వయసు తక్కువగా కనపడేలా చేసే దానిమ్మ తొక్క ఫేస్ ప్యాక్


  • దానిమ్మ పండు తొక్కను సాధారణంగా భయటపడేస్తుంటాం.
  • ఈ తొక్క వలన చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
  • యాంటీ ఆక్సిడెంట్ లను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది.
  • దానిమ్మ తొక్క ద్వారా మీ చర్మాన్ని సంరక్షించుకోండి.
మీ కంటి చుట్టూ నల్లటి వలయాలను, గీతలను గమనించారా? అంటే మీరు ఇప్పటి వరకి మీ చర్మానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని మరియు ఆ సమయం ఇపుడు ఆసన్నమైనదిగా చెప్పవచ్చు. మనం భయట పడేసే పండ్లు మరియు కూరగాయల తొక్కలు పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయని మీకు తెలుసా? అవును ఇవి ఎంతగానో చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ముఖ్యంగా దానిమ్మ పండు తొక్క వలన చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. 

దానిమ్మ పండు తొక్క అనేక యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది, ముఖ్యంగా ఈ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్ లను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మరోవైపు ఆస్ట్రిజెంట్ (రక్తస్రావనివారిణి) గుణాలను కూడా కలిగి ఉండే ఈ తొక్క, చర్మాన్ని ఉద్దీపనలకు గురి చేసి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చి, యవ్వనంగా కనపడేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ మరియు ఆస్ట్రిజెంట్  గుణాలను కలిగి ఉండే దానిమ్మ పండు తొక్క, చర్మ రంద్రాల పరిమాణాన్ని తగ్గించి, చర్మ నిర్మాణాన్ని కట్టడి చేసి, చర్మం సాగటం వంటి వాటికి దూరంగా ఉంచటం వలన దీనిని యాంటీ- ఏజింగ్ ఔషదంగా కూడా వాడవచ్చు. "జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ" వారు తెలిపిన దాని ప్రకారం, దానిమ్మ తోలు చర్మాన్ని  మరమ్మత్తుకు గురి చేసి మరియు అంతశ్చర్మం (డేర్మిస్) యొక్క పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది.


దానిమ్మ పండు తొక్కలను ఎలా వాడటం?

దానిమ్మ పండు తొక్కలను చూర్ణ లేదా పొడి రూపంలో కూడా వాడవచ్చు. గాలి చొరబడని బాటిలో ఉంచి కొన్ని నెలల వరకు దానిమ్మ తొక్క పొడిని దాచుకొని వాడవచ్చు. ఈ చూర్ణం ద్వారా భవిష్యత్తులో ఈ పొడితో మాస్క్ ను, ఫేస్ ప్యాక్ లేదా ముఖ: తయారీకి వాడే ఇతర ఉత్పత్తులలో కూడా వాడవచ్చు.

తాజా తొక్కతో ఫేస్ ప్యాక్

దానిమ్మ పండు నుండి తొక్కను వేరు చేసి, దంచండి. 2 చెంచాల క్రీమ్ మరియు 1 చెంచా ముడిశెనగలు పొడిని 1 చెంచా దంచిన దానిమ్మ తొక్క చూర్ణానికి కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, ముఖానికి మరియు మెడకు ఆప్లై చేయండి. ఇలా 30 నిమిషాల పాటూ వేచి ఉన్న తరువాత, గోరువెచ్చని నీటితో కడిగి వేయండి. 


దీనిని వాడే మరొక మార్గం- తాజా దానిమ్మ పండు తొక్కను తీసుకొని దంచి, ఎండిపోయిన చూర్ణ రూపంలో ఉండే దీనిని రోజ్ వాటర్ కు కలిపి పేస్ట్ వలే తయారు చేయండి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి మరియు మెడ కు అప్లై చేసి ఎండిపోయే వరకు వేచి ఉండండి. గోరువెచ్చని నీటితో కడిగి వేసి, తేమను అందించే ఉత్పత్తులను వాడండి. ఇలా చేయటం వలన మీరు యవ్వనంగా కనపడతారు.  

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్