ముఖంలో అవాంఛిత రోమాలు తొలగించడానికి 9 ఆయుర్వేదిక్ రెమెడీస్..!

ముఖంలో ఉన్న మొటిమలను ఒకటి రెండు రోజుల్లో డ్రై అవుట్ చేయవచ్చు. ట్యానింగ్ ను క్లెన్సింగ్ మాస్క్ తో లైట్ చేయ్చొచ్చు. నొప్పితో బాధించే మొటిమలను ఒక మంచి హోం రెమెడీతో నివారించుకోవచ్చు. మరి ఫెషియల్ హెయిర్ ?కాస్మోటిక్ ఫేషియల్ హెయిన్ ను కనబడనివ్వకుండా లైట్ గా మార్చుతాయి. పూర్తిగా తొలగించవు. అందుకే ఫేషియల్ హెయిర్ ను తొలగించుకోవడానికి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉన్నాయి.

ఫేషియల్ హెయిర్ కు కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఆండ్రోజెన్స్ అనే మేల్ హార్మోన్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ముఖంలో లైట్ గా హెయిర్ వస్తుంది. ఇంకా మెడిసిన్స్, ఓబేసిటి, మరియు హార్మోనుల లోపం ఇవన్నీ ఫేషియల్ హెయిర్ గ్రోత్ కు కారణమవుతాయి. ఇటువంటి ఫేషియల్ హెయిర్ ను తొలగించుకోవడానికి కెమికల్ ప్రొడక్ట్స్ లే ఆయుర్వేదిక్ రెమెడీస్ ను ఫాలో అవ్వడం. అయితే కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఆయుర్వేదిక్ రెమెడీస్ లో ఎలాంటి టాక్సిక్ కెమికల్స్ ఉండవు . జీరో సైజ్ సైడ్ ఎఫెక్ట్స్, చౌకైనవి.

ఫేషియల్ హెయిర్ ను నేచురల్ గా తొలగించుకోవడానికి 10 ఆయుర్వేదిక్ రెమెడీస్ ..


1. స్పేర్మింట్ టీ: 

బాడీలో మేల్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల మహిళ ముఖంలో హెయిర్ పెరుగుతుంది. స్పేర్మింట్ టీ ఫేషియల్ హెయిర్ కు కారణమయ్యే టాక్సిన్స్ తొలగించడంతో పాటు, హార్మోన్స్ ను క్రమబద్దం చేస్తుంది.
 ఎలా చేయాలి:  స్పేర్మింట్ టీ బ్యాగ్స్ తో, టీ తయారుచేసుకోవాలి. నీళ్లలో టీబ్యాగ్స్ వేసి కొద్దిసేపు బాగా ఉడికించాలి. దీన్ని వడగట్టి రోజుకు రెండు సార్లు తాగాలి. అలాగే టీకోసం ముందుగా ఉపయోగించిన వాటని కూడా ఫేషియల్ హెయిర్ రిమూవర్ గా ఉపయోగించుకోవచ్చు.


2. ఇండియన్ నాటిల్ -పుసుపు: 
ఇండియన్ నాటిల్ ఫేషియల్ హెయిర్ ను చర్మం లోపలి నుండి తొలగిస్తుంది, పసుపులో యాంటీబ్యాక్టిరియల్, యాంటీఫంగల్ లక్షణాలు చర్మరంద్రాలను తెరచుకునేలా చేసి, చర్మం లోపలి నుండి అన్ వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ను నేచురల్ గా తొలగిస్తుంది.

పదార్థాలు:
ఇండియన్ నాటిల్ 1టేబుల్ స్పూన్
పసుపు: 1 టీస్పూన్
తయారుచేయు విధానం:

ఇడియన్ నాటిల్ ను మెత్తగా పౌడర్ చేసి, అందులో పసుపు వేసి, కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి స్మూత్ గా పేస్ట్ తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఫేషియల్ హెయిర్ ఉన్న చోట అప్లై చేయాలి . ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను ప్రతి రోజూ 4వారాలు పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.




3. ఓట్ మీల్ స్ర్కబ్:
మరో ఆయుర్వేదిక్ రెమెడీ ఓట్ మీల్ స్ర్కబ్ . ఓట్ మీల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు సపోనిన్ఎక్కువగా ఉంటాయి. ఇది క్లెన్సర్ గా పనిచేస్తుంది. చర్మంలోని మలినాలను తొలగిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అవాంఛిత రోమాలు తొలగిస్తుంది.

కావల్సినవి:
1/2 టీస్పూప్ ఓట్ మీల్ 
1/2 టీస్పూన్ నిమ్మరసం 
1 టీస్పూన్ తేనె
అన్ని పదార్థాలను ఒక బౌల్ తీసుకుని, మిక్స్ చేయాలి. ముఖంలో అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. 5 నిముషాలు డ్రైగా మారిన తర్వాత నీటితో తడి చేసి సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.




4. ఆరెంజ్ పీల్ :
ఆరెంజ్ తొక్కలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫేషియల్ హెయిర్ ను లైట్ గా మార్చుతుంది. తిరిగి పెరగకుండా నివారిస్తుంది.

