జుట్టు నెరవకుండా చేసే ఆహార పదార్థాలు

వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతకాలంలో, చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం వలన చాలా మంది రంగు వేయటం ప్రారంభిస్తున్నారు. కానీ ఈ ఆహార పదార్థాలను మీ ప్రణాళికలో కలుపుకొంటే, రంగు వేసుకోవలసిన అవసరమే ఉండదు.

1 ఆహార ఎంపికతో తెల్ల వెంట్రుకలకు దూరం

ఆరోగ్యకరమైన ఆహార సేకరణ ద్వారా జుట్టు తెల్లబడటాన్ని నివారించవచ్చు అని చెప్తే మీరు నమ్ముతారా? అవును నిజం! కానీ ఇది ఒక సిద్ధాంతపరమైనది.విటమిన్ మరియు మినరల్ వంటి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు తినటం వలన మీరు యవ్వనంగా కనపడతారు మరియు ఇవి వృద్దాప్యాన్ని ఆలస్యపరుస్తాయి.


2 పచ్చని ఆకుకూరలు
పచ్చని ఆకుకూరలు తలపై చర్మం పునరుద్దపరిచే విటమిన్ 'B' లను కలిగి ఉంటాయి. సాధారణంగా, ఎర్రరక్తకణాల ఉత్పత్తికి మరియు వెంట్రుక యొక్క అన్ని భాగాలకు రక్తం పంపిణి చేయటానికి తలపై చర్మానికి విటమిన్ 'B-6' మరియు విటమిన్ 'B-12' లు అవసరం. మన జుట్టు నల్లగా ఉండటానికి లేదా సహజ రంగులో ఉండటానికి విటమిన్ 'B-2' పై ఆధారపడి ఉంటుంది.


3 సూపర్ సాల్మన్
ఎప్పటికైనా ఆరోగ్యక ఆహార పట్టికలో నిలిచే ఆహార పదార్థంగా సాల్మన్ చేపను పేర్కొనవచ్చు మరియు దీనిని జుట్టు నెరవకుండా ఆపే ఆహార పదార్థాల పట్టికలో కూడా కలపవచ్చు. వెంట్రుకల ఆరోగ్యానికి కావలసిన హార్మోన్ లను స్రవించుటకు సాల్మన్ చేపలో ఉండే సెలీనియం తప్పక అవసరం. మీ జుట్టు నెరవటాన్ని ఆపుటకు వారంలో రెండు లేదా మూడు సార్లు సాల్మన్ చేపను తినండి.


4 గుడ్లు
మీ జుట్టు తెల్లగా మారటాన్ని ఆపాలంటే రోజు విటమిన్ 'B-12' తినండి. మీకు కావలసిన ఈ పోషకం గుడ్డులో లభిస్తుంది. నిజానికి ఫ్రీరాడికల్ లు మన వెంట్రుకలను తెల్ల రంగులోకి మారటాన్ని ప్రోత్సహిస్తాయి. కావున రోజు తినే ఆహార పదార్థాలలో ఒక గుడ్డును తినటం వలన జుట్టు తెల్లగా మారటాన్ని ఆలస్యపరచవచ్చు.


5 మాంసం మరియు కాలేయం
యువకులలో జుట్టు తెల్లగా మారటానికి గల కారణం- అనీమియా మరియు ఐరన్ లోపం వలన అని చెప్పవచ్చు. ఈ రకమైన జుట్టు తెల్లబడటాన్ని నివారించుటకు మాంసం మరియు కాలేయాన్ని తినండి. ఇవి శరీరానికి కావలసిన ఐరన్ ను అందిస్తాయి. 



Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్