శెనగపిండితో సింపుల్ బ్యూటీ ఫేస్ ప్యాక్స్ తో స్కిన్ లోమిరాకిల్స్ చేంజెస్

సున్ని పిండి, పెసరపిండి, శెనగపిండి ఇవి మన ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటి సౌందర్య సాధానాలు. వీటిని, వేల సంవత్సరాల నుండి సౌందర్య ఉత్పత్తిగా ఉపయోగిస్తున్నార. సున్నిపిండి శరీరానికి మర్ద చేసిన స్నానం చేసేవారు. అలాగే శెనగపిండి కూడా చాలా విరవిగా ఉపయోగిస్తారు. శెనగిపిండితో ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటారు. ఈ సాంప్రదాయకరమైన శెనగపిండిని ఒక్క చర్మ సంరక్షణలోనే కాదు, కేశ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. కేశాలకు శెనగిపిండి ఉపయోగించడం వల్ల చుండ్రు వదలడంతో పాటు, ఇతర జుట్టు సమస్యలు కూడా వదులుతాయి. ఇక చర్మ సంరక్షణలో శెనగిపిండి ఒకగొప్ప ఔషదం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది మొటిమలు, దానికి తాలుకూ మచ్చలు, చారలు, నల్ల మచ్చలు, స్కిన్ ప్యాచ్ వంటి వాటిన్నింటిని చాలా సులభంగా తొలగిస్తుంది.

శెనగ పిండి చర్మ సంరక్షణకు ఏవిధంగా పనిచేస్తుందో అందరికీ తెలసిన విషయమే. అందుకే ఎక్కువగా ఫేస్ మాస్క్ లుగా శెనగపిండి వేసుకొంటుంటారు. ఇది ఇప్పటి ఆచారమో... పద్దతో కాదు. పూర్వ కాలం నుండి వస్తున్న పద్దతే మన పూర్వ కాలంలో కూడా శెనగపిండి, సున్నిపిండిని నలుగు పెట్టుకొని తర్వాత స్నానం చేసేవారు. శెనగపిండిలో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది గ్రేట్ మాయిశ్చరైజర్ గా మరియు ఎక్స్ ఫ్లోయేటర్ మరియు మొటిమలను తొలగించడంలో మరియు జిడ్డు చర్మాన్ని పోగొట్టడంలో, ఫేషియల్ హెయిర్ గ్రోత్ గా, నల్లగా మారిన భుజాలు మరియు మెడ. మరియు పొడి బారిన, నిర్జీవమైన కేశాలకు అన్నింటికి శెనగపిండి మంచి ప్రయోజనం చేకూర్చుతుంది.

ఖరీదైన రసాయనిక ఉత్పత్తులను పక్కన పెట్టి, శెనగపిండి ఉపయోగించి, అనేక బ్యూటీ ప్రయోజనాలను పొందడానికి ఇది ఒక చక్కటి అవకాశం. పెసరపిండి కానీ, లేదా శెనగపిండి కానీ, లేదా సున్నిపిండికానీ ఏదైనా సరే ఉపయోగించినప్పుడు మంచి ఫలితాలను పొందవచ్చు. పెసర పిండి, చర్మ సంరక్షణకు ఒక బెస్ట్ ప్రొడక్ట్ గా ఉపయోగించవచ్చు. శెనగిపిండిని బాడీ స్ర్కబ్ గా సాధారణంగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో మన భారతీయ మహిళలు ఎక్కువగా హెర్బల్ రెమడీస్ ను ఉపయోగించడానికి శ్రద్ద చూపిస్తున్నారు. వీటితో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక వీటి మీద ఎక్కువ మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. మరో ప్రయోజనం ఈ నేచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువగా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. మరియు దీర్ఘకాలం కొనాల్సిన పనిలేదు. ఇవి సహజంగానే ఎల్లప్పుడు మన వంటగదిలో నిత్యవసర వస్తువులుగా ఉంటాయి. కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి శెనగపిండిలో అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..



Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్