మీ స్కాల్ప్ పొడిగా ఉందా? ఈ వ్యాసం మీకోసమే...


  • జింక్, విటమిన్ 'C' తలపై చర్మన్ని ఆరోగ్యంగా మారుస్తాయి.
  • వేడిగా ఉండే నూనెతో తలపై చర్మానికి మసాజ్ చేయండి.
  • గోకటం వలన తలపై చర్మ పరిస్థితి మరింత విషమంగా మారుతుంది.
  • సూర్యరశ్మికి బహిర్గతం అవకుండా జాగ్రత్త పడండి.
పొడిగా మరియు దురదలకు గురిచేసే తలపై చర్మం లేదా స్కాల్ప్ వలన కలిగే ఇబ్బంది, చికాకు మరోటి ఉండదు. మన శరీరంలో పట్టించుకోకుండా ఉండే భాగం తలపై చర్మం మరియు స్కాల్ప్ లో సమస్యలు కలిగేంత వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోము. కానీ ఇక్కడ తెలిపిన కొన్ని చిట్కాల ద్వారా పొడిగా మరియు దురదలను కలిగించే తలపై చర్మం నుండి ఉపశమనం పొందవచ్చు.



కీలక పోషకాలు
జింక్, విటమిన్ 'C' వంటి పోషకాలు ఈ సమస్య నుండి త్వరగా కోలుకోటానికి సహాయపడతాయి. వైద్యుడిని లేదా ట్రైకాజిస్ట్ ను కలిసి పొడిగా ఉండే తలపై చర్మాన్ని ఆరోగ్యంగా మారటానికి ఈ పోషకాలు చాలా? లేదా ఇతర పోషకాలు కూడా అవసరమో ఒకసారి చర్చించండి. తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ 'C' ని సహజంగా సిట్రస్ జాతికి చెందిన పండ్ల నుండి పొందవచ్చు మరియు జింక్ ను పాల ఉత్పత్తులు, నట్స్ నుండి పొందవచ్చు.

శుభ్రంగా ఉంచుకోండి
పొడిగా, దురదలుగా ఉండే తలపై చర్మం సులువుగా ఇన్ఫెక్షన్ లకు గురవుతుంది, ముఖ్యంగా ఫంగస్ తో ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కావున T-౩ ఆయిల్ గల తేలికపాటి గాడత గల షాంపూతో రోజు కడగండి. ఈ ప్రత్యేకమైన నూనెలు తలపై చర్మంపై ఉండే క్రిములను తొలగించటమే కాకుండా, ఇన్ఫెక్షన్ లకు గురయ్యే అవకాశాలకు దూరంగా ఉంచుతుంది. ఇలా చేయటం వలన తలపై చర్మం శుభ్రంగా మరటమే కాదు, స్కాల్ప్ కు సూతింగ్ ఎఫెక్ట్ కు గురి చేసి దురదలు కలగకుండా చేస్తుంది.

ఆయిల్
రోజు జుట్టుకు నూనెలను రుద్దండి. వేడిగా చేసిన నూనెలు త్వరగా తలపై చర్మంలోకి గ్రహించబడతాయి. కావున తలపై గోరవెచ్చగా ఉండే ఆయిల్ ను పోసి, వలయాకారంలో నూనెలను అద్దండి. అద్దటం పూర్తైన కొన్ని గంటల తరువార నీటితో కడగండి. నూనెలు ఇంకా బాగా గ్రహించబడటానికి, కొన్ని చుక్కలను వేడి నీటిలో పోసి, పొడి టవల్ ను ఆ నీటిలో తడిపి, తలకు చుట్టుకోండి.

గోకటం
తలపై చర్మం పొడిగా ఉన్నవారు మొదటగా గోకకూడదు. కొద్దిగా తలపై చర్మాన్ని రుద్దిన లేదా గోకిన రాషేస్ కలిగి తీవ్రమైన పరిస్థితికి చేరుకుంటుంది. కావున  తలఫై చర్మం దురదగా ఉన్న గోకకండి.

ఔషదాలు
వేప నూనెతో పొడిగా, దురదలను కలిగించే తలపై చర్మాన్ని సరి చేసుకోవచ్చు. చామోమిలే, పట్చౌలి మరియు రోజ్మేరీ వంటి ఇతర ఔషదాలు కూడా ఈ సమస్య నుండి ఉపశమనం అందిస్తాయి. నిమ్మరసం కూడా మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ నిమ్మరసాన్ని నేరుగా కాకుండా, ఆయిల్ లేదా గ్లిసరిన్ తో కలిపి వాడటం మంచిది.

సూర్యకాంతికి బహిర్గతం
మీ తలను సూర్యకాంతికి బహిర్గతం అవకుండా చూసుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా, సిల్క్ లేదా పాలిస్టర్ తో చేసిన టోపీ లను ధరించకండి. ఉన్నితో చేసిన టోపీలు కూడా తలపై చర్మానికి గాలి ఆడనివ్వకుండా చేస్తాయి. సూర్యకాంతి నుండి తలపై చర్మాన్ని కాపాడుకోవటానికి కాటన్ తో చేసిన టోపీలు శ్రేయస్కరం అని చెప్పవచ్చు.  

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్