చర్మాన్ని అసహ్యంగా మార్చే బ్లాక్ హెడ్స్ ఎందుకు వస్తాయో తెలుసా ?

బ్లాక్ హెడ్స్ ముఖంపై ఉండే.. ఎంత నిగారింపు ఉన్నా, ఎంత మేకప్ వేసుకున్నా ఆ లుక్ మొత్తం చెడిపోతుంది. బ్లాక్ హెడ్స్ మన ఆకర్షణను, చర్మ సౌందర్యాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. మొటిమలు నివారించడమైనా తేలికేమో కానీ.. బ్లాక్ హెడ్స్ తొలగించడం
నొప్పి లేకుండా.. బ్లాక్ హెడ్స్ తొలగించే సింపుల్ హోం రెమిడీస్
ముఖంలో నుదురు భాగం, ముక్కు, గడ్డం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బ్లాక్ హెడ్స్ వేధిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో కాస్త ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా వస్తాయి. అయితే బ్లాక్ హెడ్స్ రావడానికి కారణాలు మాత్రం చాలామందికి తెలియదు. బ్లాక్ హెడ్స్ ఎందుకు ఏర్పడతాయి ? కారణాలేంటో తెలుసుకుందాం..


లస్నానానికి ముందు ఫేస్ వాష్
తల స్నానానికి ముందు ఫేస్ ని క్లెన్స్ చేసుకోవడం మంచి అలవాటు కాదు. కండిషనర్ లేదా షాంపూలోని పదార్థాలు చర్మంలోకి పోయి.. బ్లాక్ హెడ్స్ రావడానికి కారణమవుతాయి. కాబట్టి.. చివరగా ముఖం శుభ్రం చేసుకోవడం మంచిది.

దుమ్ముతో కూడిన దిండు
దిండు కవర్లు చాలా దుమ్ముతో నిండి ఉంటే.. అవి చర్మానికి అంటుతాయి. దుమ్మంతా.. ముఖంపై చేరి.. బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. కాబట్టి.. ఎప్పటికప్పుడు పిల్లో కవర్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి.
హెయిర్ ప్రొడక్ట్స్
హెయిర్ ప్రొడక్ట్స్ జుట్టుని సాఫ్ట్ గా ఉంచినా.. తర్వాత పొడిబారడానికి కారణమవుతాయి. అలాగే ముఖంపై ప్రభావం చూపి.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. బ్లాక్ హెడ్స్ వస్తాయి. జుట్టుకి జెల్స్ అప్లై చేసినప్పుడు.. చర్మం, హెయిర్ లైన్ ని వదిలిపెట్టాలి. తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి.


హార్డ్ వాటర్
హార్డ్ వాటర్.. చర్మ రంధ్రాలను బ్లాక్ చేసి.. బ్లాక్ హెడ్స్ కి కారణమవుతాయి. కాబట్టి ముఖానికి ప్యూరిఫైడ్ వాటర్ ఉపయోగించాలి.


మేకప్
వ్యాయామానికి ముందు మేకప్ తొలగించుకోవడం, ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. చెమట వల్ల రంధ్రాలు ఓపెన్ అయి.. మేకప్ దాన్ని బ్లాక్ చేస్తుంది. కాబట్టి.. వ్యాయామానికి ముందు ముఖం శుభ్రం చేసుకోవాలి.


ఆయిల్ బేస్డ్ మేకప్ తొలగించకపోవడం
ఆయిల్ బేస్డ్ మేకప్ ని పూర్తీగా తొలగించకపోతే.. బ్లాక్ హెడ్స్ కి కారణమవుతాయి. కాబట్టి వారానికి 3 నుంచి 4 సార్లు స్క్రబ్ చేయడం వల్ల.. దురద తగ్గించి బ్లాక్ హెడ్స్ నివారించవచ్చు.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

రాత్రిపూట ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్ రూల్స్..!

చుండ్రు తగ్గడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు