Posts

Showing posts from January, 2017

చర్మ ముడుతలను తొలగించే మార్గాలు

Image
చర్మంపై ముడతలు సర్వసాధారణమని చెప్పవచ్చు కానీ కొన్ని మార్గాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. ముడుతలను తగ్గించే మంచి పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది. 1  పండ్లు & కూరగాయలను ఎక్కువ తినండి పండ్లు మరియు కూరగాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్ ల వలన చర్మానికి కలిగించే ప్రమాదాలను తగ్గిస్తాయి. ఈ విధంగా ప్రమాదాలను తగ్గించి, చర్మం యవ్వనంగా కనపడేలా చేసి, ప్రకాశవంతంగా చేసి, వృద్దాప్య మార్పులను కనపడకుండా చేస్తుంది. 2  పొగత్రాగాకండి పొగతాగటం వలన శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు, చర్మంలో ఉండే 'కొల్లాజేన్' మరియు 'ఎలాస్టిన్' వంటి ముఖ్య సమ్మేళనాలను విచ్చిన్న పరుస్తుంది. పొగతాగటం మానేయటం వలన మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, చర్మ ముడుతలు కూడా తొలగిపోతాయి. 3  సరిపోయేంత సమయం పాటూ నిద్ర సరైన సమయం పాటూ నిద్రపోని ఎడల, శరీరంలో 'కార్టిసాల్' అధికంగా విడుదల చేయబడి, చర్మ కణాలను విచ్చిన్న పరుస్తుంది. కావున సరైన సమయం పాటు విశ్రాంతి తీసుకోవటం వలన హ్యూమన్ గ్రోత్ హార్మోన్ (మానవ పెరుగుదల హార్మోన్) ఎక్కువగా విడుదల చేయబడి, చర్మంపై ముడుతలు ఏర్పడకుండా చే...

వయసు తక్కువగా కనపడేలా చేసే దానిమ్మ తొక్క ఫేస్ ప్యాక్

Image
దానిమ్మ పండు తొక్కను సాధారణంగా భయటపడేస్తుంటాం. ఈ తొక్క వలన చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ లను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. దానిమ్మ తొక్క ద్వారా మీ చర్మాన్ని సంరక్షించుకోండి. మీ కంటి చుట్టూ నల్లటి వలయాలను, గీతలను గమనించారా? అంటే మీరు ఇప్పటి వరకి మీ చర్మానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని మరియు ఆ సమయం ఇపుడు ఆసన్నమైనదిగా చెప్పవచ్చు. మనం భయట పడేసే పండ్లు మరియు కూరగాయల తొక్కలు పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయని మీకు తెలుసా? అవును ఇవి ఎంతగానో చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ముఖ్యంగా దానిమ్మ పండు తొక్క వలన చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు.  దానిమ్మ పండు తొక్క అనేక యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది, ముఖ్యంగా ఈ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్ లను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మరోవైపు ఆస్ట్రిజెంట్ (రక్తస్రావనివారిణి) గుణాలను కూడా కలిగి ఉండే ఈ తొక్క, చర్మాన్ని ఉద్దీపనలకు గురి చేసి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి, యవ్వనంగా కనపడేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ మరియు ఆస్ట్...

