ముడతలను తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు


  • గుడ్డులోని తెల్ల సొన ఆస్ట్రిజెంట్ గుణాలను కలిగి ఉండి, చర్మ రంధ్రాల మూసివేస్తుంది.
  • తేనె, ముడతలను తొలగించే కారకాలను & యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది.
  • అవకాడోలో ఉండే సహజ విటమిన్ 'A', 'B', & 'E'లు ముడతలను తొలగిస్తాయి.
  • రోజు రాత్రి ఆముదం నూనెను వాడటం వలన వీటిని తగ్గించవచ్చు.
వృద్దాప్యానికి చేరువయ్యే కొలది, శరీర చర్మంలో మార్పులు కలగటం మరియు ముడతలు ఏర్పడటం కూడా సాధారణమే అని చెప్పవచ్చు. ముడతల వలన చర్మం వేలాడుతూ కనబడుతుంది, ఇది కేవలం ముఖ చర్మంపై మాత్రమే కాకుండా, పూర్తి శరీరం పై ముడతలు ఏర్పడి చూడటానికి ఇబ్బందులను కలుగచేస్తుంది.


కానీ, ముడతలకు కారణం కేవలం వయసు మాత్రమే కాకుండా, అనారోగ్యకర ఆహార ప్రణాళిక, ఒత్తిడి మరియు వేగంగా బరువులో తగ్గుదల వలన కూడా చర్మంపై ముడతలు కలుగుతాయి. కొన్ని రకాలు ఇంట్లో ఉండే ఔషదాలు వయసు మీరిన కొలది చర్మంపై కలిగే మార్పులను, ముడతలను మరియు చర్మం వేలాడే స్థితిగతులను తగ్గించి వేస్తాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

గుడ్డు యొక్క తెల్ల సోన మాస్క్

ఆస్ట్రిజెంట్ (రక్తస్రావ నివారిణి) గుణాలను కలిగి ఉన్న, గుడ్డు యొక్క తెల్లసొన, చర్మ రంధ్రాల మూసివేస్తుంది మరియు చర్మంపై ముడతలకు గురవటాన్ని నివారించటమే కాకుండా, చర్మం వేలాడకుండా చేస్తుంది. రెండు గుడ్ల యొక్క తెల్ల సొనను తీసుకొని, ముఖంపై పూసి, ఫేస్ మాస్క్ లా వేయాలి. ముఖానికి మాత్రమే కాకుండా, మెడ పైన కూడా పూసి, కనీసం 20 నిమిషాల వరకు వేచి ఉండండి. తరువాత కాటన్ బాల్ తో తుడవండి. చర్మంపై ఉన్న ముడతలు కనపడకుండా ఉండటానికి, వారానికి రెండు సార్లు ఈ పద్దతిని అనుసరించండి.

తేనె

తేనె అనేది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, ప్రాముఖ్యం పొందిన ఔషదంగా చెప్పవచ్చు. అతేకాకుండా, చర్మ ముడతలను తొలగించే, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇదొక సహజ ఔషదం, చర్మానికి కావలసిన తేమను అందించి, స్థితిస్థాపకతను చేకూర్చి, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. తేనె చర్మాన్ని తడిపి, ముడతలను మరియు చర్మంపై ఉన్న గీతలను కూడా తొలగిస్తుంది. కావున, రోజు ఉదయాన తేనెను ముఖానికి పూసి, 15 నుండి 20 నిమిషాల పాటూ ఉంచి, గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి.


అవకాడో

అవకాడో, సహజ విటమిన్ 'A', 'B', మరియు 'E' లతో పాటూ యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. ఈ పోషకాలను చర్మానికి అందించినట్లయితే, చర్మం పై ముడతలు ఏర్పడటం తగ్గుతుంది. వయసు మీరిన కొలది కలిగే చర్మ సమస్యలను తగ్గించటానికి మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి, రోజు అవకాడోతో చేసిన ఫేస్ మాస్క్ ను వాడండి. దీని వాడకం వలన ముడతలు అదృశ్యం అవుతాయి. అవకాడో ఫేస్ మాస్క్ తయారీలో, అవకాడోను పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడ ప్రాంతాలలో పూసి, 20 నిమిషాల పాటూ ఉంచి గోరువెచ్చని నీటితో కడిగి వేయండి.

విటమిన్ 'E' మాత్రలు

సహాజ యాంటీ ఆక్సిడెంట్ గా పేర్కొనబడే విటమిన్ 'E', ఫ్రీ రాడికల్ లను తటస్థీకరింప చేసే శక్తిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ముడతలు ఏర్పడటానికి ముఖ్య కారణం అయినట్టి, కొల్లాజన్ స్థాయిలను కూడా క్షీనింపచేస్తుంది. మీరు వాడే సహజ ఫేస్ మాస్క్ లలో వీటిని వాడటం వలన మంది ఫలితాలను పొందుతారు.
క్యాస్టర్ ఆయిల్

రోజు రాత్రి పడుకోటానికి ముందుగా, క్యాస్టర్ ఆయిల్ ను ముఖానికి వాడటం వలన ముడతలు మాత్రమే కాకుండా, వయసు మీరిన కొలది చర్మంపై వచ్చే అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.

చర్మం పై వచ్చే ముడతలను తగ్గించుకోటానికి, పైన తెలిపిన ఇదొక దానిలో క్రమంగా వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్