40 సంవత్సరాల వయసు దాటిన తరువాత కుడా యవ్వనంగా కనపడుటకు చిట్కాలు
- క్రీమ్స్ చర్మకణాలని మృదువుగా మార్చి, మడతలను త్రోలగించి, గీతలను, మచ్చలను త్రోలగిస్తాయి.
- క్యాన్సేలార్స్ వలన కంటి దగ్గర చర్మం పైన ఉండే డార్క్ సర్కిల్స్ & ముడతలను త్రోలగిస్తాయి.
- ఎక్కువగా చర్మానికి పౌడర్'లను వాడటం అంత మంచిది కాదు.
- బూడిద రంగు మచ్చలకి నల్లటి ఐ లైనర్లు వాడటం వలన చూడటానికి మృదువుగా కనపడతాయి.
40 సంవత్సరాల వయసు దాటిన తరువాత , చర్మంలో చాలా రకాల అవాంచిత మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పులను మేకప్'ల వాడకంతో మీ చర్మం ప్రకాశవంతంగా మరియు చర్మం పైన వచ్చే మడతలను కనపడకుండా చేస్తాయి.
Face make up
మేకప్'ల వాడకం వలన మీరు చూడటానికి యవ్వనంగా మరియు తాజాగా కనపడతారు. మేకప్'లలో కొన్ని సూచనలను అనుసరించటం వలన యవ్వనంగా కనపడేల చేస్తాయి. మీరు ఎంచుకునే మేకప్ రకాలు మరియు సౌందర్య సాధన రకాలతో పాటూ, వాటి రంగులు కూడా చాలా ముఖ్యం.
క్రింద కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి
వయసు మీరిన కొలది మీ చర్మం పైన మూడతలు వస్తున్నాయా! అలాంటి సమయంలో మీరు క్రీమ్స్'ని వాడటం చాలా మంచిది. మీరు ఎంచుకునే క్రీమ్స్ చర్మ కణాలని మృదువుగా మార్చి, మడతలను త్రోలగించాలి, గీతలను మరియు మచ్చలను కూడా తగ్గించాలి.
కంటికి మేకప్
- కాన్సేలార్స్ వలన కంటి దగ్గర ఉండే చర్మం పైన ఉండే డార్క్ సర్కిల్స్ మరియు ముడతలను త్రోలగిస్తాయి.
- మీరు మేకప్ వేసుకోటానికి ముందుగా, మీ కను బొమ్మలని కప్పుతూ ఏదైనా పెట్టడం చాలా మంచిది. మేకప్'ని కనుబోమ్మలకు అతుక్కోకుండా చూడాలి. మరియు మీ కను బోమ్మలను మంచి ఆకారంలోకి మార్చుకోవచ్చు. ఆ తరువాత తేమని కలిగించే ద్రావనాలను మీ మోహానికి పూయండి.
- ఫౌండేషన్ రెండు దశలుగా పూయవచ్చు. మొదటిది కాన్సిలని డార్క్ స్పాట్స్ లేదా మచ్చల పైన పూయాలి. ఇది, మీ చర్మం కన్నా లేత రంగులో ఉండాలి. మీరు ఎంచుకునే ఫౌండేషన్ రంగు వీలైనంతగా చర్మానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.
- మీ చర్మానికి ఫౌండేషన్ పూయటానికి ముందుగా తేమని కలిగించే ఔషదాన్ని పూయాలి. మీ చర్మం గ్రహించుకునేంత వరకు లేదా కొన్ని నిమిషాల పాటూ అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత మీ చర్మం పైన ఉండే మచ్చలకు, నల్లటి వలయాలకు ఉపయోగించాలి అనుకున్న కాన్సీలాని పూయండి. ఆయిల్ మరియు చర్మం కలయికలో, ఫౌండేషన్'ని పూయటానికి ముందుగా రక్తస్రావ నివారిణి లేదా అస్ట్రీంజేంట్'ని పూయటం చాలా మంచిది, ముఖ్యంగా ఎండా కాలంలో చాలా మంచిది.
మూఖానికి మేకప్
- ఎక్కువగా చర్మానికి పౌడర్'లను పూయటం అంత మంచిది కాదు, వాటి వలన చర్మ కణాల మధ్య ఉండే లైన్స్'లో పౌడర్ ఇరుక్కుపోతుంది. మీ చర్మం మృదువుగా కనపడాలి అనుకుంటే వీటిని వాడకూడదు. చర్మం నుండి పౌడర్ మరియు దుమ్ము, ధూళిలను వేరు చేయటానికి కాటన్ లేదా పత్తిని వాడటం చాలా మంచిది.
- పాత చర్మానికి అనగా వయసు అధికం అనిపించిన వారిలో నల్లటి పెన్సిల్స్ లేదా నల్లటి హర్షాలకి బదులుగా బూడిద రంగులో ఉండే లైనర్స్ లేదా పెన్సిల్స్ చూడటానికి బాగుంటాయి. బూడిద రంగు మచ్చలకి నల్లటి ఐ లైనర్లు వాడటం వలన చూడటానికి మృదువుగా కనపడతాయి.
- మీరు కంటికి మేకప్ చేసుకునేపుడు ఏ రంగు వేస్తున్నారో గుర్తుంచుకోండి, లిప్స్టిక్ మరియు బ్లాషేస్ రంగులను కుడా గుర్తు పెట్టుకోండి. బ్రౌన్ మరియు గ్రే రంగు ఐ పెన్సిల్స్ మరియు లైనర్స్'ని వాడటానికి ప్రయత్నించండి. మీ పెదాలకి వాడే లిప్ స్టిక్స్ విషయానికి వస్తే, లేత రంగు లేదా ఎక్కువ ముదురు రంగులను వాడకండి. కోరాల్, బ్రాంజ్, బర్గండి, డార్క్ పింక్ మొదలుగునవి మీకు సరిపోతాయి.
- మీ వయసు మీరిని కొలది పెదాల ఆకృతిలో మార్పు వస్తూ ఉంటుంది. కావున, మీరు వాడే లిప్ పెన్సిల్ రంగులోనే లిప్ స్టిక్ రంగు కూడా ఉండేలా చూసుకోండి. మొదటగా, లిప్ పెన్సిల్'ని పూసి మరియు ఆకారాన్ని ఏర్పరచిన తరువాత లిప్ స్టిక్ బ్రెష్'ను ఉపయోగించి రంగులను వాడండి.
- మెరూన్, డార్క్ బ్రౌన్ వంటి డార్క్ కలర్స్'ని వాడకండి. ఎక్కువ క్యాన్సీల మరియు ఫౌండేషన్'ల వాడకాన్ని తగ్గించండి. మీ కంటి చుట్టూ వాడే లేదా కంటి క్రింద వాడే మరియు ఎక్కువ మేకప్ చేయటాన్ని తగ్గించండి.
పైన పేర్కొన్న చిట్కాలను అనుసరించి మీ చర్మం పైన ఉన్న ముడతలను త్రోలగించబడి యవ్వనంగా కనపడతారు.
Comments
Post a Comment