వెంట్రుకల నిర్మాణం, పెరిగే దశలు & జుట్టు రాలుటకు కారణాలు


  • ఒక వెంట్రుక జీవితకాలం సుమారు 3 నుంచి 5 ఏళ్లు ఉంటుంది.
  • తలపై చర్మం మధ్యపొర కార్టెక్స్ ఎంత దృఢంగా ఉంటే జుట్టు అంత గట్టిగా ఉంటుంది.
  • జుట్టు రాలటానికి మానసిక ఆరోగ్యం కుడా ప్రభావిత పరుస్తుంది.
  • హోమియో థెరపీ  ద్వారా కూడా జుట్టు రాలటాన్ని తగ్గించవచ్చు.

మానవుని తలపై సుమారు లక్ష నుంచి లక్షాయాభై వేల వరకు వెంట్రుకలు ఉంటాయి. జుట్టు మొదలయ్యే భాగాన్ని జుట్టు కుదురు(హెయిర్ ఫాలికిల్)అంటారు. ఒక జుట్టు కుదురు నుంచి జీవితకాలంలో సుమారు 20 నుంచి 30 వేల వరకు వెంట్రుకలు రాలిపోతాయి. ఒక వెంట్రుక జీవితకాలం సుమారు 3 నుంచి 5 ఏళ్లు ఉంటుంది.


వెంట్రుక నిర్మాణం

జుట్టు కుదురు చర్మంలోని రెండవ పొర అయిన డెర్మిస్ నుంచి మొదలవుతుంది. ప్రతి ఒక్క వెంట్రుక 3 పొరలలో ఏర్పడుతుంది. వాటిని మెడుల్లా, కార్టెక్స్, క్యూటికల్ అని అంటారు. దీనిలో మధ్యపొర అయిన కార్టెక్స్ ఎంత దృఢంగా ఉంటే జుట్టు అంత గట్టిగా ఉంటుంది. ఈ కార్టెక్స్‌లోనే మెలనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఎక్కువగా ఉంటే జుట్టు నల్లగా ఉండటం, తక్కువగా ఉంటే లేక తక్కువైపోతే తెల్లవెంట్రుకలు వస్తాయి. జుట్టు పొడవుగా పెరగడం జుట్టు కుదుళ్ల నుంచి ప్రారంభమవుతుంది.

జుట్టు పెరగడంలో దశలు
జుట్టు పెరగడంలో మూడు దశలు ఉంటాయి.
  • అనజెన్: ఇది మొదటి దశ. జుట్టు బాగా పెరిగే దశ. ఇది 2 నుంచి 6 ఏళ్లు ఉంటుంది.
  • కెటజెన్: ఈ రెండవ దశలో జుట్టు పెరగకుండా ఆగిపోవడం జరుగుతుంది. ఇది 2 నుంచి 3 వారాలు ఉంటుంది.
  • టీలోజెన్: ఇది మూడవదశ. ఈ దశలో జుట్టు ఊడటం జరుగుతుంది. ఇది 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది.
జుట్టు రాలే సమస్యలను నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి:

పురుషుల్లో జుట్టు రాలడం

కొందరు పురుషుల్లో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీనివల్ల ముఖం మీద నుదురు భాగంలో ఉండే జుట్టు సరిహద్దు క్రమంగా పలుచబడి వెనక్కు వెళుతుంది. పురుషుల్లో జుట్టు రాలడానికి వంశ పారంపర్యత, డైహె డ్రాక్సీటెస్టో స్టిరాన్ (డీహెచ్‌టీ) అనే హార్మోన్, మానసిక ఒత్తిడి, ఆందోళన, చుండ్రు, తలలో సొరియాసిస్, పొగతాగడం, టైఫాయిడ్, థైరాయిడ్ సమస్యలు, జుట్టు రంగు వేసుకోవడం వంటి కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.


స్త్రీలలో జుట్టు రాలడం

స్త్రీలలో ముఖ్యంగా తలస్నానం చేసిన తరువాత దువ్వుకొనేటప్పుడు ఎక్కువగా చిక్కుబడిపోయి జుట్టు ఊడటం జరుగుతుంది. ఇది ఎక్కువై జుట్టు పలుచబడి తల ముందు భాగం పూర్తిగా జుట్టు లేకుండా అవుతుంది. స్త్రీలలో జుట్టు రాలడానికి హార్మోన్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, పీసీఓడి, నెలసరి సమస్యలు, రక్తహీనత, ప్రసవం తరువాత వాడే కొన్ని మందులు కారణమవుతాయి. నెలసరి ఆగిపోయే సమయంలో, మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి.

పేను కొరకడం

కొందరిలో తలలో లేక మీసం, గడ్డంలో జుట్టు వృత్తాకారంలో ఊడిపోవడం జరుగుతుంది. దీనికి మానసిక ఒత్తిడి, శరీర రక్షణ వ్యవస్థ సొంత జుట్టు మీదకు దాడి చేసి కుదుళ్లను దెబ్బతీయడం జరుగుతుంది.

జుట్టు మొత్తం ఊడిపోవడం

కొంత మందిలో తలపైన ఉండే జుట్టు మొత్తం కనుబొమ్మలు, కనురెప్పలతో సహా ఊడిపోవడం జరుగుతుంది. దీనికి కచ్చితమైన కారణం తెలియదు. కానీ మానసిక ఒత్తిడి, ఆటో ఇమ్యూనిటీ కొంతవరకు కారణం కావచ్చు.

హోమియో వైద్యం

జుట్టు రాలడానికి గల కారణాన్ని ముందుగా కనుక్కునే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరిలో జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణం ఉంటుంది. ఈ కారణాలను మానసిక, శారీరక తత్వాలను పరిగణలోకి తీసుకుని చికిత్స ఇస్తే జుట్టు రాలడాన్ని పూర్తిగా అరికట్టవచ్చు. హోమియో ట్రెండ్స్‌లో ఇచ్చే హోలిస్టిక్ చికిత్సతో జుట్టు రాలే సమస్య సులభంగా దూరమవుతుంది. ఓజోన్‌థెరపీ జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే జుట్టు రాలే సమస్య ఇట్టే దూరుమవుతుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్