మహిళలలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే చిట్కాలు


  • ఆరోగ్యకమైనవి తినటం వలన ఒత్తిడి తగ్గి, వెంట్రుకలు పెరుగుతాయి.
  • ఆవాల నూనె, ఉసిరి, మెంతి విత్తనాలతో చేసిన మిశ్రమం జుట్టుకు మంచివి.
  • క్రమంగా జుట్టు కత్తిరించని ఎడల వెంట్రుకల పెరుగుదల నిలిచిపోతుంది.
  • స్టైలింగ్ ఉత్పత్తుల, కలర్ లలో ఉండే రసాయనాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

TV లలో వచ్చే ప్రకటనలలో చూపించే విధంగా పొడవైన ఆకర్షణీయమైన జుట్టును పొందుటకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలం అయ్యారా? మరేం ఫరవాలేదు. ఈ వ్యాసం మీ కోసమే...

మార్కెట్లో జుట్టుకు బహిర్గతంగా అప్లై చేసేమందులు, జెల్ లు, టానిక్ లు మరియు ఇతరేతర ఉత్పత్తులు చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటికి మన జేబు ఖాళీ అవటమే కాకుండా, నాణ్యమైన జుట్టు అనారోగ్యం భారినపడుతుంది. వీటికి బదులుగా కొన్ని సులువైన సూచనలు పాటిస్తే మహిళల జుట్టు ఆరోగ్యం చాలా మెరుగుపడి, పొవవైన జుట్టు మీ సొంతం అవుతుంది. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.


ఆరోగ్యకరమైనవి తింటూ అనుకూలంగా ఆలోచించండి
జుట్టు రాలటం తగ్గినపుడు మాత్రమే మన జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. మనలో చాలా మంది ఒత్తిడితో కూడిన జీవనశైలి అనుసరించటం వలన త్వరగా బట్టతల కలుగుతుంది. కావున రోజు ఆరోగ్యకర ఆహర సేకరణ తప్పని సరి. ప్రతి రోజు 3 సార్లు తింటూ, మధ్య మధ్యలో 5 రంగులు గల పండ్లను తప్పక తినండి.

జిడ్డుగా ఉండే జుట్టు

మార్కెట్లో లభించే చాలా రకాల ఉత్పత్తులతో జుట్టును కడిగినపుడుల్లా వెంట్రుకలు పొడిగా మారిపోతుంటాయి. కావున మీ జుట్టుపై ప్రయోగాలు ఆపి, ఇంట్లో సహజంగా తయారు చేసుకున్న ఔషదాలను వాడండి. ముఖ్యంగా, సగం కప్పు ఆవాల నూనె తీసుకొని వేడి చేయండి. వేడి అవటం ప్రారంభం అవగానే ఈ ఆవాల నూనెకు తరిమిన ఉసిరి మరియు మెంతి విత్తనాలను కలిపి, చెంచాతో బాగా కలపండి. తరువాత మిశ్రమాన్ని చల్లబరచి, వెంట్రుకల మొదళ్లకు అప్లై చేసి, పూర్తి రాత్రి అలాగే ఉంచండి. మరుసటి రోజు గాడతలు తక్కువగా గల షాంపూతో కడగండి. ఇలా ప్రతి రెండు లేదా మూడు నెలలకి ఒకసారి అనుసరించండి. ఇలా చేయటం వలన జుట్టు పెరుగుదల మాములుగా ఉన్నప్పటికన్నా రెట్టింపు అవుతుంది.

వెంట్రుకలను కత్తిరించండి

మీరు జుట్టు కత్తిరించటం మానేసారా? అయితే మీ వెంట్రుకల పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. వెంట్రుకల కొనలు తెగటానికి కారణం కూడా ఇదే అని చెప్పవచ్చు. ప్రతి రెండు సంవత్సరాలకి జుట్టు కత్తిరించటం వలన జుట్టు పెరగటమేకాకుండా, వాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను వాడకండి

మీ వెంట్రుకలకు కలర్ మరియు రీ-బాండింగ్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించండి. ఇలాంటి రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడటం వలన మీ జట్టు ఆరోగ్యాన్ని మీరే పాడుచేసిన వారవుతారు. కావున మీ జుట్టును కండిషన్ లో ఉంచుతూ, ప్రతి రోజు కడగండి. జుట్టు పొడిగా మారటం వలన పొలుసులుగా మారి, పెరుగుదల నిలిచిపోతుంది.

సురక్షిత హెయిర్ ప్యాక్ లను వాడండి

మార్కెట్లో చాలా రకాల హెయిర్ ప్యాక్ లు అందుబాటులో ఉన్నాయి. మంచి పేరు, ప్రఖ్యాతులు గల బ్రాండ్ కు చెందిన ఉత్పత్తులను మాత్రమే వాడండి. అంతేకాకుండా, వేడికి వీలైనంత దూరంగా ఉండండి. మీరు తీవ్రమైన సూర్యకాంతికి బహిర్గతం అవటం వలన వెంట్రుకలు పాడవుతాయి. ఇలాంటి సమయంలో గొడుగు, లేదా స్కార్ఫ్ ను తలపై కప్పుకొని వెళ్ళండి.


అంతేకాకుండా, రోజు పడుకునే ముందు జుట్టును ముడి వేయటం మరవకండి. మీ వెంట్రుకల నాణ్యత మరియు వాటి నిర్మాణం గురించి తెలుసుకోండి. జిడ్డు వెంట్రుకలను కలిగి ఉన్నవారు రోజు షాంపూ చేసుకోవటం వలన వారి సమస్యలు తీరదు. వీరు ప్రతి 15 రోజులకు ఒకసారి హెన్న లేదా గోరింటాకు తో చేసిన హెయిర్ ప్యాక్ ను వాడాలి. ఇలా చేయటం వలన వీరు మంచి ఫలితాలను పొందుతారు.  

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్