హెల్తీ అండ్ బౌన్సీ హెయిర్ కోసం ఆమ్లా ఆయిల్ ట్రీట్మెంట్ ..!

ప్రతి ఒక్కరు జుట్టు సమస్యలను ఎదుర్కొంటుంటారు. అది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, స్ట్రె, కాలుష్యం ఇవన్నీ జుట్టు రాలడనానికి ముఖ్య కారణాలు. జుట్టు రాలడానికి కారణమేదైనా, జుట్టు రాలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. జుట్టు రాలకుండా నివారించడానికి వివిధ రకాల నూనెలున్నాయి. అందులో ఆమ్లా ఆయిల్ ఒకటి.

సహజంగా బ్యూటీ స్టోర్స్ లో వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ చూస్తుంటాము. అయితే వాటిని ది బెస్ట్ ఆయిల్ ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి,. జుట్టుకు ఆయిల్ అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు. గోరువెచ్చని నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది,దాంతో జుట్టు స్ట్రాంగ్ గా హెయిర్ రూట్స్ ను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టు నేచురల్ గా పెరుగుతుంది.

ఆమ్లాను ఇండియన్ గూస్బ్రెర్రీ అని కూడా పిలుస్తారు. ఈ ఆమ్లాలో ఫేమస్ హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ దాగున్నాయి. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంది. హెల్తీ హెయిర్ పొందడానికి ఆమ్లా ఆయిల్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఆమ్లాలలో అనేక హెయిర్ బెనిఫిట్స్ ఉండటం వల్ల దీన్ని వివిధ రకాల హెయిర్ ప్యాక్స్ లో ఉపయోగిస్తున్నారు. కాబట్టి హెల్తీ అండ్ బౌన్సీ హెయిర్ పొందాలంటే ఆమ్లా ఆయిల్ ను ఉపయోగించాలి! మరి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం...

హెల్తీ హెయిర్ పొందడానికి ఆమ్లా ఆయిల్ అందించే గ్రేట్ బెనిఫిట్స్...

హెయిర్ ఫాల్ నివారిస్తుంది

హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి కొన్ని చుక్కల ఆమ్లా ఆయిల్ ను షాంపులో మిక్స్ చేసుకోవచ్చు. తలకు షాంపు చేసే ప్రతి సారి ఈ పనిచేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టును ఎక్కువ డ్రైగా మార్చదు. జుట్టు బ్రేక్ కాకుండా ఉంటుంది.


షైనీ హెయిర్ :
మీ జుట్టుకు షాంపు చేసిన తర్వాత ఒక మగ్గు నీటిలో కొద్దిగా ఆమ్లా ఆయిల్ ను మిక్స్ చేసి తలకు అప్లై చేసుకోవచ్చు. దీన్ని హెయిర్ సెరమ్ లా కూడా ఉపయోగించుకోవచ్చు . కెమికల్స్ తో తయారుచేసిన హెయిర్ సెరమ్స్ కంటే ఇలా నేచురల్ గా తయారుచేసుకొనే హెయిర్స్ సెరమ్స్ జుట్టుకు గ్రేట్ బెనిఫిట్స్ ను అంధిస్తాయి.



రఫ్ హెయిర్ కోసం :
ఆమ్లా ఆయిల్ ను జుట్టుకు పట్టించి అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది . జుట్టు జిడ్డుగా లేకుండా చేస్తుంది. తడి జుట్టుకు కాకుండా డ్రై హెయిర్ కు అప్లై చేయడం వల్ల మరింత జిడ్డుగా కనిపిస్తుంది.


తెల్ల జుట్టు

తెల్ల జుట్టు నివారించడంలో ఆమ్లా ఆయిల్ గ్రేట్ రెమెడీ. దీన్ని కొన్ని వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. తెల్ల జుట్టు నివారణాలో ఇది గ్రేట్ గా సమాయపడుతుంది. ఆమ్లా ఆయిల్ ను తలకు మసాజ్ చేయడం వల్ల, తెల్ల జుట్టు కనబడనివ్వకుండా చేస్తుంది.


చుండ్రు నివారిస్తుంది:

ఆమ్లా ఆయిల్ వల్ల మరో గ్రేట్ బెనిఫిట్ , పొడి జుట్టుతో తలలో దురద, చుండ్రు వంటి పొట్టు రాలడం వంటి సమస్యలను నివారించడంలో ఇది గ్రేట్ రెమెడీ. ఆమ్లా ఆయిల్ జుట్టును కూల్ చేస్తుంది. దురద నివారిస్తుంది. ఆమ్లా ఆియల్ ను జుట్టుకు పూర్తిగా అప్లై చేసి, ఒక గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.



చిట్లిన జుట్టును నివారిస్తుంది:
జుట్టు చిట్లకుండా నివారించడంలో ఆమ్లా ఆయిల్ ఎక్సలెంట్ హోం రెమెడీ. కొద్దిగా ఆమ్లా ఆయిల్ ను గోరువెచ్చగా వేడి చేసిత తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.


జుట్టు చిట్లకుండా చేస్తుంది:
ఆమ్లా ఆయిల్ ను గోరువెచ్చగా చేసి, తలకు మసాజ్ చేయడం వల్ల హెయిర్ స్మూత్ గా మరియు సాఫ్ట్ అండ్ సిల్కీగా మార్చుతుంది. ఇది చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. నేచురల్ హెయిర్ పొందడానికి ఆమ్లా ఆయిల్ మంచి మార్గం. అంతే కాదు, జుట్టు స్మూత్ గా మరియు సిల్కీగా మారుతుంది.


Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్