మీ జుట్టును తేలికగా మార్చే సహజ మార్గాలు

చాలా మంది వేసవి కాలంలో తేలికగా ఉండే జుట్టును ఇష్టపడుతుంటారు. రసాయనిక పదార్థాలను వాడకుండా మీ జుట్టును తేలికగా మార్చుకోవాలి అనుకుంటున్నారా? మీ కోసమే జుట్టును తేలిక పరిచే సహజ పద్దతుల గురించి ఇక్కడ వివరించబడింది.

1 తేనె మరియు వెనిగర్ - 

అన్ని రకాల పదార్థాలతో పోలిస్తే, తేనె చాలా రకాలుగా వినియోగించబడేది మరియు ఆలివ్ ఆయిల్ కూడా జుట్టు పొడిగా మారకుండా కాపాడుతుంది. వెనిగర్, వంటలో వాడని తేనె, ఆలివ్ ఆయిల్ మరియు యాలకులు కలిపి దీనిని జుట్టుకు వాడండి. ఈ మిశ్రమం జుట్టు మొత్తం విస్తరించటానికి దువ్వెన వాడండి లేదా జుట్టు తేలికగా మార్చాలి అనుకునే ప్రాంతాలలో వాడండి. అలాగే ఒక పూర్తి రాత్రి వరకు ఉంచి, తరువాత ఉదయాన కడిగి మార్పులను గమనించండి.


2.టీ - 

మీ జుట్టు తేలికగా మారటానికి బ్లాక్ టీ ని వాడవచ్చు. కానీ, చామోమిలే టీ జుట్టును ఆరోగ్యకరమైన, సిల్క్ గా మార్చే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. వేడిగా ఉండే నీటిలో టీ బ్యాగ్ ను 10 నిమిషాల పాటూ ఉంచండి. తరువాత చల్లార్చి, దీనిని జుట్టుకు అప్లై చేసి, కనీసం 15 నిమిషాల పాటూ వేచి ఉండండి. ఈ పద్దతిని షాంపూ చేసే ముందు 2-3 సార్లు అనుసరించటం వలన మీ జుట్టు తేలికగా మారుతుంది.

3 రుబార్బ్ - 

ఇది చాలా ప్రాముఖ్యం పొందినది మరియు గొప్పగా పని చేస్తుంది. దీనిలో రుబార్బ్ ను నీటిలో కలిపి వేడి చేసి, చల్లారే వరకు వేచి ఉండండి. దీనిని అలాగే ఉంచటం వలన తేలికగా ఉండే ద్రవాలు పైనకి చేరుతాయి. ఈ ద్రావణాన్ని జుట్టుకు అప్లై చేసి, 10 నిమిషాల పాటూ అలాగే ఉంచి తరువాత నీటితో కడిగి వేసి మార్పులను గమనించండి.


4 బేకింగ్ సోడా -

లైటేనింగ్ గుణాలను కలిగి ఉండే బేకింగ్ సోడా జుట్టును తేలికగా మార్చటమే కాకుండా, రసాయనిక పదార్థాలు పేరుకుపోవటాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది చాలా తక్కువ సమయం తీసుకునే చర్య, కానీ ప్రతి వారం ఈ పద్దతిని అనుసరించటం వలన జుట్టులో ఉండే రసాయనిక హానికర పదార్థాలు తొలగించబడి జుట్టు తేలికగా మారుతుంది.


5 దాల్చిన చెక్క -

దాల్చిన చెక్క జుట్టును తేలికగా మార్చటమే కాకుండా, మంచి సువాసనను కూడా వెదజల్లుతుంది. ఇందులో దాల్చిన చెక్క పొడిని మనం రోజు వాడే కండిషనర్ కు కలిపి, వెంట్రుకల మొదళ్లకు అద్దాలి. క్లిప్ సహాయంతో జుట్టును లాగి, నెమ్మదిగా వెంట్రుకల మూలాలకు ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా అప్లై చేయవచ్చు. ఇలా అప్లై చేసి, పూర్తి రాత్రి అలాగే ఉంచి, ఉదయాన షాంపూతో కడిగి వేయండి. ఈ పద్దతి చాలా సురక్షితం మరియు జుట్టు సులుభంగా తేలికగా మారుతుంది. Image source: Getty



Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్