త్వరగా వృద్దాప్య లక్షణాలకు గురయ్యే శరీర భాగాలు మరియు కారణాలు

Image
వృద్దాప్య సంకేతాలు బహిర్గతం అవటం అనేది శరీర భాగాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ: కేంద్ర భాగంలో వృద్ధాప్య ప్రారంభ సంకేతాలకు బహిర్గతమవుతాయి. స్త్రీ స్తనకనాజాలం, వేగంగా వృద్దాప్య లక్షణాలకు గురవుతుంది. మోచేయి ప్రాంతంలో ఉండే చర్మం వదులుగా  అవటం వృద్దాప్య లక్షణం వయసు మీరుతున్న కొలది చర్మంపై ముడతలు మరియు బలహీనంగా మారటం వంటి లక్షణాలు సాధారణమే. అయితే ఈ లక్షణాలు కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి. మన శరీర భాగాలన్ని ఒకే రేటులో వృద్దాప్య మార్పులకు గురి కావు. ఇది వినటానికి నమ్మశక్యంగా లేకున్నను, ఇదే నిజం. అవును అన్ని శరీర భాగాలు వివిధ స్థాయిలలో వృద్దాప్య లక్షణాలకు గురవుతుంటాయి. ముఖ: కేంద్ర భాగం, చెంపలు మరియు పెదాలు మొదటగా వృద్దాప్య మార్పులకి గురవుతాయి. మిగిలిన భాగాలు వాటికి అనుగుణంగా వృద్దాప్య మార్పులకు లోనవుతూ ఉంటాయి. ఎందుకు వివిధ భాగాలు వేగంగా వృద్దప్యానికి లోనవుతాయి చేతులు శరీర భాగాలలో చేతులు ఎక్కువగా వాతావరణానికి బహిర్గతం అవుతాయి. ఇతర భాగాలతో పోలిస్తే, సాధారణంగా ఇవే వేగంగా వృద్దాప్య లక్షణాలకు బహిర్గతమవుతాయి. సూర్యకాంతి చేతి చర్మాన్ని ప్రమాదానికి గురి చేయటం వలన త్వరగా వృద్దా...

వెంట్రుకల నిర్మాణం, పెరిగే దశలు & జుట్టు రాలుటకు కారణాలు

Image
ఒక వెంట్రుక జీవితకాలం సుమారు 3 నుంచి 5 ఏళ్లు ఉంటుంది. తలపై చర్మం మధ్యపొర కార్టెక్స్ ఎంత దృఢంగా ఉంటే జుట్టు అంత గట్టిగా ఉంటుంది. జుట్టు రాలటానికి మానసిక ఆరోగ్యం కుడా ప్రభావిత పరుస్తుంది. హోమియో థెరపీ  ద్వారా కూడా జుట్టు రాలటాన్ని తగ్గించవచ్చు. మానవుని తలపై సుమారు లక్ష నుంచి లక్షాయాభై వేల వరకు వెంట్రుకలు ఉంటాయి. జుట్టు మొదలయ్యే భాగాన్ని జుట్టు కుదురు(హెయిర్ ఫాలికిల్)అంటారు. ఒక జుట్టు కుదురు నుంచి జీవితకాలంలో సుమారు 20 నుంచి 30 వేల వరకు వెంట్రుకలు రాలిపోతాయి. ఒక వెంట్రుక జీవితకాలం సుమారు 3 నుంచి 5 ఏళ్లు ఉంటుంది. వెంట్రుక నిర్మాణం జుట్టు కుదురు చర్మంలోని రెండవ పొర అయిన డెర్మిస్ నుంచి మొదలవుతుంది. ప్రతి ఒక్క వెంట్రుక 3 పొరలలో ఏర్పడుతుంది. వాటిని మెడుల్లా, కార్టెక్స్, క్యూటికల్ అని అంటారు. దీనిలో మధ్యపొర అయిన కార్టెక్స్ ఎంత దృఢంగా ఉంటే జుట్టు అంత గట్టిగా ఉంటుంది. ఈ కార్టెక్స్‌లోనే మెలనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఎక్కువగా ఉంటే జుట్టు నల్లగా ఉండటం, తక్కువగా ఉంటే లేక తక్కువైపోతే తెల్లవెంట్రుకలు వస్తాయి. జుట్టు పొడవుగా పెరగడం జుట్టు కుదుళ్ల నుంచి ప్రారంభమవుతుంది. ...

