తుంటే మంచి మార్పు కనిపిస్తుంది.
నిమ్మరసం:
నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది దంతాల మీద ఏర్పడ మొండి మరకలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఎలా పనిచేస్తుంది: కొన్ని చుక్కల నిమ్మరసంను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి, ఈ నీటిలో గార్లిగింగ్ చేయాలి. ఎల్లో టీత్ ను తెల్లగా మార్చడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది, ఎక్కువగా ఉపయోగిస్తే ఇది దంతాల మీద ఎనామిల్ తొలగిస్తుంది. కాబట్టి దీన్ని మితంగా తీసుకోవాలి.
తులసి
ఇంట్లో తయారుచేసుకొనే పదార్థాలు కూడా దంతాలను తెల్లగా మార్చుతాయి . ఎండబెట్టి తులసి ఆకులను పౌడర్ చేసి, దాంతో దంతాలకు రెగ్యులర్ బ్రెష్ చేసుకోవచ్చు . తులసిలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. బ్లీచింగ్ ఏజెంట్ వల్ల దంతాలను తెల్లగా మార్చుతాయి.
పసుపు:
పసుపులో యాంటీఆక్సిడెంట్స్ , యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, పసుపు దంతాల మీద పసుపు రంగును వదిలిస్తుంది. పసుపులో కొద్దిగా ఉప్పు మిక్స్ చేసి, నిమ్మరసం మిక్స చేసి బ్రష్ తో ఈ పౌడర్ ను అద్ది దంతాల మీద రుద్దాలి. ఈ రెమెడీ దంతాలను తెల్లగా మార్చుతుంది. పాచి తొలగిస్తుంది.
స్ట్రాబెర్రీస్
స్ట్రాబెర్రీ వల్ల దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. స్టాబెర్రీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి ఇది నేచురల్ టీత్ క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాకు మెత్తగా చేసిన స్ట్రాబెర్రీ మిక్స్ చేసి, చేతి వేళ్ళతో దంతాల మీద అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత టూత్ బ్రష్ తో బ్రష్ చేసుకోవాలి . రెగ్యులర్ టూత్ పేస్ట్ తో రుద్ది కడగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బేకింగ్ సోడ:
ఈ రెండి పదార్థాలు ప్రతి ఇంట్లో వంటగదిలో ఉండే వస్తువులే . దంతామీద, మరియు లోపల నుండి మరకలను వదిలించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచుర్ ను బేకింగ్ సోడా న్యూట్రలైజ్ చేసి దంతాలను శుభ్రపరుస్తాయి. బేకింగ్ సోడాలో బైకార్బోనేట్ మరియు ఆల్కలైన్స్ ఉంటాయి. ఇవి దంతాల మీద మరకలను నివారిస్తాయి. ఎసిడిక్ నేచర్ ను తగ్గిస్తాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్ లా కలిపి బ్రెష్ తో దంతాల మీద రుద్ది 5నిముషాల తర్వాత నోటిని శుభ్రపరుచుకుంటే తళతళలాడే దంతాలు మీ సొంతమవుతాయి.
కొబ్బరి నూనె
చాలా వరకూ కొబ్బరి నూనెలో స్కిన్ మరియు హెయిర్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి . కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ దంతాల మీద పాచికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. మరియు నోటిని ఫ్రెష్ గా ఉంచుతుంది . కొద్దిగా కొబ్బరి నూనెను చేతి వేళ్లతో దంతాల మీద అప్లై చేసి రుద్దాలి . మింగకుండా, కొద్దిసేపటి తర్వాత బ్రష్ చేసి శుభ్రం చేసుకోవాలి.
Comments
Post a Comment