కావల్సినవి:
ఆరెంజ్ పీల్ పౌడర్ : 1టీస్పూన్ 
లెమన్ పీల్ పౌడర్ : 1టీస్పూన్ 
ఓల్ మీల్ పౌడర్ : 1టీస్పూన్
రోజ్ వాటర్ : 1టీస్పూన్

ఎలా తయారుచేయాలి:

నిమ్మ , ఆరెంజ్ పౌడర్ ను మిక్స్ చేయాలి. తర్వాత ఓట్ మీల్ పౌడర్, రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. రోజ్ వాటర్ ను కొద్దికొద్దిగా జోడిస్తూ సాప్ట్ గా పేస్ట్ తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి.


5. షుగర్ లెమన్ మిక్స్:
పంచదార రఫ్ గా ఉండటం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మరంద్రాలు తెరచుకునేలా చేసి ముఖంలో హెయిర్ ఫోలి సెల్స్ ను వదులు చేస్తాయి. నిమ్మరసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఫేషియల్ హెయిర్ నుతొలగించుకోవడానికి ఇది ఒక బెస్ట్ నేచురల్ పద్దతి.

కావల్సినవి: 
షుగర్ : 2టీస్పూన్స్ 
లెమన్ జ్యూస్: 2 1టీస్పూన్స్ 
ఆలివ్ ఆయిల్ కొద్దిగా

ఉపయోగించే పద్దతి:
పైన సూచించిన పదార్థాలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ముఖంలో హెయిర్ ఉన్న ప్రదేశంలో ఈపేస్ట్ ను అప్లై చేయాలి. 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ రెమెడీని రెగ్యులర్ గా వేసుకుంటుంటే త్వరగా ఫలితం ఉంటుంది.

6. ధాన్యాలు-బంగాళదుంప:
బంగాలదుంప నేచులర్ బ్లీచింగ్ ఏజెంట్, ధాన్యాలు పొడిచేసినప్పుడు రఫ్ గా ఉంటాయి కనుక చర్మం మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అవాంఛిత రోమానలు తొలగిస్తాయి.

కావల్సినవి: 
ఉడికించిన బంగాలదుంప: 1 
చిరుధాన్యాలు : 1 కప్పు 
లెమన్ జ్యూస్: 2టీస్పూన్స్ 
తేనె: 1టీస్పూన్

తయారుచేయు పద్దతి:
ధాన్యాలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నీరు వంపేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత బంగాళదుంపను మెత్తగా చేసి, లెంటిల్ పేస్ట్ లో మిక్స్ చేయాలి. తర్వాత నిమ్మరసం , తేనె మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ ప్యాక్ ను ముఖం మరియు మెడవద్ద అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



7. గుడ్డు: 
గుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువ. ఇది చర్మంను కాంతివంతంగా మార్చుతుంది. త్వరగా చర్మానికి మెత్తుకుంటుంది. డ్రై అయిన తర్వాత దీన్ని మాస్క్ ను లాగేయవచ్చు . ఇది అవాంఛిత రోమాలను తొలగిస్తుంది.

కావల్సినవి: 
ఎగ్ వైట్ : 1 
పంచదార: 1టీస్పూన్ 
తేనె: 1టీస్పూన్ 
కా
ర్న్ ఫ్లోర్ : 1టీస్పూన్



తయారుచేయు విధానం: 
పైన సూచించిన పదార్థాలన్నింటిని మిక్సింగ్ బౌల్లో వేసి, మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.



8. పసుపు: పసుపులు యాంటీబ్యాక్టిరిలయ్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఫేషియల్ హెయిర్ ను తొలగిస్తుంది. చర్మ రంద్రాలు మూసుకుపోయేలా చేస్తుంది.

కావల్సినవి: 
పసుపు: 1టీస్పూన్ రో
జ్ వాటర్: 1టీస్పూన్ 
పచ్చిపాలు: 1టీస్పూన్

తయారుచేయు విధానం: పైన సూచించిన పదార్థాలన్నీ ఒక బౌల్లో తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయాలి. ఈ ప్యాక్ పూర్తిగా డ్రైగా మారిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.



9. ఆప్రికాట్ మరియు తేనె: 
ఆప్రికాట్ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ అవాంఛిత హెయిర్ గ్రోత్ ను నివారిస్తుంది. తేనెలో ఉండే విటమిన్స్ ఫేషియల్ హెయిర్ ను తేలికపరస్తుంది. చర్మానికి పోషణను అందిస్తుంది.

కావల్సినవి: 
ఆప్రికాట్: 1టీస్పూన్ 
తేనె: 1టేబుల్ స్పూన్ 
రోజ్ వాటర్: 1టీస్పూన్

తయారుచేయు పద్ధతి: 
ఆప్రికాట్ ను మెత్తగా పేస్ట్ చేసి, అందులో లో రోజ్ వాటర్, తేనె, మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను అవాంఛిత హెయిర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత స్క్రబ్ చేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్