కాలుష్యం నుండి మన చర్మాన్ని కాపాడుకునే చిట్కాలు

Image
గాలి, నీటి కాలుష్యం మన చర్మ ఆరోగ్యాన్ని చాలా వరకు నష్టపరుస్తాయి. వీటి వలన కలిగే నష్టాలను నివారించే చిట్కాల గురించి ఈ లింక్ లో తెలుపబడింది. 1 సన్ స్క్రీన్ ఎండలోకి వెళ్ళే 20 నిమిషాల ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవటం వలన చర్మం పొడిగా మారదు. కావున బయటకి వెళ్ళే 10 నిమిషాల ముందు మీ చర్మానికి తేమభరిత లోషన్ లను అప్లై చేయండి. ముఖ్యంగా మధ్యాన్నం 12 నుండి 3 గంటల మధ్యలో బయటకి వెళ్ళకండి. ఈ సమయంలో సూర్యరశ్మి తీవ్రంగా ఉంటుంది 2  నీరు మీ చర్మానికి అంతర్గతంగా చాలా నీరు అవసరం కావున నీటిని ఎక్కువగా తాగటానికి ప్రయత్నించండి. కావున రోజులో కాఫీకి, ఆల్కహాల్ మరియు టీలకు బదులుగా కనీసం 8 గ్లాసుల నీటిని తాగండి. నీటికి నిమ్మరసం జోడించటం వలన మంచి ప్రయోజనాలను పొందవచ్చు 3  క్లీన్సర్ కాలుష్యం వలన మీ చర్మంపై నిండిఉన్న దుమ్ము, ధూళి వంటి వాటిని తొలగించుటకు రోజు ముఖాన్ని కడగండి. ఎల్లాపుడు మీతో కాటన్ బాల్స్ మరియు క్లీన్సర్ లను బ్యాగ్ లో ఉంచుకొని వెళ్ళండి. మీరు పడుకోటానికి ముందు చర్మాన్ని శుభ్రపరచి పడుకోండి 4  స్క్రుబ్ ప్రతి మహిళ వారంలో కనీసం ఒకసారైన వారి ముఖాన్ని స్క్ర...

పోషకాల లోపం వలన బహిర్గతమయ్యే లక్షణాలు

Image
విటమిన్, మినరల్స్, మూలకాలు అన్ని శరీరానికి అవసరం వీటి లోపాల వలన ఆరోగ్యానికి చాలా రకాల వ్యాధులు కలుగుతాయి, పోషకాల లోపం వలన కలిగే సమస్యలు మరియు ఆవశ్యకత గురించి ఇక్కడ తెలుపబడింది. 1 పోషకాల లోపం వలన కలిగే నష్టాలు శరీరానికి కావలసినంత మొత్తంలో పోషకాలను అందించకపోవటం వలన, పోషకాహార లోపం లేదా పోషకాల లోపం కలుగుతుంది. శరీరంలో పోషకాల లోపం వలన వివిధ రకాల సమస్యలు బహిర్గతమవుతాయి. ముఖ్యంగా ఎముకల పెరుగుదలలో లోపాలు, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు, జ్ఞాపక శక్తి లోపాలు కలుగుతాయి. 2 అలసట ప్రోటీన్-ఎనేర్జీ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ 'B1', 'B2', 'B12' మరియు ఇతర విటమిన్ 'B' మూలకాలు మరియు విటమిన్ 'C' వంటి పోషకాల లోపం వలన అలసట కలుగుతుంది. అలసట కలుగుటకు ఇతర కారణాలు-'హిపోథైరాయిడిసం', 'అనీమియా', 'మధుమేహం' మరియు 'డిప్రెషన్' అని చెప్పవచ్చు. 3 మలబద్ధకం మరియు డీహైడ్రేషన్ మీరు తినే ఆహరంలో 'ఫైబర్', 'పొటాషియం', 'మెగ్నీషియం' మరియు 'ఫోలేట్' వంటి పోషకాల లోపం వలన మధుమేహం లేదా డీహైడ్ర...

