రెగ్యులర్ గా నట్స్ తినే మహిళలు హెల్తీగా ఉంటారా ?

నట్స్ తినని మహిళలతో పోల్చితే.. నట్స్ తినే మహిళలు చాలా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు నిరూపించాయి. నట్స్ తినని మహిళలతో పోల్చితే.. 5నట్స్ ని రెగ్యులర్ గా తినే మహిళలకు 30 శాతం డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు తేల్చాయి.
అలాగే నట్స్ తినే మహిళలు బరువు తగ్గడం, ఎక్కువ ఫైబర్ పొందడం, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఈ, సోడియం తక్కువగా పొందడంతో పాటు.. ఇన్ఫ్లమేషన్ తో పోరాడే శక్తిని కలిగి ఉంటారట. రెగ్యులర్ గా నట్స్ తినే మహిళల్లో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసెరైడ్స్ తగ్గుతాయట.
నట్స్ లో దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టే సత్తా ఉంటుంది. నట్స్ ని రెగ్యులర్ గా తీసుకుంటే.. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అన్ని రకాల నట్స్ మంచిదే అని.. అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి దాంట్లో విభిన్నమైన గుణాలు ఉంటాయి. అన్నింటిలోనూ హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి.

నట్స్ లో ఫైటో కెమికల్స్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. నట్స్ లో ఫ్యాట్ ఉంటుంది. కానీ.. చాలా తక్కువ అన్ హెల్తీ శ్యాచురేటెడ్ ఉంటుంది. కాబట్టి ఇవేం అనారోగ్యకరం కాదు.

వాల్ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్ాయటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండెకు చాలా మంచిది. బాదాంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. పిస్తాలలో ల్యూటిన్, జ్సిజాంథిన్ ఉండటం వల్ల కళ్లు, మెదడుకి మంచిది.


మహిళలు నట్స్ ని ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా, ఎలాగైనా తీసుకోవచ్చు. ఎలాంటి నట్ అయినా.. హెల్తీ స్నాక్. ముఖ్యంగా.. వీటిని రోస్ట్ చేసి.. తక్కువ సాల్ట్ వేసుకుని తీసుకోవచ్చు. వాటిని అలాగే తినవచ్చు లేదా సలాడ్స్, డిజర్ట్స్, బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్