జుట్టు రాలుటను తగ్గించే ఆయుర్వేద పద్దతులు


  • విటమిన్ 'E' ఆయిల్, బాదం వంటి వాటితో స్కాల్ప్ పై మసాజ్ చేయండి.  
  • ఆయుర్వేద వైద్యంలో మీరు తినే ఆహార పదార్థాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.
  • మిల్క్, నట్స్, హోల్ గ్రైన్స్ వంటి వాటిని తినండి.
తినే ఆహరం, ధ్యానం, అరోమాథెరపీ, ఆయిల్ మసాజ్ మరియు ఆయుర్వేద ఔషదాలు వంటి అన్ని కూడా జుట్టు రాలుటను తగ్గించే ఆయుర్వేద వైద్య శాస్త్రంలోకి వస్తాయి. మంచి ఫలితాలను పొందుటకు గానూ సంపూర్ణ విధానాలను అనుసరించాలి.





ఆయిల్ మసాజ్

  • స్కాల్ప్ ను ఆయిల్ లతో మసాజ్ చేయటం వలన జుట్టు మరియు స్కాల్ప్ కు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోజు కేవలం 5 నిమిషాల పాటూ మసాజ్ చేయటం వలన జట్టు రాలటం చాలా వరకు నియంత్రించబడుతుంది.

  • వెంట్రుకల మొదల్లకు బలం చేకూర్చటానికి గానూ విటమిన్ 'E' గల ఆయిల్ తో స్కాల్ప్ కు మాసాజ్ చేయండి.

  • కొబ్బరి మరియు బాద నూనెలు శక్తి వంతంగా జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. దీనితో పాటుగా, పొడి మరియు పొలుసులుగా రాలే స్కాల్ప్ ను కూడా తగ్గిస్తాయి.

  • జుట్టు పలుచబడటాన్ని తగ్గించుటకు, హెర్బల్ సీరంతో స్కాల్ప్ ను మసాజ్ చేయండి. ఈ హెర్బల్ సీరాన్ని కనీసం వారానికి 3 ఆర్లు వాడటం వలన జుట్టు మొదల్లకు కావలసిన పోషకాలు అందించబండతాయి.

  • జుట్టు రాలటాన్ని తగ్గించే మరొక ఆయుర్వేదిక్ ఆయిల్- బ్రింగరాజ్ ఆయిల్. ఈ నూనెను నేరుగా మీ స్కాల్ప్ మరియు జుట్టుపై పోసి మసాజ్ చేసి కనీసం ఒక రాత్రి వరకు అలాగే ఉంచండి. తరువాత ఉదయాన శుభ్రమైన నీటితో కడిగి వేయండి.
ఆయుర్వేద చికిత్సలో తినే ఆహారాలు కూడా కీలకమే

  • జింక్, విటమిన్ 'C', విటమిన్ 'B' కాంప్లెక్స్, సల్ఫర్ వంటి శరీరానికి అవరమయ్యే పోషకాలను అధికంగా కలిగి ఉండే ఫాటీ ఆసిడ్ లను ఎక్కువగా తీసుకోండి. ఇవి వెంట్రుకల మొదల్లకు బలాన్ని చేకూరుస్తాయి.

  • మొలకెత్తే విత్తనాలు, పాలు, బటర్, నట్స్, సోయా బీన్స్ మరియు గ్రైన్స్ వంటివి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి.

  • ఆరోగ్యకర మరియు బలమైనన్ వెంట్రుకల కోసం కలబంద రసం అవసరమని చెప్పవచ్చు. 3 నెలలకు రెండు సార్లు కలబంద రసాన్ని తాగటం చాలా మంచిది.

  • జుట్టు రాలుటను తగ్గించే శక్తివంతమైన ఔషదంగా యోఘర్ట్ ను పేర్కొనవచ్చు. రోజు యోఘర్ట్ తీసుకోవటం వలన జుట్టు రాలటం తగ్గుటను మీరు గమనించవచ్చు.

  • పండ్లు, కూరగాయలు, పచ్చని ఆకుకురాలను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోండి. వీటిలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది కావున జుట్టు రాలటం తగ్గుతుంది.

  • మెగ్నీషియం, కాల్షియం, నువ్వులు వంటివి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి.
జుట్టు రాలటాన్ని తగ్గించే ఇతర ఆయుర్వేద ఔషదాలు

  • ఆయుర్వేద ఔషదాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటమే కాకుండా, జుట్టు రాలుటను తగ్గిస్తాయి. రోజ్మేరీ, స్టింగింగ్ నేటిల్, బిర్చి మరియు హర్సేటల్ వంటివి ఉపయోగపడే ఇతర ఆయుర్వేద ఔషదాలు అని చెప్పవచ్చు. వీటిని నేరుగా స్కాల్ప్ కు అప్లై చేయటం వలన జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

  • లికోరైస్ కూడా జుట్టు రాలుటకు వ్యతిరేఖంగా పని చేసే ఔషదంగా చెప్పవచ్చు. పడుకోటానికి ముందు లికోరైస్ సారాన్ని స్కాల్ప్ పై మసాజ్ చేయండి.

  • మార్ష్మల్లౌ మరియు బర్డాక్ టీ జుట్టుకి మంచివి అని చెప్పవచ్చు.

  • మినపప్పు, బ్లాక్ బీన్స్ మరియు మెంతులను కలిపి ఒక పేస్ట్ ల చేయండి. ఈ మిశ్రమం ఒకే విధంగా అయ్యే వరకు వేడి చేయండి. ఈ మూడు మిశ్రమాలను పూర్తిగా కలిసే వరకు గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసి, 30 నిమిషాల తరువాత కడిగి వేయండి. ఈ పద్దతిని వారంలో రెండు లేదా మూడు సార్లు అనుసరించి మార్పులను గమనిచండి.


Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్