తడి జుట్టుకు టవల్ వాడటం వలన కలిగే నష్టాలు

Image
కఠినమైన నిర్మాణాన్ని కలిగి ఉండే టవల్ జుట్టును ప్రమాదానికి గురి చేస్తాయి. తడిజుట్టుకు టవల్ ను వాడటం వలన ప్రమాదం కలగవచ్చు. జుట్టు ఆరుటకు, t-షర్ట్ లేదా మృదువైన గుడ్డను వాడండి. సహజంగా జుట్టును ఆరబెట్టడం ఒక మంచి పద్దతి. మనలో చాలా మంది, స్నానం తరువాత ముఖ్యంగా స్త్రీలలో జుట్టు ఆరుటకు టవల్ ను చుట్టూ కుంటారు. దీని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఈ అలవాటును ఇలానే కొనసాగించటం వలన భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే, ప్రతిసారి కఠినమైన నిర్మాణాన్ని కలిగి ఉండే ఫైబ్రిక్ లేదా టెర్రీ టవల్ ను వాడటం వలన జుట్టు ఆరోగ్యం ప్రమదానికి గురై వెంట్రుకల కొనలు తెగటం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. జుట్టు ఎలా ప్రమాదానికి గురవుతుంది? పొడిగా ఉండే జుట్టు కన్నా, తడి జుట్టు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే నీటిలో నానిన జుట్టు, స్థితిస్తాపకతను కలిగి ఉండి మరియు తెగిపోవటానికి సులువుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కఠినంగా, పొడిగా ఉండే టవల్ లేదా టెర్రీ టవల్ తో జుట్టు లాగటం వలన మృదువుగా ఉండే టవల్ (వెంట్రుకల బయటిపొర) ప్రమదానికి గురై జుట్టు రాలిపోతుంది. దీనికి బదులుగా ...

పొట్ట చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే కొవ్వును తగ్గించుకోవటం ఎలా?

Image
కొవ్వును తగ్గించుకోవటానికి పత్యాలను అనుసరించటం ఆరోగ్యకరం కాదు. వ్యాయామాలు, భోజనం మరియు తక్కిన సమయం పాటూ నిద్ర తప్పనిసరి. సిగరెట్ అలవాటు వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల నిల్వ అధికం అవవచ్చు. రోజు యోగను అనుసారించండి మరియు జుంబ క్లాసులో హాజరవ్వండి. శరీర బరువును తగ్గించుకోవటం కష్టమనే చెప్పాలి. ముఖ్యంగా, మీరు ఆహారాన్ని తీసుకోకుండా బరువును తగ్గించుకోవటం కష్టం మరియు ఆరోగ్యానికి కూడా హానికరం. మీ నడుము చుట్టూ మరియు పొట్ట మీద ఉన్నకొవ్వును తగ్గించుకోవటానికి చాలా మంచి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆహార సేకరణను తగ్గించటం వలన తాత్కాలికంగా మేలు కలుగవచ్చు. అయితే సరైన సమయం పాటూ నిద్ర లేకపోవటం, ఆయాసం మరియు ఒత్తిడి లాంటి ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతినకుండా మీ శరీరంలోని, అదనపు కొవ్వును తగ్గించుకొనే మార్గాలను పరిశీలిద్దాం. ఆరోగ్యం గురించి ఆలోచించండి మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనగా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. నూనెలో వేయించిన ఆహారాలను మరియు ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. తాజాగ...

మీ స్కాల్ప్ పొడిగా ఉందా? ఈ వ్యాసం మీకోసమే...

Image
జింక్, విటమిన్ 'C' తలపై చర్మన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. వేడిగా ఉండే నూనెతో తలపై చర్మానికి మసాజ్ చేయండి. గోకటం వలన తలపై చర్మ పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. సూర్యరశ్మికి బహిర్గతం అవకుండా జాగ్రత్త పడండి. పొడిగా మరియు దురదలకు గురిచేసే తలపై చర్మం లేదా స్కాల్ప్ వలన కలిగే ఇబ్బంది, చికాకు మరోటి ఉండదు. మన శరీరంలో పట్టించుకోకుండా ఉండే భాగం తలపై చర్మం మరియు స్కాల్ప్ లో సమస్యలు కలిగేంత వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోము. కానీ ఇక్కడ తెలిపిన కొన్ని చిట్కాల ద్వారా పొడిగా మరియు దురదలను కలిగించే తలపై చర్మం నుండి ఉపశమనం పొందవచ్చు. కీలక పోషకాలు జింక్, విటమిన్ 'C' వంటి పోషకాలు ఈ సమస్య నుండి త్వరగా కోలుకోటానికి సహాయపడతాయి. వైద్యుడిని లేదా ట్రైకాజిస్ట్ ను కలిసి పొడిగా ఉండే తలపై చర్మాన్ని ఆరోగ్యంగా మారటానికి ఈ పోషకాలు చాలా? లేదా ఇతర పోషకాలు కూడా అవసరమో ఒకసారి చర్చించండి. తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ 'C' ని సహజంగా సిట్రస్ జాతికి చెందిన పండ్ల నుండి పొందవచ్చు మరియు జింక్ ను పాల ఉత్పత్తులు, నట్స్ నుండి పొందవచ్చు. శుభ్రంగా ఉంచుకోండి పొడిగా, దురదలుగా ...

