హెడ్ బాత్ చేసినా...హెయిర్ ఆయిలీగా కనబడుతుంటే..ఇలా చేయండి..

సాధారణ జుట్టు సమస్యల్లో ఆయిలీ హెయిర్ ఒకటి. మీరు రెగ్యులర్ గా తలస్నానం చేస్తున్నా, జుట్టు ఎప్పుడూ జిడ్డుగా కనబడుతుంటుందా ? తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ జిడ్డు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా కేశాల మీద ప్రభావం చూపుతుంది. నూనె వల్ల జుట్టు మరింత మురికిగా, జిడ్డుగా కనబడేలా చేస్తుంది.

అలాగే మరికొంత మందిలో జీన్స్, హార్మోనుల ప్రభావంతో పాటు, అసాధారణ ఆహారపు అలవాట్లు , ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా జుట్టు జిడ్డుగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆయిలీ హెయిర్ జుట్టుకు సంబంధించిన చుండ్రు, జుట్టు చిట్లడం వంటి సమస్యలకు కారణమవుతుంది.

ఇలాంటి జుట్టును మ్యానేజ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి జుట్టు నిర్వాహణ కోసం ఒక సులభమైన, పవర్ఫుల్ హోం మేడ్ హెయిర్ మాస్క్ ను పరిచయం చేస్తున్నాం. ఇది ఆయిల్ జుట్టుకు ఉపయోగించి, ఆయిలీ హెయిర్ నునివారించుకోండి.
ఆయిల్ హెయిర్ నివారించుకోవడానికి వంటగదిలోని కొన్ని పదార్థాలు చాలా ఉపయోగకరమైనవి. వంటగదిలో ఉండే ఎగ్ వైట్, ఉప్పు, నిమ్మరసం వీటన్నింటిలో, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు లోపల నుంచి పోషణను అందిస్తాయి. అలాగే తలలో ఉండే అదనపు నూనెను గ్రహిస్తాయి.
ఈ పదార్థాలు యాంటీబ్యాక్టీరియల్ స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడతాయి. ఆయిలీ హెయిర్ ను నివారించుకోవడానికి ఇంట్లో మీరు ఉపయోగించాల్సిన కొన్ని ఎఫెక్టివ్ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ ..ఈ క్రింది విధంగా..


వెనిగర్:
ఆయిలీ స్కాల్ఫ్ కు ఆపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేయడం వల్ల నేచురల్ గా డ్రై అవుతుంది. దాంతో జుట్టులో ఆయిల్ నెస్ తగ్గించబడుతుంది. వెనిగర్ అప్లై చేసిన 20 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

అలోవెర:

కలబందలో విటమిన్స్, మినిరల్స్ , ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఆయిల్ హెయిర్ నివారించడంలో చాలా గ్రేట్ రెమెడీ. అలోవెర తలలో మలినాలను నివారిస్తుంది . తలలో ఆయిల్ ఉత్పత్తిని నివారిస్తుంది, ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది, మరియు జుట్టును స్మూత్ గా మార్చుతుంది. ఒక టీస్పూన్ అవోవెర జెల్లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని షాంపుతో మిక్స్ చేసి తలస్నానం చేసుకోవాలి. తలకు పట్టించి, 10నిముషాలు తర్వాత తలస్నానం చేయాలి. ఈ షాంపు వల్ల జుట్టు తలలో ఆయిల్ కంట్రోల్ అవుతుంది.



ఆపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ ఆయిల్ హెయిర్ నివారించడంలో ఎపెక్టివ్ గా సహాయపడుతుంది. . ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే అసిటిక్ యాసిడ్ తలలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది . మరియు ఇది ఎఫెక్టివ్ గా హెయిర్ టానిక్ గా పనిచేస్తుంది. జుట్టును సాఫ్ట్ గా మరియు షైనిగా మార్చుతుంది. 3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక కప్పు నీటిలో మిక్స్ చేసి, షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.


గ్రీన్ టీ:
గ్రేట్ ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే టానిక్ యాసిడ్ తలలో ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది. చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది. రెండు కప్పుల నీటిలో టీ ఆకులను వేసి బ10 నిముషాలు బాగా మరిగించి , రూమ్ టెంపరేచర్ లో చల్లార్చాలి . ఈ గోరువెచ్చని బ్లాటీని తలకు పోసుకుని మసాజ్ చేయాలి. 10 నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. వారంలో 3 సార్లు ఇలా చేస్తుంటే ఆయిల్ హెయిర్ నివారించబడుతుంది.




హెన్నా
హెన్నా డీప్ కండీషనర్ గా పనిచేస్తుంది. ఆయిల్ హెయిర్ నివారించడంలో ఇది నేచురల్ రెమెడీ. హెన్నాను కొద్దిగా టీ డికాషన్ మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసి రాత్రంతా అలాగే నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం ఈ హెన్నా పేస్ట్ ను జుట్టుకు అప్లై చేయాలి. ఒకటి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.




గుడ్డు పచ్చసొన :
రెండు గుడ్లు తీసుకుని బాగా మిక్స్ చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి, 5 నిముషాలు అలాగే వదిలేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.



ఉప్పు:
తలలో కొద్దిగా టేబుల్ సాల్ట్ చికలరించి , చేతులకు తేమ చేసి, మసాజ్ చేయాలి. నిధానంగా 1`0 నిముషాలు మసాజ్ చేసిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో ఎక్సెస్ ఆయిల్ తొలగిపోతుంది.


రోజ్మెర్రీ

ఇది ఎక్సెలంట్ హోం రెమెడీ. ఆయిల్ జుట్టు నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. సరైన మోతాదులో అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రెండు టీస్పూన్ల రోజ్మెర్రీ ఆయిల్లో 2 టీస్పూన్ల జోజోబా ఆయిల్ మిక్స్ చేసి మసాజ్ చేయాలి. తలమొత్తం అప్లై చేసి10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.




పొట్లకాయ:
పొట్లకాయను మెత్తగా పేస్ట్ చేసి అందులోని రసాన్ని తలకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ుంటుంది. తలలో ఆయిల్ నెస్ తగ్గుతుంది. . ఆయిల్ స్కాల్ఫ్ నివారించడబడుతుంది.



బ్రాంది:

ఆయిల్ స్కాల్ఫ్ ఎలా నివారించుకోవాలని చూస్తుంటే ఇది ఒక బెస్ట్ రెమెడీజ రెండు టేబుల్ స్పూన్ల బ్రాందిలో తేనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి అందులోనే ఒక గుడ్డులోని పచ్చసొన మిక్స్ చేసి మసాజ్ చేయాలి. 30 నిముషాలు వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడా
బేకింగ్ సోడాలో ఆయిల్ ను గ్రహించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆయిల్ హెయిర్ కు గ్రేట్ హోం రెమెడీ. . ఇందులో ఉండే ఆల్కలైన్ నేచర్ తలలోని పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఆయిల్ తగ్గిస్తుంది. ఫ్యూయల్ స్మెల్ తగ్గిస్తుంది.


టమోటో
టమోటోల్లో ఉండే అసిడిక్ నేచర్ తలలో పిహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇది తలలోని ఎక్సెస్ ఆయిల్ సెక్రికేషన్ ను కంట్రోల్ చేస్తుంది. ఫ్యూయల్ స్మెల్ తగ్గిస్తుంది. బాగా పండిన టమోటోలో కొద్దిగా ఫుల్లర్స్ ఎర్త్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. తర్వాత షవర్ క్యాప్ ధరించి అరగంట తర్వాత చల్లటి నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్