చుండ్రు నివారణకు ఇంట్లో స్వయంగా చేసుకునే ఎఫెక్టివ్ రెమెడీస్...!
జుట్టు చూడటానికి ఎంత పొడవుగా, ఒత్తుగా ఉన్నా, శుభ్రంగా లేకపోతే జుట్టు అందంగా కనబడుదు. ఉదాహరణకు పొడవైన, ఒత్తైన జుట్టు ఉన్నా, తలలో తెల్లగా పొట్టుపొట్టుగా కనబడితే చూడటానికి అసహ్యంగా కనబడుతుంది. అంతే కాదు, నలుగురిలో దురదపెడితే మరింత ఇబ్బంది కరంగా.. మెయింటైన్ చేయడం కూడా కష్టంగా మారుతుంది.
చాలా వరకూ చుండ్రు సమస్య మెడికల్ కండీషన్స్ వల్లే వస్తుంది, కానీ ఈ సమస్యను బ్యూటీ వర్గంగా సూచిస్తుంటారు. ఈ విషయంలో ఖచ్చితంగా అవుననే చెప్పవచ్చు.
చాలా వరకూ చుండ్రు సమస్య మెడికల్ కండీషన్స్ వల్లే వస్తుంది, కానీ ఈ సమస్యను బ్యూటీ వర్గంగా సూచిస్తుంటారు. ఈ విషయంలో ఖచ్చితంగా అవుననే చెప్పవచ్చు.
ఒక బ్యూటిఫుల్ గా ఉండే మీకు నచ్చిన బ్లాక్ డ్రెస్ ను దరించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, చెప్పండి. పైకి ఎన్ని మేకప్పులు చేసినా..ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా, తెల్లగా పొట్టుపొట్టుగా డ్రెస్ మీద రాలి, నలుగురిలో ఇబ్బంది కలిగిస్తుంది.
జుట్టు సమస్యల్లో చుండ్రును దాచడానికి కూడా కుదరదు. ఇలాంటి సమస్య నుండి బయటపడటం ఎలా? జుట్టు సమస్యల్లో చుండ్రు ఒక సాధారణ సమస్య. తలలో చుండ్రు ఏర్పడుటకు శుభ్రతపాటించకపోవడం, ఈస్ట్ అలర్జీ, తలలో డ్రై స్కిన్, చీకాకు కలిగించే ఆయిలీ స్కిన్, ఎగ్జిమా, లేదా పోరియోసిస్, వ్యాధినిరోధకత లోపించడంలో, హార్ట్ డిసీజ్, స్ట్రోక్, వంటి జబ్బుల వల్ల, ఎక్కువ షాంపు వాడటం వల్ల తలలో డ్రైనెస్ పెరిగి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది .
ఎక్సెస్ ఆయిల్ తలలో ఎక్కువగా చేరి చుండ్రుకు దారితీస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. చుండ్రు కేవలం ఆయిల్ స్కాల్ఫ్ వల్లే అని చాలా మంది నమ్ముతారు, కానీ పౌష్టికాహార లోపం మరియు ఒత్తిడి వల్ల కూడా చుండ్రు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఈ డాండ్రఫ్ సమస్యను నివారించుకోవడానికి స్టోర్స్ లోమెడికేటెడ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ ను తీసుకోవడం కంటే ఇంట్లో స్వయంగా ట్రై చేసి, టెస్ట్ చేసిన కొన్ని హోం రెమెడీస్ ను ప్రయత్నించండి. ఇవి చుండ్రును చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. అంతకూ ఈ సమస్య తగ్గకపోతే మెడికేటెడ్ షాంపులను ప్రయత్నించండి. ఈ క్రింది సూచించిన నేచురల్ రెమెడీస్ ఏంటో ఏవిధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం.....
Comments
Post a Comment