పుదీనా వలన అందానికి కలిగే ప్రయోజనాలు
వంటలలో మంచి రుచిని ఇచ్చే పుదీనా వలన అందం కూడా పెరుగుతుంది. ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ ఇది చదవండి.
1 పుదీనా
ఘాటైన సువాసన కలిగి ఉండే పుదీనా మాయిశ్చరైజర్, క్లీనర్ మరియు లోషన్ రూపంలో కూడా దొరుకుంతుంది. ముఖ్యంగా పుదీనా మరియు దాని సారాన్ని అందాన్ని మెరుగుపరిచే వివిధ రకాల ఉత్పత్తులలో వాడుతున్నారు. మన అందాన్ని మెరుగుపరచటంలో పుదీనా పాత్ర గురించి ఇక్కడ తెలుపబడింది.

2 మెరిసే చర్మం
పుదీనా నూనెను వాడటం వలన మెరుగైన చర్మం పొందవచ్చు. చర్మంపై ఉన్న నిర్జీవ కణాలను తొలగించి, చర్మం ప్రకాశవంతంగా కనపడేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని పొందాలి అనుకుంటున్నారా? అయితే కొన్ని చుక్కల పుదీనా నూనెను నేరుగా చర్మానికి వాడి తరువాత మార్పులను గమనించండి.
3 జుట్టు పెరుగుదల
పుదీనా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. మీ జుట్టు కోసం రోజు వాడే నూనెకు కొన్ని చుక్కల పుదీనా నూనె కూడా వాడి వెంట్రుకలకు అప్లై చేయటం వలన రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు పెరుగుదల కూడా బాగుటుంది.
4 పొడి జుట్టు
మీ జుట్టు పొడిగా ఉంటుందా? అయితే పుదీనా నూనె మీకు తప్పక సహాయపడుతుంది. దీని కోసం గానూ, రోజు వాడే కొబ్బరి నూనెకు కొన్ని చుక్కల పుదీనా నూనెను కలిపి జుట్టుకి అప్లై చేయండి. ఇలా చేయటం వలన వెంట్రుకలకు కావాల్సిన తేమ అందించబడి, జుట్టు యొక్క పొడితత్త్వం తొలగిపోతుంది.
5 ఆయిలి స్కిన్
జిడ్డు చర్మాన్ని కలిగి ఉన్నారా? అయితే ఆపిల్ సైడర్ కు కొద్దిగా పుదీనా నూనెను కలిపి చర్మాన్ని అప్లై చేయండి. ఈ మిశ్రమం చర్మం యొక్క pH స్థాయిలను పెంచి, చర్మంలో ఉత్పత్తి చెందే అధిక నూనెలను తగ్గిస్తుంది.
Comments
Post a Comment