జుట్టు రాలుటను తగ్గించే ఆయుర్వేద పద్దతులు

Image
విటమిన్ 'E' ఆయిల్, బాదం వంటి వాటితో స్కాల్ప్ పై మసాజ్ చేయండి.   ఆయుర్వేద వైద్యంలో మీరు తినే ఆహార పదార్థాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మిల్క్, నట్స్, హోల్ గ్రైన్స్ వంటి వాటిని తినండి. తినే ఆహరం, ధ్యానం, అరోమాథెరపీ, ఆయిల్ మసాజ్ మరియు ఆయుర్వేద ఔషదాలు వంటి అన్ని కూడా జుట్టు రాలుటను తగ్గించే ఆయుర్వేద వైద్య శాస్త్రంలోకి వస్తాయి. మంచి ఫలితాలను పొందుటకు గానూ సంపూర్ణ విధానాలను అనుసరించాలి. ఆయిల్ మసాజ్ స్కాల్ప్ ను ఆయిల్ లతో మసాజ్ చేయటం వలన జుట్టు మరియు స్కాల్ప్ కు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజు కేవలం 5 నిమిషాల పాటూ మసాజ్ చేయటం వలన జట్టు రాలటం చాలా వరకు నియంత్రించబడుతుంది. వెంట్రుకల మొదల్లకు బలం చేకూర్చటానికి గానూ విటమిన్ 'E' గల ఆయిల్ తో స్కాల్ప్ కు మాసాజ్ చేయండి. కొబ్బరి మరియు బాద నూనెలు శక్తి వంతంగా జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. దీనితో పాటుగా, పొడి మరియు పొలుసులుగా రాలే స్కాల్ప్ ను కూడా తగ్గిస్తాయి. జుట్టు పలుచబడటాన్ని తగ్గించుటకు, హెర్బల్ సీరంతో స్కాల్ప్ ను మసాజ్ చేయండి. ఈ హెర్బల్ సీరాన్ని కనీసం వారానికి 3 ఆర్లు వాడటం వలన జుట్...

ఆరోగ్యకరమైన ఆకలిని పునరుద్ధరించే ఇంట్లో ఉండే ఔషదాలు

Image
నిజానికి ఆకలి పెరిగిన లేదా తగ్గినా ఒక రుగ్మత అని చెప్పవచ్చు. కానీ, కొంత మందిలో ఆకలి స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కారణం ఆరోగ్య సమస్యలు చెప్పవచ్చు, ఇతర కారణాలు అని చెప్పవచ్చు. ఆకలిని పెంచుటకు ఇతర అల్లోపతి మందులు అవసరం లేదు ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా ఆరోగ్యకర ఆకలిని పెంచుకోవచ్చు, వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి. 1 ఎందుకు ప్రజలు ఆకలి కోల్పోతారు కొన్ని సందర్భాలలో, చాలా మంది వారి ఆకలిని కోల్పోతుంటారు అవునా! ఆకలి తగ్గుటను ''అనోరేక్సియా'' అనీ అంటారు. దీనిని సహజ ఔషదాల ద్వారా సులభంగా తగ్గించవచ్చు. ఒకవేళ ఈ సమస్య చాలా రోజులుగా ఉంటె మాత్రం, వెంటనే వైద్యుడిని కలవటం చాలా మంచిది. ఒకవేళ మీరు అశ్రద్ధ చూపినట్లయితే, ఇతరేతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. 2 ఉసిరి ఇండియన్ గూస్పెర్రీ (ఉసిరి) ఆకలిని పెంచే సహజ ఔషదంగా పని చేస్తుంది. ఉసిరి, జీర్ణక్రియ వ్యవస్థ యొక్క పని తీరును మరియు కాలేయాన్ని నిర్విషీకరణకు గురిచేసి ఆకలిని పెంచుతుంది. తేనె మరియు ఉసిరి కలిపినా లేదా ఉసిరితో తయారు చేసిన ఉరగాయను తినండి. 3 నిమ్మ నిమ్మరసం, ఆకలిని ఎంతగానో పెంచుతుంది. నిమ్మకాయ నుండి రసా...

