చర్మం ఒకటే దురద పెడుతోందా..?ఇవిగో ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!!
బాడీ రాషెస్ ఎర్రగా కనబడుతాయి. అంతే కాదు చర్మంగా ఎర్రగా, దురదతో, చర్మం మీద పొక్కు ఊడినట్లు కనబడుతుంది. ఈ పరిస్థితిలో చర్మం చూడటానికి చాలా అగ్లీగా కనబడుతుంది. ఈ సమస్యను వెంటనే తగ్గించుకోకపేతే చాలా అసౌకర్యంగా ఉంటుంది. అంతే కాదు అందవిహీనంగా కూడా ఉంటుంది. బాడీ రాషెస్ వల్ల చర్మం మీద ఎక్కువ దురద కలిగినపప్పుడు, ఇన్ఫ్లమేషన్, నొప్పికి దారితీస్తుంది. కొన్ని సందర్బాల్లో బాడీరాషెస్ ను ఎక్కువగా రుద్దడం లేదా గోక్కోవడం వల్ల రక్తస్రావమయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ పరిస్థితిని నివారించుకోవడానికి, ఇంట్లో నేచురల్ అందుబాటులో ఉండే కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.
బాడీ రాషెస్ చూడటానికి నార్మల్ చర్మ కంటే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. చర్మం మీద రాషెస్ ఉన్న ప్రదేశంలో చర్మం ఎర్రగా కమిలిపోయి, చిన్న వాపులాగా కనబడుతుంది. స్కిన్ రాషెస్ కు వివిధ రకాల కారణాలున్నాయి. అలర్జీలు, స్కిన్ ఇన్ఫెక్షన్స్, వాతావరణంలో మార్పులు చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. శీతాకాలం వచ్చిందంటే చాలు.. చర్మం పొడిబారిపోయి తీవ్రంగా దురదలు వేధిస్తాయి. ఎన్ని క్రీములు వాడినా దురదలు తగ్గిపోవు. కొన్ని సందర్భాల్లో సోపులు, సూర్యరశ్మి, క్రీములు, పర్ఫ్యూమ్స్ చర్మంపై దురదలకు కారణమౌతాయి.
కారణమేదైనా చర్మంపై వచ్చే దురదలు.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. వాటిని రబ్ చేయడం వల్ల మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లో ఉండే ఔషధాలతో.. ఈజీగా ఉపశమనం పొందవచ్చు. చర్మంపై దురదలు పోగొట్టుకోవడానికి సహజ మార్గాలేంటో చూద్దాం.
కలబంద:

కలబందలో అమేజింగ్ ఔషధ గుణాలున్నాయి. ఇది యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటం వల్ల ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంతోపాటు, చర్మానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది. ఇది చర్మం మీద దురద తగ్గిస్తుంది . బాడీ రాషెస్ ను నివారించడంలో గ్రేట్ రెమెడీ.
ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ ను హెయిర్ మరియు స్కిన్ మాయిశ్చరైజర్ గా ఉపయోగిస్తుంటారు, ఈ ఆయిల్ ను మసాజ్ చేయడం వల్ల స్కిన్ రాషెస్ ను నివారించుకోవచ్చు. ఇది చర్మంలోపలకి చొచ్చుకుని పోయి, మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ స్కిన్ రాషెస్ ను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది
ఆపిల్ సైడర్ వెనిగర్:
చర్మంపై దురదలు పోగొట్టడానికి ఇది చక్కటి పరిష్కారం. ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలని కలిగి ఉంటుంది. కాబట్టి కాటన్ తీసుకుని ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి.. దురదగా ఉన్న ప్రాంతంలో రాయాలి.
విటమిన్ ఇ ఆయిల్:
విటమిన్ ఇ ఆయిల్ , అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మదద్దుర్లు, దురదను నివారిస్తుంది. అందుకే దీన్ని బాడీరాషెస్ నివారించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు . డ్రైస్కిన్ ఉన్నవారు విటమిన్ ఇ క్యాప్స్యూల్స్ తినడం మంచిది.
కోకబట్టర్:
కోకబట్టర్ నేచురల్ ఫ్యాట్ ఫుడ్. దీన్ని కోకబీన్స్ నుండి తయారుచేస్తారు. ఇది చర్మానికి పూర్తి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది స్ట్రాంగెస్ట్ మాశ్చరైజర్. దీన్ని అప్లై చేయడం వల్ల రాషెస్ పూర్తిగా నయం అవుతాయి
ఓట్స్:
చర్మంపై దురదలతో పోరాడటానికి ఓట్మీల్ సహకరిస్తుంది. రెండు స్పూన్ల నీటికి, కాస్త ఓట్ మీల్ కలిపి కాసే పక్కనపెట్టాలి. కొన్ని నిమిషాల తర్వాత.. దురదగ ఉన్న ప్రాంతాల్లో ఈ పేస్ట్ ని రాసి.. గంట తర్వాత కడిగేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
తులసి:
ప్రతి ఇంట్లో ఉండే ఔషధం తులసి చెట్టు. ఈ ఆకులు ఎలాంటి చర్మ సమస్యలకైనా మంచి పరిష్కారం. తులసి ఆకుల్లో థైమాల్, క్యాంఫర్, యూజెనోల్ వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లను తొలగించడానికి ఉపయోగపడతాయి. నీళ్లలో తులసి ఆకులు వేసి.. బాగా వేడి చేయాలి. చల్లారిన తర్వాత దురద ప్రభావిత ప్రాంతాల్లో ఆకులు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
ఐస్:
బాడీ రాషెస్ ను నివారించడానికి మరో సింపుల్ హోం రెమెడీ. కోల్డ్ కంప్రెసర్ ను ఉపయోగించడం వల్ల బాడీ రాషెస్ మాయమవుతాయి. కోల్డ్ కంప్రెసర్ లోని వాటర్ చల్లదనం వల్ల చర్మం మీద దురద, రెడ్ నెస్ తగ్గుతుంది.
నిమ్మరసం :
చర్మంపై వేధించే దురదలకు చక్కటి పరిష్కారం నిమ్మకాయ. ఇందులో విటమిన్ సీ తోపాటు బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంపై దురదలను వెంటనే తగ్గిస్తాయి. కాబట్టి దురగా అనిపించిన వెంటనే కాస్త నిమ్మరసం తీసుకుని.. రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
Comments
Post a Comment