పొట్ట చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే కొవ్వును తగ్గించుకోవటం ఎలా?


  • కొవ్వును తగ్గించుకోవటానికి పత్యాలను అనుసరించటం ఆరోగ్యకరం కాదు.
  • వ్యాయామాలు, భోజనం మరియు తక్కిన సమయం పాటూ నిద్ర తప్పనిసరి.
  • సిగరెట్ అలవాటు వలన శరీరంలో చెడు కొవ్వు పదార్థాల నిల్వ అధికం అవవచ్చు.
  • రోజు యోగను అనుసారించండి మరియు జుంబ క్లాసులో హాజరవ్వండి.
శరీర బరువును తగ్గించుకోవటం కష్టమనే చెప్పాలి. ముఖ్యంగా, మీరు ఆహారాన్ని తీసుకోకుండా బరువును తగ్గించుకోవటం కష్టం మరియు ఆరోగ్యానికి కూడా హానికరం. మీ నడుము చుట్టూ మరియు పొట్ట మీద ఉన్నకొవ్వును తగ్గించుకోవటానికి చాలా మంచి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆహార సేకరణను తగ్గించటం వలన తాత్కాలికంగా మేలు కలుగవచ్చు. అయితే సరైన సమయం పాటూ నిద్ర లేకపోవటం, ఆయాసం మరియు ఒత్తిడి లాంటి ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతినకుండా మీ శరీరంలోని, అదనపు కొవ్వును తగ్గించుకొనే మార్గాలను పరిశీలిద్దాం.




ఆరోగ్యం గురించి ఆలోచించండి

మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనగా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. నూనెలో వేయించిన ఆహారాలను మరియు ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. తాజాగా పండ్లను మరియు కూరగాయలను తినటం అలవాటు చేసుకోవాలి. పొగ త్రాగటం, మత్తు పానీయాలను సేవించటం వంటి అనారోగ్య అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎల్లప్పుడు ఏదో ఒక పని చేస్తుండటం అనగా శరీరాన్ని ఎల్లపుడు ఇతర పనులకు కదల్చటం వంటివి చేయాలి. ఎక్కువగా నడవటం, మెట్లు ఎక్కడం లాంటి పనులు నిర్వహించాలి.

యోగ

యోగ ద్వారా శరీరంలోని కొవ్వు పదార్థాలను శక్తివంతంగా తగ్గించుకోవచ్చు. రోజు యోగను అనుసరించటం వలన ఆరోగ్యం మెరుగుపడటం, శ్వాసలో సమస్యలు తగ్గటమే కాకుండా, శరీర బరువు కూడా తగ్గుతుంది. యోగాభ్యాసంలో శ్వాస వ వ్యాయామాలను చేయటం వలన ఊపిరితిత్తులకు కావలసినంత ఆక్సిజన్ అందించబడుతుంది. ఊపిరితిత్తులకు మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కావలసిన స్థాయిలో అందించబడుతుంది. ఇలా ఆక్సిజన్ శరీరంలోని ఇతర భాగాలకు లభించడం వలన శరీరంలోని కొవ్వును కరిగించడానికి, అవసరమయ్యే సమయం కంటే తక్కువ సమయం మరియు వేగంగా జరుగుతుంది. శ్వాసను పీల్చుకోవటం వలన శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని శక్తిని పెంచి, శారీరకంగా ఉత్సాహంగా ఉండటానికి వీలవుతుంది.

ఆసనం అనుసరణ

పద్మాసనం మరియు ఇతర ఆసనాలను యోగలోని ముఖ్యాసనాలు. వీటిని అభ్యాసం చేయటం ద్వారా శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి సునాయాసంగా పొందవచ్చు. ప్రాణాయామ చేయటానికి బాగా తీరికగా కూర్చోవాలి. ఈ ఆసనాన్ని అనుసరించటానికి ముందుగా నిటారుగా కూర్చోవాలి. చదునుగా ఉండే నేల మీద లేదా చాప మీద కూర్చోని, పద్మాసనంలో చేసిన విధంగా కాళ్ళను మడవాలి. మీ వెన్ను నిటారుగా ఉండేటట్లు చూడాలి. మీ బొటన వేళ్ళతో చెవులను మూసుకోవాలి. మధ్య వేళ్ళతో మీ కళ్ళ మీద మెల్లగా ఒత్తాలి. చూపుడు వేళ్ళతో కణతల మీద ఒత్తాలి మీ ఉంగరం వెళ్ళాను ముక్కుమీదుంచాలి. శ్వాసను బాగా పీల్చుకొని ముక్కు ద్వారా నెమ్మదిగా వదలాలి. ఇలా దాదాపు పది నిమిషాల పాటు చెయ్యండి.

జుంబ

మీకు డాన్సు చేయటం ఇష్టమైతే జుంబ మీకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. జుంబ, శారీరక ధృడత్వం కోసం 1950 మధ్యకాలంలో ఆరంభించిన ఒక డాన్సు ప్రోగ్రాం. ల్యాటిన్ మరియు అమెరికా నృత్యాల ఆధారంగా తయారు చేయవడిన జుంబ ప్రోగ్రాం, 60నుండి 90 నిమిషాల పాటు ఉంటుంది. ఇందులో పలు విధాల నృత్యాలుంటాయి. ఈ ప్రోగ్రాం శారీరక ద్రుడత్వాన్ని పెంచడానికి ఉపయోగ పడుతుండటం వలన చాలా మంది జుంబ ప్రోగ్రామును ఇష్టపడతారు. శరీర బరువును తగ్గించుకోవటానికి చాలా మంది జుంబ ప్రోగ్రాములో చేరటం జరుగుతున్నది. ప్రస్తుతం జుంబ నృత్యం శైలి మరియు విధానం ఆయా దేశాలు మరియు సంస్థలను బట్టి ఉంటుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్