మెరిసే చర్మం కోసం వేగంగా ఇంట్లో తయారు చేసుకోగల సౌందర్య చిట్కాలు

Image
ఇంట్లో తయారు చేసే సౌందర్య పదార్థాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా మరియు మెరిసేలా చేస్తాయి. తేనే చర్మం కలిగి ఉన్న సమస్యలను తొలగించి, మెరిసేలా చేస్తుంది. టమాట రసంతో ముఖం కడగటం వలన చర్మం సహజ కాంతిని పొందుతుంది. చర్మం పునఃతాజీకరణ కోసం దోసకాయ, పాలు, ఐస్ ప్యాక్'లను కుడా వాడవచ్చు. సరైన పద్దతులలో, సరైన సౌందర్య చిట్కాలను వాడటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. మరియు కొన్ని రకాల ఇంట్లో ఉండే సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు, వీటి వలన మీ చర్మ రక్షణ కుడా సులభతరం అవుతుంది. సహజమైన సౌందర్య చిట్కాలను వాడటం వలన మీ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ మీ చర్మానికి వాడే పదార్థాలలో రసాయనాలలో తక్కువగా లేదా పూర్తిగా లేకుండా చూసుకోవటం చాలా మంచిది. ఇంట్లో సహజంగా ఉండే సౌందర్య ఔషదాల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు మరియు వీటికి ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం కొన్ని రకాల సౌందర్య చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డాయి. తేనే మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు త్వరగా ప్రకాశవంతంగా మారుటకు ఇంట్లో చాలా రకాల సౌందర్య చిట్కాలు మరియు ఔషదాలు అ...

40 సంవత్సరాల వయసు దాటిన తరువాత కుడా యవ్వనంగా కనపడుటకు చిట్కాలు

Image
క్రీమ్స్ చర్మకణాలని మృదువుగా మార్చి, మడతలను త్రోలగించి, గీతలను, మచ్చలను త్రోలగిస్తాయి. క్యాన్సేలార్స్ వలన కంటి దగ్గర చర్మం పైన ఉండే డార్క్ సర్కిల్స్ & ముడతలను త్రోలగిస్తాయి. ఎక్కువగా చర్మానికి పౌడర్'లను వాడటం అంత మంచిది కాదు. బూడిద రంగు మచ్చలకి నల్లటి ఐ లైనర్లు వాడటం వలన చూడటానికి మృదువుగా కనపడతాయి. 40 సంవత్సరాల వయసు దాటిన తరువాత , చర్మంలో చాలా రకాల అవాంచిత మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పులను మేకప్'ల వాడకంతో మీ చర్మం ప్రకాశవంతంగా మరియు చర్మం పైన వచ్చే మడతలను కనపడకుండా చేస్తాయి.  Face make up మేకప్'ల వాడకం వలన మీరు చూడటానికి యవ్వనంగా మరియు తాజాగా కనపడతారు. మేకప్'లలో కొన్ని సూచనలను అనుసరించటం వలన యవ్వనంగా కనపడేల చేస్తాయి. మీరు ఎంచుకునే మేకప్ రకాలు మరియు సౌందర్య సాధన రకాలతో పాటూ, వాటి రంగులు కూడా చాలా ముఖ్యం. క్రింద కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి వయసు మీరిన కొలది మీ చర్మం పైన మూడతలు వస్తున్నాయా! అలాంటి సమయంలో మీరు క్రీమ్స్'ని వాడటం చాలా మంచిది. మీరు ఎంచుకునే క్రీమ్స్ చర్మ కణాలని మృదువుగా మార్చి, మడతలను త్రోలగించాలి, గీతలను మరియు మచ్చలను కూ...

