చర్మం మృదుత్వానికి అలోవెర జెల్ ..!

ప్రకృతిలో లభించే మూలికలతో, చెట్లతో ఎన్నో వ్యాధులను దూరం చేసుకునే అవకాశం మానవునికి లభించింది. ఇందులో కలబంద ఒకటి. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. విటమిన్స్‌, ఎంజైమ్స్‌, మినరల్స్‌ల మిశ్రమం కలబంద. రోజూ కలబందను తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధకశక్తి బలపడుతుంది. తద్వారా వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అలొవెరాను జెల్‌, జ్యూస్‌, పిల్స్‌ టాబ్లెట్స్‌ రూపంలో తీసుకోవచ్చు. ఇంకా కలబందతో ఏమేమి ప్రయోజనాలో తెలుసుకుందాం.

చూడటానికి ముళ్ళ మొక్కలా ఉంటుంది. అలోవెరా జెల్ ఉపయోగాలు అన్ని ఇన్ని కావు . చర్మ సంరక్షణ విషయంలో ఇది అద్భుతంగా పని చేస్తుందంటారు సౌదర్యనిపుణులు. చర్మ సంరక్షణ, ర్యాషెస్, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవటం మొదలగువాటికి అలోవెరా మంచి మెడిసినన్ అని అందరికి తెలిసిందే. అలోవెరా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. పోడిచర్మంతో బాధపడేవారు తరుచుగా అలోవెరా ఆయిల్ రాస్తుంటే చర్మం మృదువుగా మెత్తగా అవుతుంది.

వాతావరణ కాలుష్యం కారణంగా మన చర్మం అనేక రకాల విషపదార్ధాల ప్రభావానికి గురవుతుంది. అలోవెరా జెల్ వాటి బారి నుంచి చర్మాన్ని పరిరక్షించి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు అయితే అలోవెరా జ్యూస్ తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మరింత అధికం. ఎంతో సురక్షితం. ఈజ్యూస్ లో వివిధ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, ఎమినో యాసిడ్స్ వంటి పోషకాలెన్నో వుంటాయి. ఇది జెల్ , ఆయింట్మెంట్ , లోషన్ ల రూపం లో అటు సౌందర్య సాధనం గా ఇటు ఔషధం గా దీని వాడుక విపరీతం గా పెరిగింది. అలోవెర చర్మ సౌందర్యానికి అందించే బెనిఫిట్స్ఏంటో తెలుసుకుందాం...


Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్