దానిమ్మ వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు


  • దానిమ్మ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
  • దానిమ్మ రసం వృద్దాప్య, సూర్యకాంతి వలన ఏర్పడే చ చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
  • దానిమ్మ విత్తనాలు చర్మంపై తెగుళ్ళను & మరకలను తొలగిస్తాయి.
  • దానిమ్మ పొడిచర్మ సమస్యలను, దురదలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.


దానిమ్మ, వైద్య గుణాలను కలిగి ఉన్నందు వలన, నిజానికి క్రీస్తూ పూర్వం 1552 కాలం నుండి దానిమ్మను వాడుతున్నారు. మొదటగా, ఈజిప్షియన్ పాపిరస్ దానిమ్మను వైద్యం కోసం వాడి, రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా, గ్రీకు వైద్యులు ఆర్థరైటిస్, జీర్ణాశయ సమస్యలను, రక్త ప్రసరణ సమస్యలను మరియు ఇన్ఫెక్షన్ లను తగ్గించుటకు వాడి సఫలం చెందారు. చర్మ సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందు వలన సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడుతున్నారు. 

రోజు దానిమ్మ పండును తినటం ద్వారా వీటి వలన కలిగే ప్రయోజనాలు పొందవచ్చు, అంతేకాకుండా, చర్మాన్ని సంరక్షించే గుణాలను కలిగి ఉన్నందు వలన నేరుగా చర్మానికి ఆపాదించవచ్చు. చర్మానికి, దానిమ్మ వాడటానికి గల కారణాల గురించి కింద వివరించబడింది.


మొటిమలు తగ్గించుటకు
సాధారణంగా, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత లేదా జీర్ణాశయ సమస్యల వలన మొటిమలు కలుగుతాయి. ఇలాంటి సమస్యలను దానిమ్మ తగ్గిస్తుంది. ఈ రకం పండు, మొటిమలు ఏర్పడే ప్రక్రియను మొదట్లోనే నివారిస్తుంది. దానిమ్మ, జీర్ణాశయ సమస్యలను తగ్గించి, శరీరంలో ఆరోగ్యకర రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా, దానిమ్మ విత్తనాల నుండి సేకరించిన రసాన్ని, నేరుగా మొటిమలపై అప్లై చేయటం వలన మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇలా నేరుగా ప్రభావిత ప్రాంతంలో దానిమ్మను అప్లై చేయటం వలన నూతన కణజాలం ఉత్పత్తి చెంది, మొటిమలు మరియు మచ్చలు తగ్గుతాయి.

వృద్దాప్య నివారణ

సూర్యకాంతి లేదా వృద్దాప్యం వలన చర్మంలో కలిగే మార్పులను నివారించుటలో దానిమ్మ శక్తివంతంగా పని చేస్తుంది. దానిమ్మ ఈ రకమైన ప్రమాదాలను నివారించి, మృదువైన మరియు చర్మాన్ని యవ్వనంగా కనపడేలా చేస్తుంది. అంతేకాకుండా, ఫైబ్రో బ్లాస్ట్స్ కణాల (కొలాజన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తికి భాద్యత వహించే కణాలు) జీవితకాలాన్ని పోడిగిస్తాయి. కొలాజన్ మరియు ఎలాస్టిన్ లు చర్మానికి మృదుత్వాన్ని, సాగే గుణాలను అందిస్తాయి. ఫలితంగా, చర్మం యవ్వనంగా కనపడటమేకాకుండా, వృద్దాప్యం వలన కలిగే వలయాలను తగ్గిస్తాయి.

తెగుళ్లను & మచ్చల తగ్గింపు

నయం చేసే గుణాలను కలిగి ఉండే దానిమ్మ పండు విత్తనాలు గాయాలు మరియు చర్మంపై ఏర్పడే చిన్న చిన్న తెగుళ్ళను సమర్థవంతంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా, వీటిలో ఉండే సమ్మేళనాలు ఇన్ఫెక్షన్ లతో పోరాడే శక్తిని కలిగి ఉండి, గాయాల వలన కలిగే మచ్చలను కూడా తగ్గిస్తాయి.

పొడి చర్మం

చర్మ సంరక్షణకు దానిమ్మ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవి కలిగి ఉండే సూక్ష్మ నిర్మాణం చర్మ అంతర్భాగాల వరకు చేరుతుంది. ఔషదా గుణాలను కలిగి ఉండే దానిమ్మ చర్మ రకం మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తి సమ్మేళనాలపై ఆధారపడి ఉంటుంది. చర్మ అంతర్భాగంలో చేరి నూనెలను ఉత్పత్తి చేసే దానిమ్మ పొడి చర్మం వలన కలిగే సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

దానిమ్మ పొడితత్వాన్ని, పగిలిన చర్మాన్ని మరియు కలిగే దురదలను తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఒమేగా-5 ఫాటీ ఆసిడ్ లుగా పేర్కొనే 'ప్యూరిసిన్ ఆసిడ్' లు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచటమేకాకుండా, తేమను కోల్పోకుండా చూస్తాయి.

జిడ్డు చర్మం

దానిమ్మలో ఉండే రసాలు జిడ్డు చర్మంపై కూడా పని చేసే గుణాలను కలిగి ఉన్నందు వలన జిడ్డు చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయరీలో కూడా వాడుతున్నారు. మొటిమల పగుళ్ళ ఏర్పడే మచ్చలు, మరకలు మరియు దురదల వలన చర్మంపై ఏర్పడే మచ్చలను తగ్గించుటలో దానిమ్మ శక్తివంతంగా తగ్గిస్తుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్