మొటిమలు రావడానికి కారణమయ్యే బ్యూటి హ్యాబిట్స్..!!

ప్రతిఒక్కరికీ.. మొటిమల సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో.. డ్రై స్కిన్ అయినా, ఆయిలీ స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ అయినా.. ముఖంలో మొటిమల సమస్యను ఫేస్ చేస్తారు. కాబట్టి ఇలా మొటిమలు రావడానికి బ్యూటి హ్యాబిట్సే కారణమా ?

స్కిన్ బ్రేక్ అవుట్స్ అనేవి.. మొటిమల రూపంలో వస్తాయి. ఇవి.. తర్వాత అసహ్యకరమైన మచ్చలకు దారితీస్తాయి. అవి మానైనా కూడా.. మచ్చలు మాత్రం అలాగే ఉంటాయి. మొటిమలు రాగానే.. వాటిని వెంటనే పోగొట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాం.

కొంతమంది పింపుల్స్ నివారించుకోవడానికి కొన్ని ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కొన్ని బాగా ఉపయోగపడినా.. మరికొన్ని వాపుకి కారణమవుతాయి. కాబట్టి న్యాచురల్ పదార్థాలతో మొటిమలను నివారించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే.. కొన్ని బ్యూటి హ్యాబిట్స్ కూడా.. పింపుల్స్ రావడానికి కారణమవుతాయి.



ఎక్కువగా స్క్రబ్ చేయడం

చర్మంపై అదనపు ఆయిల్ తొలగించడం కోసం.. మీ ఫేస్ ని చాలా ఎక్కువ స్క్రబ్ చేస్తున్నారా ? కానీ ఎక్కువగా స్క్రబ్ చేయడం వల్ల.. మొటిమల చుట్టూ చర్మం మరింత వాపు వస్తుంది. కాబట్టి అలా చేయడం మంచి అలవాటు కాదు.

డర్టీ మేకప్ బ్రష్ లు
ఉపయోగించిన, దుమ్ముతో కూడిన మేకప్ బ్రష్ లను ఉపయోగిస్తే.. చర్మ రంధ్రాల్లో మరింత ధూళి చేరుకుంటుంది. మేకప్ బ్రష్ లను, స్పాంజ్ లను రెగ్యులర్ గా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటిని క్లీన్ చేసే ఓపిక, సమయం లేదంటే.. వేళ్లతో మేకప్ చేసుకోవడం మంచిది.

సన్ స్క్రీన్
సన్ స్క్రీన్ అనేది ప్రతి రోజూ కంపల్సరీ అప్లై చేయాలి. అలాగే నమ్మకమైన బ్రాండ్ కి సంబంధించిన సన్ స్క్రీన్ ని మాత్రమే ఉపయోగించాలి. నాన్ కొమోడొజెనిక్, నాన్ గ్రీజీ వాటిని ఉపయోగించడం మంచిది.

ముఖాన్ని ముట్టుకుంటూ ఉండటం

ముఖాన్ని పదే పదే ముట్టుకోవడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. చేతులపై ఉండే బ్యాక్టటీరియా.. డైరెక్ట్ గా చర్మ రంధ్రాల్లోకి వెళ్తుంది. తర్వాత.. మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి ఇలాంటి అలవాటు ఉంటే.. వెంటనే మానేయండి.


హెయిర్ ప్రొడక్ట్స్
అనేక హెయిర్ ప్రొడక్ట్స్ గ్రీజీగా, మందంగా, ఆయిలీగా ఉంటాయి. అవి ముఖంపై పేరుకుపోతాయి. దీనివల్ల.. మొటిమలు ఏర్పడతాయి. ఈ మొటిమలు హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల ఏర్పడతాయి.


మేకప్ లో పొరపాటు
మేకప్ ప్రొడక్ట్స్ లో ఉపయోగించే కొన్ని పదార్థాలు.. చర్మ రంధ్రాలపై ప్రభావం చూపుతాయి. మేకప్ వేసుకున్నప్పుడు డ్యామేజ్ కి కారణమవుతాయి. కాబట్టి.. మీ చర్మ తత్వాన్ని బట్టి.. సరిపోయే మేకప్ ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి.


పర్ఫ్యూమ్
కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ లో సెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి.. ముఖం చుట్టూ, మెడ చుట్టు పక్కల పర్ఫ్యూమ్ వేయకుండా జాగ్రత్తపడండి.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్