స్ట్రాంగ్ అండ్ షైనీ హెయిర్ కోసం బెస్ట్ ఆయిల్స్..!

జుట్టు అందంగా...స్ట్రాంగ్ గా...మంచి షైనింగ్ తో మెరుస్తుండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? ప్రతి ఒక్కరూ ఇలాంటి జుట్టుండాలని కలలు కంటారు?అయితే, కొన్ని కారణాల వల్ల అలాంటి జుట్టును మనం పొందలేకపోతున్నాము. స్ట్రెస్, అన్ హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ , నిద్ర , వాటర్ సరిగా తాగకపోవడం ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా మన ఆరోగ్యం మీద మాత్రమే కాదు, అందం మీద కూడా ప్రభావం చూపుతుంది. అందుకు కొన్ని సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ అండ్ షైనీ హెయిర్ పొందాలంటే బెస్ట్ హెయిర్ ఆయిల్స్ ఉపయోగించడమే..

జుట్టుఆరోగ్యానికి ఆయిల్ అప్లై చేయడం మొదటి పద్దతి. ఈ పద్ధతి కొన్ని జనరేషన్స్ నుండి ఉపయగిస్తున్నారు . పురాతన కాలం నుండే జుట్టుకు నూనెలు రాయడం వల్ల ఆకాలంలో వారి జుట్టు అందంగా, పొడవుగా నాజుగ్గా ఉండేవి. ఆవిషయాలను వారు చెప్పడం , మన వినడం కూడా చేస్తుంటాము. కానీ ఈ మోడ్రన్ యుగంలో ఏవొక్కరూ తలకు నూనె రాయరు. దానికి తోడు హెయిర్ ఫాల్ అవుతుందని, తెల్లబడుతోందని, పల్చబడుతోందని బాధపడుతుంటారు. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే ఇప్పటికైన తలకు నూనె రాయడం అలవాటు చేసుకోండి.

కెమికల్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉంటూ, నేచురల్ పదార్థాలను ఎంపిక చేసుకోవడం సురక్షితమైన పద్దతి. జుట్టు ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా...షైనీగా పెంచుకోవడానికి కొన్ని నేచురల్ ఆయిల్స్ ను ఇక్కడ పరిచయం చేస్తున్నాము..


ఆముదం:
ఆముదం , వెజిటేబుల్ ఆయిల్ అంత రిచ్ ఆయిల్. ఎందుకంటే ఆముదంలో ఓమేగా 9ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ బిలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలకు మంచిది. ఆముదంను వివిధ రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ కోసం ఉపయోగిస్తుంటారు. ఆముదంను తలకు అప్లై చేయడం వల్ల ఇది తలలో ఇన్ఫెక్షన్స్, చుండ్రు నివారిస్తుంది . స్ట్రాంగ్ హెయిర్ పొందడానికి ఇది ఒక బెస్ట్ హెయిర్ ఆయిల్ .


కొబ్బరి నూనె:
అన్ని రకాల జుట్టు వారికి కొబ్బరి నూనె సూట్ అవుతుంది, కొన్ని వేల సంవత్సరాల నుండి బ్యూటీలో బాగంగో కొబ్బరి నూనెను ఉపయోగిస్తున్నారు! కొబ్బరి నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత పవర్ ఆయిల్ ఇది. .జుట్టు చాలా తేలికగా ఈ నూనెను గ్రహిస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు, తలలో దురదను మరియు చుండ్రును నివారిస్తుంది.



గ్రేప్ సీడ్ ఆయిల్ :
ఈ నూనెను తలకు మాత్రమే అప్లై చేయాలి. జుట్టు పొడవునా అప్లై చేయాల్సిన అవసరం లేదు. దీనికి కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి జుట్టు మొత్తానికి అప్లై చేయ్యొచ్చు. ఈ నూనె అప్లై చేయడం వల్ల తలలో ఇన్ఫెక్షన్స్, నివారిస్తుంది, జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది.


ఆలివ్ ఆయిల్:
చిట్లిన మరియు డ్యామేజ్ అయిన జుట్టుకు ఆలివ్ ఆయిల్ బెస్ట్ నేచురల్ ఆయిల్ . ఆలివ్ ఆయిల్ ను తలకు అప్లై చేసి షవర్ క్యాప్ పెట్టుకుని, అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు సమస్యలు నివారించుకోవచ్చు.

ఆర్గాన్ ఆయిల్:
అన్ని రకాల నూనెలలోకి ఆర్గాన్ ఆయిల్ ఒకటి. హెయిర్ స్ట్రాంగ్ గా మార్చడంలో ఇది బెస్ట్ ఆయిల్. ఇందులో ఓమేగా ఫ్యాటీ 9 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. జుట్టును స్ట్రాంగ్ గా హెల్తీగా మార్చుతుంది.


ఆమ్లా ఆయిల్:

దీన్ని ఇండియన్ గూస్బెర్రీ అని పిలుస్తారు, ఈ నూనెను మహిళలందరూ ఇష్టపడుతారు. చిట్లిన జుట్టుకు ఇది గ్రేట్ హెయిర్ కండీషనర్. ఇంకా ఇది ప్రీమెచ్యుర్ గ్రే హెయిర్ ను తగ్గిస్తుంది. మీ రొటీన్ హెయిర్ కేర్ లో బాగంగా దీన్ని ఉపయోగించడం మంచిది.



అవొకాడో ఆయిల్:
అవొకాడో ఆయిల్ అంత సులభంగా అందుబాటులో దొరకదు. ఈ లిస్ట్ లో మరో ఆయిల్ ను చేర్చుకోవడం మంచిది. విటమిన్ ఎ, బిలు గ్రేట్ గా సహాయపడుతాయి. అవొకాడో ఆయిల్ చిట్లిన జుట్టుకు మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది . డ్యామేజ్ అయిన జుట్టుకు ఇదిబెస్ట్ ఆయిల్ . ఇది తలకు పోషణను అందిస్తుంది. కొత్తగా జుట్టు పెరుగుతుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్