నల్లగా, అసహ్యంగా మారిన మోచేతులు, మోకాళ్లకు ఉల్లి, వెల్లుల్లి ప్యాక్..!
నల్లగా, అసహ్యంగా కనిపించే.. మోచేతులు, మోకాళ్లు.. చాలా ఇబ్బంది పెడతాయి. కొన్ని డ్రస్సుల్లో అవి చాలా ఎక్కువ ఎక్స్ పోజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు అవి శరీరం రంగు కంటే.. నల్లగా కనిపిస్తే.. మీ అందానికే మచ్చ వచ్చేస్తుంది. మీరు సరిగా శ్రద్ధ తీసుకోవడం లేదని చూపిస్తుంది. కాబట్టి నల్లగా మారిన మోకాళ్లు, మోచేతులపై శ్రద్ద తీసుకోవాలి.
ఫేషియల్ స్కిన్, ఇతర శరీర భాగాల కోసం.. చాలా కేర్ తీసుకుంటారు. ముఖం చాలా ఎట్రాక్టివ్ గా ఉండటం కోసం.. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కేవలం రెండు నిమిషాలు చాలు.. మోచేతులు, మోకాళ్లు బ్యూటిఫుల్ గా కనిపించడానికి..
ఫేషియల్ స్కిన్, ఇతర శరీర భాగాల కోసం.. చాలా కేర్ తీసుకుంటారు. ముఖం చాలా ఎట్రాక్టివ్ గా ఉండటం కోసం.. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కేవలం రెండు నిమిషాలు చాలు.. మోచేతులు, మోకాళ్లు బ్యూటిఫుల్ గా కనిపించడానికి..
మోచేతులు, మోకాళ్ల నలుపుదనం పోవడానికి సొల్యూషన్ తెలుసుకోవడానికి ముందు.. అవి నల్లగా మారడానికి కారణాలు తెలుసుకోవాలి.
డ్రైస్కిన్ మాయిశ్చరైజర్ ని కోల్పోయి ఉంటుంది. మోచేతులు, మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం చర్మంపై రఫ్ గా ఉండే క్లాత్స్, ఫ్యాబ్రిక్ ఉపయోగించడం ఎండకు తిరగడం
మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువగా పేరుకుపోవడం
కారణాలు తెలుసుకున్నారు కదా.. ఇకపై వీటిని రిపీట్ చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే.. న్యాచురల్ రెమెడీ ద్వారా.. మోకాళ్లు ,మోచేతల నలుపుదనాన్ని పోగొట్టుకోండి. నల్లటి మోకాళ్లు, మోచేతులు నివారించడంలో ఉల్లి, వెల్లుల్లి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
ఉల్లిపాయలో విటమిన్ ఏ, సి, ఈ అన్నీ పుష్కలంగా ఉంటాయి. అలాగే.. పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఫ్రీరాడికల్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. వెల్లుల్లిలో అల్యూసిన్ ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ ని కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని స్మూత్ గా ఉంచడంతోపాటు, ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
1 టీస్పూన్ ఉల్లిపాయ రసం
1 టీస్పూన్ వెల్లుల్లి రసం
1 టీ స్పూన్ రోజ్ వాటర్
అర టీస్పూన్ నిమ్మరసం
అర టీస్పూన్ గ్లిజరిన్
తయారు చేసే విధానం
ఉల్లి, వెల్లుల్లి రసంతో పాటు పైన చెప్పిన పదార్థాలన్నింటినీ.. ఒక గిన్నెలో కలుపుకోవాలి. అందులో కాటన్ బాల్ ముంచి.. మోచేతులు, మోకాళ్లకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని.. ఆరనివ్వాలి.
ఇలా.. వారానికి మూడు సార్లు చేయడం వల్ల.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి
ఎండకు వెళ్లాల్సి వచ్చిన ప్రతిసారీ.. సన్ స్క్రీన్ అప్లై చేయాలి.
నీళ్లు ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరంలోని మలినాలు.. బయటకు పోతాయి.
Comments
Post a Comment