జుట్టు రాలటంపై ఉన్న ఈ హాస్యాస్పద అపోహలు నిజమే....

Image
రోజు మర్దన చేయటం వలన జుట్టు రాలుతుందని ఒక అపోహ చాలా ప్రచారంలో ఉంది. ఇదే కాకుండా, అత్యంత పరిహాసాస్పదమైన జుట్టు రాలటంపై ఉన్న మరిన్ని అపోహల గురించి ఇక్కడ మీ కోసం తెలుపబడింది. 1 అపోహలు & నిజాలు సాధారణంగా వయసు మీరుతున్న కొలది వెంట్రుకల సాంద్రత తగ్గిపోతుంది, అంతేకాకుండా, ఎక్కువ సమయం సూర్యకాంతికి బహిర్గతం అవటం, అనారోగ్యకర జీవన శైలి, జుట్టు లాగటం మరియు రసాయనిక ఉత్పత్తులను వాడటం వలన జుట్టు రాలిపోతుంది. 50 సంవత్సరాల వయసుకు చేరుకున్న స్త్రీ మరియు పురుషులలో 40 నుండి 50 శాతం మంది జుట్టు రాలిపోయే సమస్యలను కలిగి ఉన్నారు. ఇలానే కొన్ని నిజాలు కూడా అపోహల కింద చేర్చబడ్డాయి. ఎక్కువగా ప్రచారంలో ఉందనే అపోహల గురించి ఇక్కడ తెలుపబడింది.Image source:Gettyimages.in 2 తరచుగా షాంపూ చేయటం బట్టతలకు కారణం అవుతుంది మనం జుట్టుకు షాంపూ వాడిన ప్రతిసారి అది మన జుట్టుపై ప్రతికూల లేదా అనుకూల ప్రభావాలను చూపిస్తుంది. నిజానికి వెంట్రుకలు రాలటం మీ వంశంలో జన్యుపరంగా ఉంటే, దానర్థం మీ జుట్టు ఈ కారణం వల్లనే రాలుతుందని కాదు. దీనర్థం మీ జుట్టు సన్నగా ఉండే జుట్టుతో భదిలీ చేయబడుతుందని అర్థం. జిడ్డుగా ఉండే తలపై చర్మాన్ని...

చలికాలంలో మీ చర్మం పొడిగా మారుటకు గల కారణాలు ఇవే... -

Image
చలికాలంలో మన చర్మం పొడిగా మారటం చాలా సాధారణమే కాదా అని అనుకుంటాము, కానీ దీనికి కారణాలు ఎన్నో, నమ్మకమ కలగటం లేదా? అయితే ఇది చదవండి. 1 చలికాలంలో పొడి చర్మం చలికాలంలో చర్మం పొడిగా మారటానికి చలి కారణం అనుకుంటారు. కానీ, ఈ కాలంలో చర్మం పొడిగా మారటానికి చలి ఒక్కటే కాదు కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవును, మనం వాడే మందులు, రోజు వారి కార్యకలాపాలు, కృత్రిమ ఉత్పత్తుల వాడకం వంటివి కారణం కావచ్చు. ఆ కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది. ' 2 వేడితో నీటి స్నానం చలికాలంలో నీటిని తాకాలంటే కూడా భయమే! ఈ కాలంలో మనం ముఖం కడుక్కోవాలన్న కూడా వేడి నీటి కోసం చూస్తూంటాము. అవునా! ఇంకా స్నానానికైతే మరిగే నీరు కావాల్సిందే. కానీ, వేడి నీరు మనం చర్మంలో ఉండే సహజ తేమ మరియు నూనెలను కోల్పోయేలా చేసి, చర్మాన్ని పొడిగా మారుస్తుందని చేలా మందికి తెలియని విషయం. కావున ఈ రోజు నుండి వేడి నీటిని కాకుండా, గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేయండి. 3 ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తుల వాడకం చలికాలం వచ్చిందంటే చాలు టోనర్స్, లోషన్, బాడీ క్రీములు కొని తెచ్చి పెట్టుకుంటాము. కానీ కొన్ని రకాల ఉత్పత్తులు ఆల్కహాల్ ను క...