స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు


  • జుట్టు ఆరోగ్యానికి, పునరుత్పత్తికి విటమిన్ 'A' తప్పక అవసరం.
  • ప్రోటీన్ జుట్టు వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
  • విటమిన్ 'E' రక్తప్రసరణను పెంచి, జుట్టు పునరుత్పత్తిని మెరుగుపరుస్తుంది.
  • కాల్షియం ఎముకలు మాత్రమే కాకుండా, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

స్త్రీలలో జుట్టు రాలటం అనేది నిరాశకు గురి చేస్తుంది. స్త్రీలలో జుట్టు రాలటం అనేది శిశు జననం లేదా అనీమియా (రక్తహీనత) వంటి కారణాల వలన కలుగుతుంది. ముఖ్యంగా అనారోగ్యం వలన స్త్రీలలో జుట్టు రాలటం జరుగుతుంది. కానీ, కొన్ని విటమిన్ లను తీసుకోవటం వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, జుట్టు రాలటం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, అధికంగా విటమిన్ సంబంధిత మాత్రల సేకరణ వలన కూడా జుట్టు రాలటం అధికం అవుతుంది. కావున, జుట్టు రాలుటను తగ్గించుకోటానికి గానూ, వైద్యుడిని సంప్రదించి తగిన తగిన స్థాయిలో విటమిన్ లను మరియు ఉపభాగాలను తీసుకోండి. అధిక మొత్తంలో విటమిన్ సేకరణ కూడా అనారోగ్యకరమే


విటమిన్ 'A'

జుట్టు ఆరోగ్యం మెరుగుపడటానికి మరియు వెంట్రుకలు పునరుత్పత్తిలో విటమిన్ 'A' ముఖ్య పాత్ర పోషిస్తుంది. క్యారెట్, పాలు మరియు బాదం ఈ విటమిన్ ను అధికంగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా, విటమిన్ 'A' కాప్సుల్ నుండి పొడిని సేకరించి, జుట్టుకు వాడే నూనెలలో కలిపి, తలపై చర్మం మరియు జుట్టుకు మసాజ్ చేయండి. సులభమైన పద్దతిలో విటమిన్ 'A' ను పొందుటకు గానూ, ఈ విటమిన్ అధికంగా కలిగి ఉండే బాదం నూనెతో తలపై మసాజ్ చేయండి.

సంక్లిష్ట విటమిన్ 'B'

విటమిన్ 'B1', 'B6', మరియు విటమిన్ 'B12' లు జుట్టు ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి. అతడు లేదా ఆమె సంక్లిష్ట విటమిన్ 'B' లోపాన్ని కలిగి ఉన్నారని వైద్యుడు నిర్ధారిస్తే, వీటిని పొందటానికి గానూ, మందులను మరియు ఉపభాగాలను వాడమని సలహా ఇస్తాడు. నిజానికి ఈ విటమిన్ లు, మనం తినే ఆహార పదార్థాలలో ఉండే పోషకాలను గ్రహించేలా ప్రోత్సహిస్తాయి. ఈ విటమిన్ లు ఎక్కువగా మాంసం, సంవిధానపరచని చక్కెరలు, బీన్స్, అరటిపండ్లు మరియు బంగాళదుంపల నుండి వీటిని పొందవచ్చు.


విటమిన్ 'C'

శాంతన పరిచే లేదా హీలింగ్ గుణాలను కలిగి ఉండే విటమిన్ 'C' జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రకమైన విటమిన్ ను మనం సాధారణంగా సిట్రస్ జాతికి చెందిన పండ్ల నుండి పొందవచ్చు. అంతేకాకుండా, శరీరానికి కావాల్సిన ఈ విటమిన్ ను రోజు నిమ్మరసం తాగటం వలన కూడా పొందవచ్చు. నిజానికి ఈ రకమైన రసాల ద్వారా పోషకాల కన్నా చక్కెరలు ఎక్కువ అందించబడతాయి. అంతేకాకుండా, ఈ విటమిన్ మందుల రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి.


విటమిన్ 'E'

రక్త ప్రసరణను పెంచి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాకుండా, వెంట్రుకల పునరుత్పత్తిలో కూడా ఈ విటమిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ 'E' ఎక్కువగా, బొప్పాయి, మామిడిపండ్లలో ఎక్కువగా లభిస్తుంది, అంతేకాకుండా, బ్రోకలీ మరియు టమోటా వంటి కూరగాయలలో అధికంగా పొందవచ్చు. సాధారణంగా తినే బీట్రూట్ మరియు చిలకడదుంపలో కూడా ఈ విటమిన్ ను పొందవచ్చు.


ఇతర పోషకాలు మరియు మినరల్ లు

పోషకాలను, మినరల్ లను పొందటానికి గానూ చాలా మంది మల్టి విటమిన్ మాత్రలను తీసుకుంటూ ఉంటారు. నిజానికి వీటి వలన జుట్టు రాలటం అధికం అవుతుంది. జుట్టు పెరుగుదలకు కావలసిన అన్ని రకాల పోషకాలను ఆరోగ్యకర ఆహార ప్రణాళిక నుండి పొందవచ్చు. స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే మినరల్ ల గురించి ఇక్కడ తెలుపబడింది.


ప్రోటీన్

మన వెంట్రుకలు కెరోటిన్ అనే ప్రోటీన్ ద్వారా నిర్మితమయ్యాయి. లీన్ మీట్, గుడ్లు, లెంటిస్ లేదా పప్పు దినుసులు మరియు పాల ఉత్పత్తుల నుండి ప్రోటీన్ ను పొందవచ్చు. వెంట్రుకల కణాలు మరియు కణజాలాలు ప్రమాదానికి గురవకుండా ఉండుటలో ప్రోటీన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. కావున తగిన స్థాయిలో ప్రోటీన్ సేకరణ తప్పని సరి.


కాల్షియం

పాలు, పాల ఉత్పత్తి మరియు మీట్ లలో అధికంగా ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాకుండా, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఐరన్ మరియు జింక్

చాలా మందిలో జుట్టు రాలటానికి ముఖ్య కారణం- ఐరన్, జింక్ వంటి మినరల్ ల లోపం వలన అని చెప్పవచ్చు. కావున మీ ఆహార ప్రణాళికలో ఇవి ఉండేలా చూసుకోండి.  

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్