ఫేషియల్ హెయిర్ ను పర్మనెంట్ గా రిమూవ్ చేసే బొప్పాయి ఫేస్ ప్యాక్

సాధారణంగా అందం విషయంలో అమ్మాయిలు ఏమాత్రం రాజీ పడరు. నిరంతరం అందంగా కనబడటానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి వారిలో అవాంఛిత రోమాలు కనబడితే ఇంకెముందీ...డిప్రెషన్ లోకి వెళ్లిపోవడమే... నలుగురిలోకి పోలేక, ఇబ్బంది పడుతుంటారు. అమ్మాయిలు ఎల్లప్పుడూ వారి ముఖాన్ని సాఫ్ట్ గా , స్మూత్ గా మరియు ఎలాంటి మచ్చలు, మొటిమలు, పేషియల్ హెయిర్ లేకుండా ఉండే ముఖాన్ని కోరుకుంటారు . అయితే మెడ, గడ్డం, బుగ్గల మీద, ఫోర్ హెడ్ మరియు పైపెదవులు మరియు, శరీరంలో ఇతర ప్రదేశాలు హెయిర్ ఉండాటాన్ని అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా చిరాకు తెప్పించడం మాత్రమే కాదు వీటి వల్ల చాలా ఇబ్బంది కరంగా ఫీలవుతారు.

శరీరంలోని కానీ, ముఖంలో కానీ ఎక్సెస్ హెయిర్ గ్రోత్ హార్మోనుల మార్పుల వల్ల , ఇర్రెగ్యులర్ మెనుష్ట్ర్యువల్ సైకిల్, మెడికేషన్స్ , గర్భధారణలో శరీరంలో మార్పులు వల్ల ఎక్సెస్ హెయిర్ కు కారణం అవుతుంటుంది. కారణం ఏదైనా, ఇబ్బంది కలిగించే ఫేషియల్ హెయిర్ ను నివారించుకోవడమే మంచి మార్గం.



అందుకు కొన్ని సూపర్ ఫేషియల్ పద్దతులున్నాయి . ఫేషియల్ హెయిర్ తొలగించుకోవడంలో షేవింగ్, వాక్సింగ్, ఇంకా లేజర్ ట్రీట్మెంట్స్ మొదలగునవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి . కానీ ఈ పద్దతులకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు, నొప్పి కలిగిస్తాయి . అంతే కాదు, వీటి వల్ల ముఖంలో స్కార్స్ మరియు బర్న్ మార్క్స్ గుర్తులుగా నిలుస్తాయి.

ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఫేస్ మాస్క్ ఒకటి ఉంది. ఈ ఫేస్ మాస్క్ రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే ఫేషియల్ హెయిర్ పెరగకుండా నివారించుకోవచ్చు. మరి ఆ ఎఫెక్టివ్ ఫేస్ మాస్ ఏంటో ఒకసారి తెలుసుకుని..అందాన్ని కాపాడుకుందాం....


కావల్సినవి: 
బొప్పాయి 
పసుపు : చిటికెడు

తయారుచేయు విధానం: ముందుగా బొప్పాయిని చిన్న ముక్కలుగా కట్ చేసి మాష్ చేయాలి. బొప్పాయిని మ్యాష్ చేయడానికి ఇబ్బంది పడితే బ్లెండర్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ ను తయారుచేసుకోవాలి.

ఇప్పుడు అందులో పసుపు ఒక స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి ముఖంలో హెయిర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల అవాంచిత రోమాలను తగ్గిస్తుంది.

ముఖానికి అప్లై చేసిన తర్వాత నిధానంగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన, 15 నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి. ఈ చిట్కాను ప్రతిరోజూ అనుసరిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే ఫేషియల్ హెయిర్ పర్మనెంట్ గా తొలగిపోతాయి.




ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల వెంటనే ఫలితం చూపకపోయినా, నిధానంగా శాస్వతమైన మార్పును తీసుకొస్తుంది. రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అవాంఛిత రోమాలను నివారించడంలో పర్మనెంట్ గా సొల్యూషన్ చూపెడుతుంది.

ఎందుకంటే బొప్పాయిలో పెప్పైన్ అనే ఎంజైమ్ హెయిర్ ఫాలీ సెల్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల ముఖంలో హెయిర్ చాలా తక్కువగా కనబడుతాయి.

మరో ముఖ్యమైన విషయమేమింటే ఈఫేస్ ప్యాక్ మిశ్రమాన్ని ఒకే సారి తయారు చేసుకుని ఫ్రిజ్ లో ఒక వారం పాటు నిల్వ చేసుకోవచ్చు . ఈ బిజీ షెడ్యుల్లో దీనికోసమని ప్రత్యేకించి సమయాన్ని వెచ్చిచ్చాల్సిన పనిలేదు .

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్